శ్రీమద్భగవద్గీత - 024: 01వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 024: Chap. 01, Ver. 24



🌹శరీమద్భగవద్గీత 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ

🌴పరధమ అధ్యాయము🌴
శ్లోకము 24

సంజయ ఉవాచ
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్తాపయిత్వా రథోత్తమమ్ ||

సంజయుడు పలికెను : ఓ భరతవంశీయుడా! అర్జునునిచే ఆ విధముగా సంభోదింపబడినవాడై శ్రీకృష్ణభగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను.

భాష్యము : ఈ శ్లోకము నందు అర్జునుడు గుడాకేశునిగా సంబోధింపబడినాడు. “గుడాక”మనగా నిద్ర యని భావము. అట్టి నిద్రను జయించినవాడు గుడాకేశునిగా పిలువబడును. నిద్రయనగా అజ్ఞానమని భావము. అనగా అర్జునుడు శ్రీకృష్ణభగవానుని సఖ్యము కారణమున నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని జయించెను. కృష్ణభక్తునిగా అతడు శ్రీకృష్ణభగవానుని క్షణకాలము సైతము మరిచియుండలేదు. ఏలయన అదియే భక్తుని లక్షణము. నిద్రయందైనను లేదా మెలకువ యందైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుని నామ, రూప, గుణ, లీలల స్మరణమును మరువడు. ఆ విధముగా కృష్ణభక్తుడు శ్రీకృష్ణునే నిరంతరము తలచుచు నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని సులభముగా జయింపగలుగును. ఇదియే “కృష్ణభక్తి రసభావనము” లేదా సమాధి యని పిలువబడుచున్నది. హృషీకేశునిగా లేదా ప్రతిజీవి యొక్క ఇంద్రియమనముల నిర్దేశకునిగా శ్రీకృష్ణభగవానుడు ఇరుసేనల నడుమ రథమును నిలుపుమనెడి అర్జునిని ప్రయోజనమును అవగతము చేసికొనెను. కనుకనే అతడు ఆ విధముగా నొనర్చి ఈ క్రింది విధముగా పలికెను.



🌹 Bhagavad-Gita as It is 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 🌴
Verse 24

sañjaya uvāca:

evam ukto hṛṣīkeśo
guḍākeśena bhārata
senayor ubhayor madhye
sthāpayitvā rathottamam

Sañjaya said: O descendant of Bharata, having thus been addressed by Arjuna, Lord Kṛṣṇa drew up the fine chariot in the midst of the armies of both parties.

Purport :  In this verse Arjuna is referred to as Guḍākeśa. Guḍākā means sleep, and one who conquers sleep is called guḍākeśa. Sleep also means ignorance. So Arjuna conquered both sleep and ignorance because of his friendship with Kṛṣṇa. As a great devotee of Kṛṣṇa, he could not forget Kṛṣṇa even for a moment, because that is the nature of a devotee. Either in waking or in sleep, a devotee of the Lord can never be free from thinking of Kṛṣṇa’s name, form, qualities and pastimes. Thus a devotee of Kṛṣṇa can conquer both sleep and ignorance simply by thinking of Kṛṣṇa constantly. This is called Kṛṣṇa consciousness, or samādhi. As Hṛṣīkeśa, or the director of the senses and mind of every living entity, Kṛṣṇa could understand Arjuna’s purpose in placing the chariot in the midst of the armies. Thus He did so, and spoke as follows

🌹🌹🌹🌹🌹