శ్రీమద్భగవద్గీత - 051: 02వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 051: Chap. 02, Ver. 04


🌹. శ్రీమద్భగవద్గీత - 51 / Bhagavad-Gita - 51 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 4 🌴

4. అర్జున ఉవాచ


కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభి: ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||


🌷. తాత్పర్యం :

అర్జునుడు పలికెను: ఓ శత్రుసంహారా! ఓ మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణుల వంటివారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను?

🌷. భాష్యము :

పితామహుడైన భీష్ముడు, ఆచార్యుడైన ద్రోణాచార్యుల వంటి గౌరవనీయులగు పెద్ద సదా పూజింప దగినవారు. అటువంటి వారు దాడి చేసినను వారి యెడ ఎదురు దాడి చేయరాదు. పెద్దలతో వాగ్యుద్ధమునకైనను దిగకుండుట సాధారణ కట్టుబాటు.

కొన్నిమార్లు వారు కటువుగా వర్తించినను వారి యెడ కటువుగా వర్తించరాదు. అట్టి యెడ వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యము కాగలదు? కృష్ణుడు ఆ విధముగా ఎన్నడైనా తాతయైన ఉగ్రసేనుని గాని, గురువైన సాందీపమునిని గాని ఎదుర్కొనెనా? ఈ విధమైన కొన్ని వాదములను అర్జునుడు శ్రీకృష్ణునకు తెలియ జేయుచున్నాడు.

🌹🌹🌹🌹🌹



🌹 Bhagavad-Gita as It is - 51 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 4 🌴


4. arjuna uvāca kathaṁ bhīṣmam ahaṁ saṅkhye droṇaṁ ca madhusūdana iṣubhiḥ pratiyotsyāmi pūjārhāv ari-sūdana


🌷 Translation :

Arjuna said: O killer of enemies, O killer of Madhu, how can I counterattack with arrows in battle men like Bhīṣma and Droṇa, who are worthy of my worship?


🌷 Purport :

Respectable superiors like Bhīṣma the grandfather and Droṇācārya the teacher are always worshipable. Even if they attack, they should not be counterattacked. It is general etiquette that superiors are not to be offered even a verbal fight. Even if they are sometimes harsh in behavior, they should not be harshly treated.

Then, how is it possible for Arjuna to counterattack them? Would Kṛṣṇa ever attack His own grandfather, Ugrasena, or His teacher, Sāndīpani Muni? These were some of the arguments offered by Arjuna to Kṛṣṇa.

🌹🌹🌹🌹🌹


22 Jun 2019