శ్రీమద్భగవద్గీత - 053: 02వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 053: Chap. 02, Ver. 06
🌹. శ్రీమద్భగవద్గీత - 53 / Bhagavad-gita - 53 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 6 🌴
6. న చైతద్ విద్మ: కతరన్నో గరీయో యద్ వా జయేమ యది వా నో జయేయు:
యానేవ హత్వాన జిజీవిషామః తే వస్థితా: ప్రముఖే ధార్తరాష్ట్రా: ||
తాత్పర్యం :
వారిని జయించుట ఉత్తమమో లేక వారిచే జయింపబడుట ఉత్తమమో మేము తెలియకున్నాము. ధృతరాష్ట్రుని తనయులను చంపినచో మేమిక జీవించియుండుట వ్యర్థము. అయినప్పటికిని వారిపుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు.
భాష్యము :
యుద్ధము చేయుట క్షత్రియుల ధర్మమైనను అనవసర హింసకు కారణమగుచు యుద్ధము చేయవలెనా లేక యుద్దమును త్యజించి భిక్షపై జీవించవలెనా అర్జునుడు తెలియలేకపోయెను. శత్రువును జయింపని యెడ భిక్షాటనయే అతనికి జీవనాధారము కాగలదు. అలాగని విజయము నిశ్చయముగా లభించునని కుడా లేదు.
ఏలయన యుద్ధమునందు ఇరుపక్షములలో ఎవరైనను జయమును సాధింపవచ్చును. ఒకవేళ విజయము వారి కొరకై వేచియున్నను (మరియు వారి యుద్ధకారణము న్యాయసమ్మతమైనను) యుద్ధమందు ధృతరాష్ట్రుని తనయులు మరణించినచో వారి అభావమున జీవించుట కష్టతరము కాగలదు. అట్టి పరిస్థితులలో అది వారికి వేరొక రకమైన అపజయము కాగలదు.
అర్జునిని ఈ భావములన్నియును అతడు గొప్ప భగవద్భక్తుడు అనియే గాక, అత్యున్నత జ్ఞానపూర్ణుదనియు మరియు మనో ఇంద్రియములపై పూర్ణ నిగ్రహము కలవాదనియు స్పష్టముగా నిరూపించుచున్నవి. రాజవంశములో జన్మించినను భిక్షమెత్తి జీవించుట యనెడి కోరిక అతని వైరాగ్యమునకు మరొక చిహ్నమై యున్నది. ఈ గుణములు మరియు శ్రీకృష్ణుని(ఆధ్యాత్మికగురువు) ఉపదేశాములపై అతని శ్రద్ధ యనునవి అతడు నిక్కముగా ధర్మాత్ముడని సూచించుచున్నవి.
కనుకనే అతడు ముక్తికి అర్హుడై యున్నాడని నిర్దారింపబడినది. ఇంద్రియములు నిగ్రహింపబడనిదే జ్ఞానస్థాయికి ఉద్దరింపబడు అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తికి అవకాశము లేదు. లౌకిక సంబంధములో అపరిమిత గుణములతో పాటుగా అర్జునుడు ఈ గుణములందును యోగ్యుడైయున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 53 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 6 🌴
6. na caitad vidmaḥ kataran no garīyo yad vā jayema yadi vā no jayeyuḥ yān eva hatvā na jijīviṣāmas te ’vasthitāḥ pramukhe dhārtarāṣṭrāḥ
Translation : Nor do we know which is better – conquering them or being conquered by them. If we killed the sons of Dhṛtarāṣṭra, we should not care to live. Yet they are now standing before us on the battlefield.
Purport :
Arjuna did not know whether he should fight and risk unnecessary violence, although fighting is the duty of the kṣatriyas, or whether he should refrain and live by begging. If he did not conquer the enemy, begging would be his only means of subsistence. Nor was there certainty of victory, because either side might emerge victorious. Even if victory awaited them (and their cause was justified), still, if the sons of Dhṛtarāṣṭra died in battle, it would be very difficult to live in their absence. Under the circumstances, that would be another kind of defeat for them.
All these considerations by Arjuna definitely proved that not only was he a great devotee of the Lord but he was also highly enlightened and had complete control over his mind and senses. His desire to live by begging, although he was born in the royal household, is another sign of detachment. He was truly virtuous, as these qualities, combined with his faith in the words of instruction of Śrī Kṛṣṇa (his spiritual master), indicate. It is concluded that Arjuna was quite fit for liberation.
Unless the senses are controlled, there is no chance of elevation to the platform of knowledge, and without knowledge and devotion there is no chance of liberation. Arjuna was competent in all these attributes, over and above his enormous attributes in his material relationships.
🌹🌹🌹🌹🌹
24 Jun 2019