✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 8 🌴
8. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యాచ్చోకముచ్చోషణ మిన్ద్రియాణామ్ |
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||
తాత్పర్యం :
ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకనును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను.
భాష్యము :
ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకనును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యమువలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించు కొనజాలను.
ధర్మనియమములు, నీతి నియమముల జ్ఞానముపై ఆధారపడిన పలువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నాను తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణభగవానుని సహాయము లేకుండా పరిష్కరించుకొనజాలనట్లు విదితమగుచున్నది. స్వీయమనుగుడనే శోషింపజేయునట్టి సమస్యలను నివారించుటలో తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమని అతడు అవగతము చేసికొనగలిగెను.
శ్రీకృష్ణభగవానుని వంటి గురువు సహాయము లేకుండా అట్టి కలతలకు పరిష్కారమును గూర్చుట అతనికి అసాధ్యము. పుస్తకజ్ఞానము, పాండిత్యము, ఉన్నతపదవుల వంటివి జీవితసమస్యలకు పరిష్కారము నొసగుటలో వ్యర్తములై యున్నవి. శ్రీకృష్ణుని వంటి గురువొక్కడే సమస్యా పరిష్కారమునకు సహాయము చేయగలడు.
కనుక సారంశమేమనగా నూటికినూరుపాళ్ళు కృష్ణభక్తిరసభావితుడైన గురువే ప్రామాణికుడైన గురువు. ఏలయన అట్టివాడే జీవితసమస్యలను పరిష్కరింపగలడు. కృష్ణసంబంధ విజ్ఞానముణ నిష్ణాతుడైనవాడు నిజమైన ఆధ్యాత్మికగురువని శ్రీచైతన్యమాహాప్రభువు తెలిపిరి. దానికి అతని సాంఘికస్థాయి ఏ విధముగను అవరోధము కాజాలదు.
కిబా విప్ర, కిబా న్యాసి, శూద్ర కేనే నయ |
యై కృష్ణతత్త్వవేత్తా, సేఇ గురు హయ ||
“కృష్ణసంబంధ విజ్ఞానమునందు మనుజుడు నిష్ణాతుడైనచో అతడు విప్రుడైనను (వేదజ్ఞానపండితుడు) లేదా హీనకులజుడైనను లేదా సన్న్యాసియైనను సరియే, అతడే పూర్ణుడైన ప్రామాణిక ఆధ్యాత్మికగురువై యున్నాడు” (చైతన్య చరితామృత ,మధ్య 8.128). అనగా కృష్ణసంబంధ విజ్ఞానమున నిష్ణాతుడు కానిదే ఎవ్వరును ప్రామాణిక ఆధ్యాత్మికగురువు కాజాలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 45 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 8 🌴
8. na hi prapaśyāmi mamāpanudyād yac chokam ucchoṣaṇam indriyāṇām avāpya bhūmāv asapatnam ṛddhaṁ rājyaṁ surāṇām api cādhipatyam
Translation :
I can find no means to drive away this grief which is drying up my senses. I will not be able to dispel it even if I win a prosperous, unrivaled kingdom on earth with sovereignty like the demigods in heaven.
Purport :
Although Arjuna was putting forward so many arguments based on knowledge of the principles of religion and moral codes, it appears that he was unable to solve his real problem without the help of the spiritual master, Lord Śrī Kṛṣṇa. He could understand that his so-called knowledge was useless in driving away his problems, which were drying up his whole existence; and it was impossible for him to solve such perplexities without the help of a spiritual master like Lord Kṛṣṇa.
Academic knowledge, scholarship, high position, etc., are all useless in solving the problems of life; help can be given only by a spiritual master like Kṛṣṇa. Therefore, the conclusion is that a spiritual master who is one hundred percent Kṛṣṇa conscious is the bona fide spiritual master, for he can solve the problems of life. Lord Caitanya said that one who is a master in the science of Kṛṣṇa consciousness, regardless of his social position, is the real spiritual master.
kibā vipra, kibā nyāsī, śūdra kene naya
yei kṛṣṇa-tattva-vettā, sei ‘guru’ haya
“It does not matter whether a person is a vipra [learned scholar in Vedic wisdom], or is born in a lower family, or is in the renounced order of life – if he is a master in the science of Kṛṣṇa, he is the perfect and bona fide spiritual master.” (Caitanya-caritāmṛta, Madhya 8.128) So without being a master in the science of Kṛṣṇa consciousness, no one is a bona fide spiritual master.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
26 Jun 2019