శ్రీమద్భగవద్గీత - 032: 01వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 032: Chap. 01, Ver. 32

🌹. శ్రీమద్భగవద్గీత - 32 / Bhagavad-Gita - 32 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రధమ అధ్యాయము - విషాదయోగము - 32 🌴


32. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ||
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా |


🌷. తాత్పర్యం :

ఓ కృష్ణా! తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నను. ఓ గోవిందా! మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతము కోరుచున్నమో వారందరును ఈ యుద్ధమున నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి?


🌻. భాష్యము :

మనుజుని నిజలాభాము విష్ణువు (లేదా కృష్ణుడు) నందే కలదని తెలియక బద్ధజీవులు దేహపరబంధముల యెడ ఆకర్షితులగుదురు.

వాటి యందు తాము ఆనందము పొందగలమని వారు అభిలషింతురు. జీవితపు అట్టి అంధమయ భావనలో వారు భౌతికసుఖమునకు హేతువులైన వాటిని సైతము మరచిపోవుదురు. ఇచ్చట అర్జునుడు క్షత్రియధర్మమును మరచినట్లుగా తోచుచున్నది.

శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములో రణరంగమునందు మరణించు క్షత్రియుడు మరియు ఆధ్యాత్మికానుభవము కొరకే అంకితమైన సన్యాసి యనెడి ఇరుపురు శక్తివంతమును మరియు తేజోమయమును అగు సూర్యమండలమున ప్రవేశింపయోగ్యులు కాగలరని తెలుపబడినది. బంధువుల మాట అటుంచి శత్రువులను వధించుటకు సైతము అర్జునుడు విముఖుడై యుండెను. బంధువులను చంపుట వలన తనకు జీవితమున సుఖము లభింపదని అతడు భావించెను.

కనుకనే ఆకలిలేనివాడు వంట చేయుటకు నిరాకరించురీతి అతడు యుద్ధము చేయుటకు ఇచ్చగింపలేదు. ఇపుడతడు వనముకేగి వ్యర్థముగా ఒంటరి జీవితమును గడప నిశ్చయించు కొనెను. క్షత్రియునిగా జీవనార్థమై అతనికి ఒక రాజ్యము అవసరము.

ఏలయన క్షత్రియులు ఇతర ఏ వృత్తులు యందును నియుక్తులు కాజాలరు. కాని ప్రస్తుతము అర్జునుడు రాజ్యమును కలిగిలేడు. జ్ఞాతులలో మరియు సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యమును తిరిగి పొందుట ఒక్కటే రాజ్యమును పొందుటకు అర్జునునకు అవకాశమై యుండెను.

కాని ఆ విధముగా ఒనర్చుటకు అతడు ఇష్టపడలేదు. కనుకనే ఒంటరిగా విఫల జీవితమును గడుపుటకు వనమున కేగుట ఒక్కటే తనకు తగినదని అతడు భావించెను.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 32 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 - Vishada Yoga - 32 🌴


32. na kāṅkṣe vijayaṁ kṛṣṇa
na ca rājyaṁ sukhāni ca
kiṁ no rājyena govinda
kiṁ bhogair jīvitena vā


🌷. Translation :

nor can I, my dear Kṛṣṇa, desire any subsequent victory, kingdom or happiness. O Govinda, of what avail to us are a kingdom, happiness or even life itself when all those for whom we may desire them are now arrayed on this battlefield?


🌻. Purport :

Without knowing that one’s self-interest is in Viṣṇu (or Kṛṣṇa), conditioned souls are attracted by bodily relationships, hoping to be happy in such situations.

In such a blind conception of life, they forget even the causes of material happiness. Arjuna appears to have even forgotten the moral codes for a kṣatriya.

It is said that two kinds of men, namely the kṣatriya who dies directly in front of the battlefield under Kṛṣṇa’s personal orders and the person in the renounced order of life who is absolutely devoted to spiritual culture, are eligible to enter into the sun globe, which is so powerful and dazzling. Arjuna is reluctant even to kill his enemies, let alone his relatives.

He thinks that by killing his kinsmen there would be no happiness in his life, and therefore he is not willing to fight, just as a person who does not feel hunger is not inclined to cook. He has now decided to go into the forest and live a secluded life in frustration. But as a kṣatriya, he requires a kingdom for his subsistence, because the kṣatriyas cannot engage themselves in any other occupation.

But Arjuna has no kingdom. Arjuna’s sole opportunity for gaining a kingdom lies in fighting with his cousins and brothers and reclaiming the kingdom inherited from his father, which he does not like to do. Therefore he considers himself fit to go to the forest to live a secluded life of frustration.

🌹🌹🌹🌹🌹

08 Jun 2019