శ్రీమద్భగవద్గీత - 037: 01వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 037: Chap. 01, Ver. 37


🌹. శ్రీమద్భగవద్గీత - 37 / Bhagavad-Gita - 37 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 37 🌴


37. తస్మాన్నార్హా వయం హన్తుం
ధార్తరాష్ట్రాన్ స్వబాన్దవాన్ |
స్వజనం హి కథం హత్వా
సుఖిన: శ్యామ మాధవ ||


🌷. తాత్పర్యం :

ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణా! స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము?


🌷. భాష్యము :

వేదనిర్దేశము ననుసరించి ఆరు రకముల దుర్మార్గులు కలరు. వారే

1. విషము పెట్టువాడు
2. ఇంటికి నిప్పుపెట్టువాడు
3. మారణ ఆయుధములతో దాడి చేయువాడు
4. ఇతరుల ధనమును దోచెడివాడు
5. ఇతరుల స్థలము నాక్రమించెడివాడు
6. పరుల భార్యను చెరపట్టెడివాడు. అట్టి దుర్మార్గులను శీఘ్రమే సంహరింపవలెను. వారి సంహారముచే ఎట్టి పాపము కలుగదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య వ్యక్తినైనను సరియైన కార్యమే. కాని అర్జునుడు సామాన్యవక్తి కాడు.

సాధుస్వభావమును కలిగియున్న కారణమున వారి యెడ అతడు సాదుస్వభావము వర్తించదలెచెను. అయినను అటువంటి సాధువర్తనము క్షత్రియునకు సంభందించినది కాదు. రాజ్యమును పాలించు భాద్యతాయుతుడైన రాజు సాదు స్వభావమును కలిగి యుండవలెను గాని పిరికివాడై యుండకూడదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 37 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 - Vishada Yoga - Verse 37 🌴



37. tasmān nārhā vayaṁ hantuṁ dhārtarāṣṭrān sa-bāndhavān
sva-janaṁ hi kathaṁ hatvā sukhinaḥ syāma mādhava


🌷 Translation :

Sin will overcome us if we slay such aggressors. Therefore it is not proper for us to kill the sons of Dhṛtarāṣṭra and our friends. What should we gain, O Kṛṣṇa, husband of the goddess of fortune, and how could we be happy by killing our own kinsmen?


🌷 Purport :

According to Vedic injunctions there are six kinds of aggressors: (1) a poison giver, (2) one who sets fire to the house, (3) one who attacks with deadly weapons, (4) one who plunders riches, (5) one who occupies another’s land, and (6) one who kidnaps a wife. Such aggressors are at once to be killed, and no sin is incurred by killing such aggressors. Such killing of aggressors is quite befitting any ordinary man, but Arjuna was not an ordinary person.

He was saintly by character, and therefore he wanted to deal with them in saintliness. This kind of saintliness, however, is not for a kṣatriya. Although a responsible man in the administration of a state is required to be saintly, he should not be cowardly.

🌹 🌹 🌹 🌹 🌹


10 June 2019