శ్రీమద్భగవద్గీత - 040: 01వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 040: Chap. 01, Ver. 40


🌹. శ్రీమద్భగవద్గీత - 40 / Bhagavad-Gita - 40 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 🌴

శ్లోకము 40

40. కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మా: సనాతనా: |
ధర్మేనష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత ||


🌷. తాత్పర్యం :

కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మ వర్తనులగుదురు.


🌷. భాష్యము :

వంశమునందలి వారు సక్రమముగా వృద్ధినొంది ఆద్యాత్మికవిలువలను సంతరించుకొనుటకై సహాయపడుటకు పలు ధర్మనియమములు వర్ణాశ్రమపద్దతి యందు కలవు. జన్మ మొదలుగా మృత్యువు వరకు గల అట్టి అనేక శుద్ధికర్మలకు వంశంలోని పెద్దలు భాద్యతను వహింతురు.

కాని ఆ పెద్దల మరణము పిమ్మట అతి వంశాచారములు నిలిచిపోయి మిగిలిన వంశమువారు అధర్మమగు అలవాట్లను వృద్దిచేసికొను అవకాశము కలదు. తద్ద్వారా ఆధ్యాత్మికముక్తికి వారు అవకాశము కోల్పోవగలరు. కనుకనే ఏ ప్రయోజనము కొరకైనను వంశపెద్దలను వధింపరాదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 40 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 - Vishada Yoga 🌴

Verse 40

40. kula-kṣaye praṇaśyanti
kula-dharmāḥ sanātanāḥ
dharme naṣṭe kulaṁ kṛtsnam
adharmo ’bhibhavaty uta



Translation :

With the destruction of the dynasty, the eternal family tradition is vanquished, and thus the rest of the family becomes involved in irreligion.


Purport :

In the system of the varṇāśrama institution there are many principles of religious traditions to help members of the family grow properly and attain spiritual values. The elder members are responsible for such purifying processes in the family, beginning from birth to death.

But on the death of the elder members, such family traditions of purification may stop, and the remaining younger family members may develop irreligious habits and thereby lose their chance for spiritual salvation. Therefore, for no purpose should the elder members of the family be slain.

🌹🌹🌹🌹🌹


12 Jun 2019