శ్రీమద్భగవద్గీత - 046: 01వ అధ్., శ్లో 46 / Bhagavad-Gita - 046: Chap. 01, Ver. 46


🌹. శ్రీమద్భగవద్గీత - 46 / Bhagavad-Gita - 46 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 46 🌴


46. యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ: |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||


🌷. తాత్పర్యం :

నిరాయుధుడు మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు.


🌷. భాష్యము :

క్షత్రియ యుద్ధనియమము ననుసరించి నిరాయుధుడైనవానిని మరియు యుద్ధమును చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. అటువంటి పరిస్థితిలో శత్రువులు దాడిచేసినప్పటికిని తాను మాత్రము యుద్ధము చేయబోనని అర్జునుడు నిర్ణయించుకొనినాడు. ప్రతిపక్షమువారు ఎంత సమరోత్సాహముతో నున్నారో అతడు పట్టించుకొనలేదు. శ్రీకృష్ణభగవానుని ఘనభక్తుడైన కారణమున కలిగినట్టి మృదుహృదయమే ఆ లక్షణములకు కారణమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 46 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 - Vishada Yoga - 46 🌴


46. yadi mām apratīkāram
aśastraṁ śastra-pāṇayaḥ
dhārtarāṣṭrā raṇe hanyus
tan me kṣema-taraṁ bhavet


🌷 Translation :

Better for me if the sons of Dhṛtarāṣṭra, weapons in hand, were to kill me unarmed and unresisting on the battlefield.


🌷 Purport :

It is the custom – according to kṣatriya fighting principles – that an unarmed and unwilling foe should not be attacked. Arjuna, however, decided that even if attacked by the enemy in such an awkward position, he would not fight. He did not consider how much the other party was bent upon fighting. All these symptoms are due to soft-heartedness resulting from his being a great devotee of the Lord.

🌹🌹🌹🌹🌹


18 Jun 2019