🌹. శ్రీమద్భగవద్గీత - 57 / Bhagavad-gita - 57 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 10 🌴
10. తమువాచ హృషికేష ప్రహసన్నివ భారత |
సేనాయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచ: ||
🌷. తాత్పర్యం :
ఓ భరతవంశీయుడా! ఇరుసేనల నడుమ శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాని వలె ఆ సమయమున దుఃఖితుడైన అర్జునునితో ఇట్లు పలికెను.
🌷. భాష్యము :
హృషీ కేశుడు మరియు గుడాకేశుడు అణు ఇరువురు సన్నిహిత మిత్రుల నడుమ ఇచ్చట సంభాషణము జరుగుచున్నది. స్నేహితులుగా ఇరువురును ఒకే స్థాయికి చెందినవారైనను వారిలో ఒకరు వేరొకరికి స్వచ్ఛందముగా శిష్యుడయ్యెను.
స్నేహితుడు శిష్యునిగా మారుటకు ఎంచుకొనినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. సర్వులకు ప్రభువుగా అతడు సదా ఉన్నతస్థానము నందే నిలిచియుండును. అయినను తనను స్నేహితునిగా, పుత్రునిగా లేక ప్రియునిగా పొందగోరిన భక్తుని యెడ అతడు అదేరితిగా వర్తించుటకు అంగీకరించును. గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానము స్వీకరించి శిష్యునితో కోరినరీతి గాంభీర్యముగా పలుక నారంభించెను.
సర్వులకు లాభము కలుగునట్లుగా ఆ గురుశిష్యుల నడుమ సంభాషణ ఇరుసేనల సమక్షమున బాహాటముగా జరిగినట్లు అవగతమగుచున్నది. అనగా భగవద్గీత వాక్యములు ఒకానొక వ్యక్తికి, సంఘమునకు లేదా జాతికి సంబంధించినవి గాక సర్వుల కొరకై నిర్దేశింపబడియున్నవి. శత్రుమిత్రులు ఇరువురును ఆ వాక్యములను శ్రవణము చేయుటకు సమానముగా అర్హులై యున్నారు.
🌹 Bhagavad-Gita as It is - 57 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 10 🌴
10. tam uvāca hṛṣīkeśaḥ prahasann iva bhārata
senayor ubhayor madhye viṣīdantam idaṁ vacaḥ
🌷 Translation :
O descendant of Bharata, at that time Kṛṣṇa, smiling, in the midst of both the armies, spoke the following words to the grief-stricken Arjuna.
🌷 Purport :
The talk was going on between intimate friends, namely the Hṛṣīkeśa and the Guḍākeśa. As friends, both of them were on the same level, but one of them voluntarily became a student of the other.
Kṛṣṇa was smiling because a friend had chosen to become a disciple. As Lord of all, He is always in the superior position as the master of everyone, and yet the Lord agrees to be a friend, a son or a lover for a devotee who wants Him in such a role. But when He was accepted as the master, He at once assumed the role and talked with the disciple like the master – with gravity, as it is required.
It appears that the talk between the master and the disciple was openly exchanged in the presence of both armies so that all were benefited. So the talks of Bhagavad-gītā are not for any particular person, society, or community, but they are for all, and friends or enemies are equally entitled to hear them.
🌹🌹🌹🌹🌹
28 Jun 2019