శ్రీమద్భగవద్గీత - 050: 02వ అధ్., శ్లో 03 / Bhagavad-Gita - 050: Chap. 02, Ver. 03


🌹. శ్రీమద్భగవద్గీత - 50 / Bhagavad-Gita - 50 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 3 🌴

3. క్లైబ్యం మా స్మ గమ: పార్థ నైతత్త్వయ్యుప పద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప ||


🌷. తాత్పర్యం :

ఓ పృథాకుమారా! పతనకారక నపుంసకత్వమునకు లొంగకము. ఇది నీకు తగదు. ఓ పరంతపా! ఇట్టి హృదయ దుర్బలతను విడినాడి వెంటనే లెమ్ము.


🌷. భాష్యము :

ఇచ్చట అర్జుండు పృథ తనయునిగా సంభోదింప బడినాడు. పృథ శ్రీకృష్ణుని తండ్రియైన వసుదేవుని సోదరి. తత్కారణమున అర్జునుడు శ్రీకృష్ణునితో రక్తసంబంధమును కలిగియున్నాడు. క్షత్రియుని తనయుడు యుద్ధము చేయ నిరాకరించినచో అతడు నామమాత్ర క్షత్రియుడు మాత్రమే.

అలాగుననే బ్రహ్మణ తనయుడు పాపవర్తనమును కలిగియున్నచో అతడు నామమాత్ర బ్రాహ్మణుడే. అట్టి క్షతియులు, బ్రాహ్మణులు తమ తండ్రులకు తగిన పుత్రులు కాజాలరు. కనుకనే అర్జునుడు శ్రీకృష్ణుని సన్నిహిత స్నేహితుడు. అంతియేగాక శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా రథము నందుండి అతనికి నిర్దేశము కూర్చుచున్నాడు.

ఇన్ని యోగ్యతలను కలిగినప్పటికిని అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తికర కార్యము చేయువాడే కాగలడు. అర్జునుని యందు గోచరించు అట్టి నైజము అతనికి తగినట్లులేదని శ్రీకృష్ణుడు పలికినాడు. అత్యంత గౌరవనీయులైన భీష్ముడు మరియు బంధువుల యెడ ఉదార స్వభావముతో తానూ యుద్దమును త్యజింతునని అర్జునుడు వాదింపవచ్చును.

కాని అట్టి ఉదారత కేవలము హృదయదుర్బలత మాత్రమేనని శ్రీకృష్ణుడు భావించెను. అట్టి మిథ్యా ఉదారతను ఏ ప్రామాణికుడు ఆమోదింపడు. కనకనే అటువంటి ఉదార స్వభావమును లేదా నామమాత్ర అహింసను అర్జునుని వంటివారు శ్రీకృష్ణుని ప్రత్యక్ష మార్గదర్శకత్వమున శీఘ్రమే త్యజింప వలసియున్నది.



🌹 Bhagavad-Gita as It is - 50 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 3 🌴


3. klaibyaṁ mā sma gamaḥ pārtha naitat tvayy upapadyate
kṣudraṁ hṛdaya-daurbalyaṁ
tyaktvottiṣṭha paran-tapa


🌷 Translation :

O son of Pṛthā, do not yield to this degrading impotence. It does not become you. Give up such petty weakness of heart and arise, O chastiser of the enemy.


🌷 Purport :

Arjuna was addressed as the son of Pṛthā, who happened to be the sister of Kṛṣṇa’s father Vasudeva. Therefore Arjuna had a blood relationship with Kṛṣṇa.

If the son of a kṣatriya declines to fight, he is a kṣatriya in name only, and if the son of a brāhmaṇa acts impiously, he is a brāhmaṇa in name only. Such kṣatriyas and brāhmaṇas are unworthy sons of their fathers; therefore, Kṛṣṇa did not want Arjuna to become an unworthy son of a kṣatriya.

Arjuna was the most intimate friend of Kṛṣṇa, and Kṛṣṇa was directly guiding him on the chariot; but in spite of all these credits, if Arjuna abandoned the battle he would be committing an infamous act. Therefore Kṛṣṇa said that such an attitude in Arjuna did not fit his personality.

Arjuna might argue that he would give up the battle on the grounds of his magnanimous attitude for the most respectable Bhīṣma and his relatives, but Kṛṣṇa considered that sort of magnanimity mere weakness of heart.

Such false magnanimity was not approved by any authority. Therefore, such magnanimity or so-called nonviolence should be given up by persons like Arjuna under the direct guidance of Kṛṣṇa.

🌹🌹🌹🌹🌹



21 Jun 2019