🌹. శ్రీమద్భగవద్గీత - 28 / Bhagavad-Gita - 28 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 28 🌴
28. అర్జున ఉవాచ
దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితమ్ |
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను :
ఓ కృష్ణా యుద్దోత్సాహముతో సమావేశమై యున్న ఈ జ్ఞాతులను చూచి, నా యొక్క శరీరావయములు కంపించుచున్నవి. నోరు కూడా ఎండి పోవుచున్నది.
🌻. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని యెడ నిష్కపటమైన భక్తికలవాడెవడైనను దివ్యపురుషుల యందు లేదా దేవతల యందు గోచరించు సమస్త సద్గుణములను కలిగియుండును. కాని అభక్తుడైనవాడు విద్య మరియు సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకికయోగ్యతలను కలిగియున్నప్పటికి భగవద్గునములు లోపించియుండును.
తమలో తాము యుద్ధము చేయుటకు సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను గాంచినంతనే అర్జునుడు వారి యెడ దయపూర్ణ హృదయుడయ్యెను. తన సైనికులకు సంబంధించినంతవరకు అతడు వారి యెడ మొదటి నుండియు కరుణను కలిగియుండెను. అంతియేగాక ప్రతిపక్షపు సైనికుల ఎదను వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచు కరుణాభావమును పొందెను.
అతడు ఆ విధముగా తలచుచుండ శరీరావయములు కంపించెను. నోరు ఎండిపోయెను. వారి యుద్దోత్సాహము గాంచి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యెను. దాదాపు రాజవంశమంతయు (అర్జునుని రక్తసంబంధికులు) అతనితో యుద్ధము చేయ అరుదెంచెను. కరుణాపూర్ణుడైన అర్జునుని ఈ విషయము ఉద్విగ్నపరిచెను. ఇచ్చట తెలుపబడినప్పటికిని అతని శరీరావయములు కంపించుట, నోరు ఎండిపోవుటయే గాక అతడు కరుణాపూర్ణుడై రోదించుచుండెననియు ఎవరైనను ఊహించగలరు.
అర్జునుని యందలి ఇట్టి లక్షణములు అతని మృదుహృదయము వలననే కలిగినినవి గాని శక్తి హీనట వలన కాదు. అట్టి మృదుహృదయము శుద్ధభక్తుని ముఖ్యలక్షణము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 28 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga - 28 🌴
28. arjuna uvāca
dṛṣṭvemaṁ sva-janaṁ kṛṣṇa
yuyutsuṁ samupasthitam
sīdanti mama gātrāṇi
mukhaṁ ca pariśuṣyati
🌷. Translation :
Arjuna said: My dear Kṛṣṇa, seeing my friends and relatives present before me in such a fighting spirit, I feel the limbs of my body quivering and my mouth drying up.
🌻. Purport :
Any man who has genuine devotion to the Lord has all the good qualities which are found in godly persons or in the demigods, whereas the nondevotee, however advanced he may be in material qualifications by education and culture, lacks in godly qualities.
As such, Arjuna, just after seeing his kinsmen, friends and relatives on the battlefield, was at once overwhelmed by compassion for them who had so decided to fight amongst themselves. As far as his soldiers were concerned, he was sympathetic from the beginning, but he felt compassion even for the soldiers of the opposite party, foreseeing their imminent death.
And while he was so thinking, the limbs of his body began to quiver, and his mouth became dry. He was more or less astonished to see their fighting spirit. Practically the whole community, all blood relatives of Arjuna, had come to fight with him. This overwhelmed a kind devotee like Arjuna. Although it is not mentioned here, still one can easily imagine that not only were Arjuna’s bodily limbs quivering and his mouth drying up, but he was also crying out of compassion.
Such symptoms in Arjuna were not due to weakness but to his softheartedness, a characteristic of a pure devotee of the Lord.
🌹 🌹 🌹 🌹 🌹
04 Jun 2019