శ్రీమద్భగవద్గీత - 029: 01వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 029: Chap. 01, Ver. 29



🌹. శ్రీమద్భగవద్గీత - 29 / Bhagavad-Gita - 29 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 29 🌴

29. వవేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే |

🌷. తాత్పర్యం :
నా దేహమంతయు కంపించుచున్నది. నాకు రోమాంచమగుచున్నది. 

🌻. భాష్యము :
రెండువిధములైన దేహకంపనములు కలవు. అదేవిధముగా రోమాంచితమగుట కుడా రెండు విధములు. అట్టి విషయము ఆధ్యాత్మిక తన్మ్యత్వములో గాని, భౌతికపరిస్థితియందు తీవ్రభయములో గాని కలుగుచుండును.
దివ్యానుభవమునందు భయమనునది ఉండదు. ఇట్టి పరిస్థితిలో అర్జునుని యందు గోచరించు లక్షణములు ప్రాణహాని యనెడి భౌతికభయము వలన కలుగుచున్నవి. అతని ఇతర లక్షణముల నుండి సైతము ఇది ప్రతీతమగుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Bhagavad-Gita as It is - 29 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Vishada Yogam - 29 🌴
29. vepathuś ca śarīre me
roma-harṣaś ca jāyate

🌷. Translation :
My whole body is trembling, my hair is standing on end. 

🌻. Purport :
There are two kinds of trembling of the body, and two kinds of standings of the hair on end. Such phenomena occur either in great spiritual ecstasy or out of great fear under material conditions. There is no fear in transcendental realization. Arjuna’s symptoms in this situation are out of material fear – namely, loss of life. 

🌹 🌹 🌹 🌹 🌹