🌹. శ్రీమద్భగవద్గీత - 58 / Bhagavad-gita - 58 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 11 🌴
11. శ్రీ భగవానువాచ
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదంశ్చ భాషసే |
గతాసూన గతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితా: ||
🌷. తాత్పర్యం :
పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు పలికెను : ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైనవారు జీవించి యున్న వారిని గూర్చి గాని, మరణించిన వారిని గూర్చి గాని దుఃఖింపరు.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి పరోక్షముగా శిష్యుని మూర్ఖుడని పిలుచుచు మందలించు చున్నాడు. “ నీవు పండితుని మాదిరి పలుకుచున్నావు. కాని దేహమననేమో, ఆత్మయననేమో తెలిసిన పండితుడు దేహపు ఏ స్థితిని గూర్చియు (జీవించి యున్న స్థితిని గాని, మరణించిన స్థితిని గాని) శోకింపడని ఎరుగకున్నావు” అని అతడు పలికెను.
తరువాతి అధ్యాయములలో వివరింపబడిన రీతి జ్ఞానమనగా భౌతికపదార్థము, ఆత్మ మరియు ఆ రెండింటిని నియమించువాని గూర్చి తెలియుటయే. రాజకీయములు లేదా సాంఘిక ఆచారముల కన్నను ధర్మ నియమములకే అధిక ప్రాధాన్యత ఒసగవలెనని అర్జునుడు వాదించెను. కాని భౌతిక పదార్థము, ఆత్మ, భగవానుని గుర్చిన జ్ఞానము ధార్మిక నియమముల కన్నను మరింత ముఖ్యమైనదని అతడు ఎరుగకుండెను.
అటువంటి జ్ఞానము కొరవడియున్నందున గొప్ప ప్రజ్ఞకలవానిగా తనను అతడు ప్రదర్శించుకొనుట తగియుండలేదు. ప్రజ్ఞగలవాడు కానందునే అతడు విచారింపదగని దానిని గూర్చి విచారించెను. దేహము ఒకప్పుడు ఉద్భవించి నేదో, రేపో రాలిపోయే తీరును. కనుకనే దేహము ఆత్మ యంత ముఖ్యమైనది కాదు. ఇది తెలిసినవాడే నిజముగా ప్రజ్ఞకలవాడు. భౌతికదేహపు స్థితి ఎట్లున్నను అట్టివానికి దుఃఖకారణము ఏదియును లేదు.
🌹 Bhagavad-Gita as It is - 58 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 11 🌴
11. śrī-bhagavān uvāca
aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase gatāsūn agatāsūṁś ca nānuśocanti paṇḍitāḥ
🌷 Translation :
The Supreme Personality of Godhead said: While speaking learned words, you are mourning for what is not worthy of grief. Those who are wise lament neither for the living nor for the dead.
🌷 Purport :
The Lord at once took the position of the teacher and chastised the student, calling him, indirectly, a fool. The Lord said, “You are talking like a learned man, but you do not know that one who is learned – one who knows what is body and what is soul – does not lament for any stage of the body, neither in the living nor in the dead condition.”
As explained in later chapters, it will be clear that knowledge means to know matter and spirit and the controller of both. Arjuna argued that religious principles should be given more importance than politics or sociology, but he did not know that knowledge of matter, soul and the Supreme is even more important than religious formularies. And because he was lacking in that knowledge, he should not have posed himself as a very learned man.
As he did not happen to be a very learned man, he was consequently lamenting for something which was unworthy of lamentation. The body is born and is destined to be vanquished today or tomorrow; therefore the body is not as important as the soul. One who knows this is actually learned, and for him there is no cause for lamentation, regardless of the condition of the material body.
🌹🌹🌹🌹🌹
29 Jun 2019