శ్రీమద్భగవద్గీత - 052: 02వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 052: Chap. 02, Ver. 05


🌹. శ్రీమద్భగవద్గీత - 52 / Bhagavad-Gita - 52 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 5 🌴


5. గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుఇజ్నీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ||


🌷. తాత్పర్యం :

గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికి వారందరును పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తపంకిలమగును.


🌷. భాష్యము :

గురువు హేయమైన కార్యమును చేయుచు తన విచక్షణ కోల్పోయినపుడు త్యజింపదగినవాడని శాస్త్రనియమములు తెలుపుచున్నవి. దుర్యోధనుడు ఒసగిన ఆర్ధిక సహాయము కారణముగా భీష్ముడు లిరువురును అతని పక్షమును వహించియుండిరి.

కాని కేవలము ఆర్ధిక కారణముచే ఆతి స్థానమును స్వీకరించుట వారికి తగినట్లుగా లేదు. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయిరి. అయినప్పటికిని వారు పెద్దలుగనే నిలిచియుందురని అర్జునుడు భావించుచున్నాడు. కనుకనే వారిని సంహరించిన పిదప భౌతికలాభముల ననుభవించుట యనగా రక్తపంకిలమైన వాటిని అనుభవించుట యనేయే భావము.

🌹🌹🌹🌹🌹



🌹 Bhagavad-Gita as It is - 52 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 5 🌴

5. gurūn ahatvā hi mahānubhāvān
śreyo bhoktuṁ bhaikṣyam apīha loke
hatvārtha-kāmāṁs tu gurūn ihaiva
bhuñjīya bhogān rudhira-pradigdhān


Translation :

It would be better to live in this world by begging than to live at the cost of the lives of great souls who are my teachers. Even though desiring worldly gain, they are superiors. If they are killed, everything we enjoy will be tainted with blood.


Purport :

According to scriptural codes, a teacher who engages in an abominable action and has lost his sense of discrimination is fit to be abandoned.

Bhīṣma and Droṇa were obliged to take the side of Duryodhana because of his financial assistance, although they should not have accepted such a position simply on financial considerations. Under the circumstances, they have lost the respectability of teachers. But Arjuna thinks that nevertheless they remain his superiors, and therefore to enjoy material profits after killing them would mean to enjoy spoils tainted with blood.

🌹🌹🌹🌹🌹


23 Jun 2019