శ్రీమద్భగవద్గీత - 033: 01వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 033: Chap. 01, Ver. 33

🌹. శ్రీమద్భగవద్గీత - 33 / Bhagavad-Gita - 33 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - శ్లోకము 33 🌴


33. యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా: సుఖాని చ ||
త ఇమేవస్థితా యుద్ధే ప్రాణం స్త్యక్త్వా ధనాని చ |


🌷. తాత్పర్యం :

ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు.


🌷. భాష్యము :

గోవులకు మరియు ఇంద్రియములకు శ్రీకృష్ణుడు ఆనందధ్యేయమైన కారణమున అతనిని అర్జునుడు ఇచ్చట “గోవిందా” యని సంభోదించినాడు.

ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తనను ఆనందపరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగవలెనని సూచించుచున్నాడు. కాని మన ఇంద్రియతృప్తి కొరకై గోవిందుడు నిర్దేశింపబడలేదు. అయినప్పటికిని ఆ గోవిందుని తృప్తిపరచుట యత్నించినచో అప్రయత్నముగా మనము కుడా తృప్తినొందగలము.

ప్రతియెక్కరు తమ ఇంద్రియములను తృప్తిపరచవలెననియే వాంచింతురు మరియు అట్టి ఆనందమును భగవానుడు ఒసగవలెననియు కోరుదురు. కాని భగవానుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే వారికి ఇంద్రియభోగము నొసగును గాని వారు కోరినంత కాదు.

కాని మనుజుడు అట్లుగాక భిన్నమార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియముల తృప్తిని కోరకుండ గోవిందుని ప్రియము కొరకే యత్నించినపుడు అతని కరుణచే సమస్త కోరికలు పూర్ణము చేసికొనగలడు.

తన జాతి మరియు కుటుంబసభ్యుల యెడ అర్జునుడు కనబరచిన ప్రగాడ అనురాగామునకు వారి యెడ అతనికి గల సహజ కరుణయే కొంత కారణమై యున్నది. కనుకనే అతడు యుద్ధమునకు సిద్ధపడలేదు.

సాధారణముగా ప్రతియొక్కరు తమ ధనసంపత్తులను బంధు,మిత్రులకు ప్రదర్శింపవలెనని తలతురు. బంధుమిత్రులందరును యుద్ధమున మరణింతురు కావున యుద్ధవిజయము తదుపరి తన సంపదను వారితో కలసి పంచుకొనజాలనని అర్జునుడు భీతిచెందెను.

లౌకికజీవనము నందలి భావములు ఈ విధముగనే ఉండును. కాని ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనట్టిది. భక్తుడు సదా భగవానుని కోరికలను పూర్ణము చేయవలెననియే కోరును కనుక ఆ దేవదేవుని సేవ కొరకు (అతడు అంగీకరించినచో) అన్ని విధములైన సంపదలను స్వికరించును. భగవానుడు అంగీకరింపనిచో ఆ భక్తుడు చిల్లిగవ్వనైనను తాకరాదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 33 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌻 Chapter 1, Vishada Yoga - Verse 33 🌻


33. yeṣām arthe kāṅkṣitaṁ no
rājyaṁ bhogāḥ sukhāni ca
ta ime ’vasthitā yuddhe
prāṇāṁs tyaktvā dhanāni ca


🌷Translation

O Madhusūdana, when teachers, fathers, sons, grandfathers, maternal uncles, fathers-in-law, grandsons, brothers-in-law and other relatives are ready to give up their lives and properties and are standing before me, why should I wish to kill them, even though they might otherwise kill me?


🌻. Purport :

Arjuna has addressed Lord Kṛṣṇa as Govinda because Kṛṣṇa is the object of all pleasures for cows and the senses. By using this significant word, Arjuna indicates that Kṛṣṇa should understand what will satisfy Arjuna’s senses.

But Govinda is not meant for satisfying our senses. If we try to satisfy the senses of Govinda, however, then automatically our own senses are satisfied. Materially, everyone wants to satisfy his senses, and he wants God to be the order supplier for such satisfaction.

The Lord will satisfy the senses of the living entities as much as they deserve, but not to the extent that they may covet. But when one takes the opposite way – namely, when one tries to satisfy the senses of Govinda without desiring to satisfy one’s own senses – then by the grace of Govinda all desires of the living entity are satisfied.

Arjuna’s deep affection for community and family members is exhibited here partly due to his natural compassion for them. He is therefore not prepared to fight. Everyone wants to show his opulence to friends and relatives, but Arjuna fears that all his relatives and friends will be killed on the battlefield and he will be unable to share his opulence after victory.

This is a typical calculation of material life. The transcendental life, however, is different. Since a devotee wants to satisfy the desires of the Lord, he can, Lord willing, accept all kinds of opulence for the service of the Lord, and if the Lord is not willing, he should not accept a farthing.

🌹🌹🌹🌹🌹

08 Jun 2019