శ్రీమద్భగవద్గీత - 054: 02వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 054: Chap. 02, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత - 54 / Bhagavad-gita - 54 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము -7 🌴


7. కార్పణ్య దోషోపహతస్వభావ: పృచ్చామి త్వాం ధర్మసమ్మూడచేతా: |
యచ్చ్రేయ: స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే(హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||


తాత్పర్యం :

కార్పణ్యదోష కారణమున నేనిపుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయియితిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిపుడు నీకు శిష్యుడనుశిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము.


భాష్యము :

ప్రకృతి నియమము ప్రకారము లౌకికకర్మలే ప్రతియొక్కరి కలతకు కారణములై యున్నవి. అడుగడుగునా కలతలే కలవు కనుక జీవిత ప్రయోజనము నేరవేర్చుటలో సరియైన నిర్దేశము నొసగు ఆధ్యాత్మికగురువుని చేరుట ప్రతియెక్కరికి ఉత్తమము.

కోరకనే కలుగునట్టి జీవితపు కలతల నుండి ముక్తిని పొందుటకై ఆద్యాత్మిక గురువును చేరుమని వేదశాస్త్రములు మనకు ఉపదేశించుచున్నవి. అవి ఎవ్వరి ప్రమేయము లేకుండగనే రగుల్కొనెడు దావాలనము వంటివి. అదేవిధముగా మనము కోరకున్నప్పటికిని జీవితపు కలతలు అప్రయత్నముగా కలుగుచుండుట ఈ లోకపు పరిస్థితియై యున్నది.

అగ్నిప్రమాదమును ఎవ్వరును కోరరు. అయినను అది సంభవించి మనము కలతకు గురియగు చుందుము. కనుకనే జీవితపు కలతలను పరిష్కరించుతాకు మరియు పరిష్కారపు విజ్ఞానమును అవగతము చేసికొనుటకు ప్రామాణిక పరంపరలో నున్న ఆధ్యాత్మిక గురువు దరిచేరుమని వేదంవాజ్మయము ఉపదేశించుచున్నది. ఆధ్యాత్మికగురువును కలిగియున్న వ్యక్తి సర్వమును తెలియగలుగును.కనుక మనుజుడు లౌకిక కలతల యందే ఉండిపోక గురువును తప్పక చేరవలెను. ఈ శ్లోకపు సారాంశమిదియే.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 54 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 7🌴


7. kārpaṇya-doṣopahata-svabhāvaḥ pṛcchāmi tvāṁ dharma-sammūḍha-cetāḥ yac chreyaḥ syān niścitaṁ brūhi tan me śiṣyas te ’haṁ śādhi māṁ tvāṁ prapannam


Translation :

Now I am confused about my duty and have lost all composure because of miserly weakness. In this condition I am asking You to tell me for certain what is best for me. Now I am Your disciple, and a soul surrendered unto You. Please instruct me.

Purport :

By nature’s own way the complete system of material activities is a source of perplexity for everyone. In every step there is perplexity, and therefore it behooves one to approach a bona fide spiritual master who can give one proper guidance for executing the purpose of life.

All Vedic literatures advise us to approach a bona fide spiritual master to get free from the perplexities of life, which happen without our desire. They are like a forest fire that somehow blazes without being set by anyone. Similarly, the world situation is such that perplexities of life automatically appear, without our wanting such confusion. No one wants fire, and yet it takes place, and we become perplexed.

The Vedic wisdom therefore advises that in order to solve the perplexities of life and to understand the science of the solution, one must approach a spiritual master who is in the disciplic succession. A person with a bona fide spiritual master is supposed to know everything. One should not, therefore, remain in material perplexities but should approach a spiritual master. This is the purport of this verse.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 Jun 2019