శ్రీమద్భగవద్గీత - 042: 01వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 042: Chap. 01, Ver. 42



🌹. శ్రీమద్భగవద్గీత - 42 / Bhagavad-Gita - 42 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 🌴

శ్లోకము 42

42. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియా: ||



🌷. తాత్పర్యం :

అవాంచిత సంతానము వృద్ధియగుట వలన కుటుంబమువారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచినవారు ఇరువురికి నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితురులు పతనము నొందుదురు.


🌷. భాష్యము :

కర్మకాండ విధుల ప్రకారము వంశపితురులకు నియమానుసారముగా పిండోదకములు అర్పించవలసిన అవసరమున్నది. అట్టి అర్పణము విష్ణువు యొక్క అర్చనము ద్వారా చక్కగా ఒనరించబడగలదు.

ఏలయన విష్ణువునకు అర్పించిన ఆహారమును భుజించుట యనెడి కార్యము మనుజుని అన్ని రకములైన పాపముల నుండి ముక్తుని చేయగలదు. కొన్నిమార్లు వంశపితరులు పలువిధములైన పాపకర్మఫలముల కారణమున తపించు చుండవచ్చును. ఇంకొన్నిమార్లు వారికి స్థూలదేహము సైతము లభింపక పిశాచములుగా సూక్ష్మదేహమునందే బలవంతముగా నిలువవలసివచ్చును.

కాని వంశీయులచే భగత్ప్రసాదము ఆ పితురులకు అర్పింపబడినప్పుడు వారు పిశాచరూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవనస్థితుల నుండి విడుదలను పొందగలరు. పితరులకు ఒనర్చబడెడి అట్టి సహాయము వాస్తవమునకు ఒక వంశాచారము.

భక్తియుతజీవనము నందు నిలువనివాడు అటువంటి కర్మకాండ తప్పక ఒనరింపవలెను. కాని భక్తియుత జీవనము నందు నిలిచినవాడు అట్టి కర్మలను ఒనరింపవలసిన అవసరము లేదు. కేవలము భక్తియుక్త సేవను నిర్వహించుట ద్వారా మనుజుడు లక్షలాది పితృదేవతలనైనను సర్వవిధములైన దుఃఖముల నుండి ముక్తులను చేయగలడు. ఈ విషయమే శ్రీమద్భాగవతము (11.5.41) నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.

దేవర్షిభూతాప్తనృణాం పితౄణాం న కింకరో నాయమృణీ చ రాజన్ |
సర్వాత్మనా య: శరణం శరణ్యం గతో ముకున్దం పరిహృత్య కర్తమ్ ||

“సర్వవిధములైన ధర్మములను త్యజించి ముక్తినొసగెడి ముకుందుని చరణపద్మాశ్రయ శరణమున నిలిచినవాడు మరియు చేపట్టిన మార్గమునందు పూర్ణ శ్రద్ధాళువైనవాడు దేవతలకుగాని, ఋషులకుగాని, జీవులకుగాని, కుటుంబమువారికిగాని, పితృదేవతలకుగాని ఋణపడియుండడు. వారి యెడ అతనికి ఎట్టి విధులుగాని, బాధ్యతలుగాని లేవు.”

పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణుని భక్తియుతసేవ ద్వారా అట్టి సమస్త బాధ్యతలు అప్రయత్నముగా పూర్ణము కావింపబడుచున్నవి.




🌹 Bhagavad-Gita as It is - 42 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 - Vishada Yoga 🌴

Verse 42

42. saṅkaro narakāyaiva
kula-ghnānāṁ kulasya ca
patanti pitaro hy eṣāṁ
lupta-piṇḍodaka-kriyāḥ


Translation :

An increase of unwanted population certainly causes hellish life both for the family and for those who destroy the family tradition. The ancestors of such corrupt families fall down, because the performances for offering them food and water are entirely stopped.


Purport :

According to the rules and regulations of fruitive activities, there is a need to offer periodical food and water to the forefathers of the family.

This offering is performed by worship of Viṣṇu, because eating the remnants of food offered to Viṣṇu can deliver one from all kinds of sinful reactions. Sometimes the forefathers may be suffering from various types of sinful reactions, and sometimes some of them cannot even acquire a gross material body and are forced to remain in subtle bodies as ghosts.

Thus, when remnants of prasādam food are offered to forefathers by descendants, the forefathers are released from ghostly or other kinds of miserable life. Such help rendered to forefathers is a family tradition, and those who are not in devotional life are required to perform such rituals.

One who is engaged in the devotional life is not required to perform such actions. Simply by performing devotional service, one can deliver hundreds and thousands of forefathers from all kinds of misery. It is stated in the Bhāgavatam (11.5.41):

devarṣi-bhūtāpta-nṛṇāṁ pitṝṇāṁ
na kiṅkaro nāyam ṛṇī ca rājan
sarvātmanā yaḥ śaraṇaṁ śaraṇyaṁ
gato mukundaṁ parihṛtya kartam

“Anyone who has taken shelter of the lotus feet of Mukunda, the giver of liberation, giving up all kinds of obligation, and has taken to the path in all seriousness, owes neither duties nor obligations to the demigods, sages, general living entities, family members, humankind or forefathers.”

Such obligations are automatically fulfilled by performance of devotional service to the Supreme Personality of Godhead.

🌹🌹🌹🌹🌹


14 Jun 2019