శ్రీమద్భగవద్గీత - 049: 02వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 049: Chap. 02, Ver. 02


🌹. శ్రీమద్భగవద్గీత - 49 / Bhagavad-Gita - 49 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 2 🌴


2. శ్రీభగవానువాచ
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ | అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున ||

🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను:

ఓ అర్జునా! నీకీ కల్మషము ఎచ్చట నుండి ప్రాప్తించినది? జీవితపు వీలువ నెరిగిన మనుజునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములను లభింపజేయదు. పైగా అపకీర్తిని కలిగించును.


🌷. భాష్యము :

శ్రీకృష్ణుడన్నను మరియు పూర్ణపురుషోత్తముడగు భగవానుడన్నను ఒక్కటియే. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత యందంతటను భగవానుని సంభోదింపబడినాడు. పరతత్త్వమునందు చరమాంశము భగవానుడే. పరతత్త్వమనునది బ్రహ్మము (సర్వత్రా వ్యాపించియుండెడి పరమపురుషుని రూపు), పరమాత్మ (దేవదేవుడైన శ్రీకృష్ణుడు) అనెడి మూడుదశలలో అనుభూతమగుచున్నది. శ్రీమద్భాగవతము (1.2.11) నందు ఇట్టి పరతత్త్వభావము ఈ క్రింది విధముగా వివరింపబడినది.

వదన్తి తత్తత్త్వవిదస్తత్వం యత్ జ్ఞానమద్వయమ్ |
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ధ్యతే ||

“పరతతత్వమనునది తత్త్వవిదులచే మూడుదశలలో అనుభూతమగుచున్నది. అవియన్నియును అభిన్నములై యున్నవి. పరతత్త్వపూ ఆ వివిధదశలే బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనుచు తెలుపబడును.”

🌹🌹🌹🌹🌹




🌹 Bhagavad-Gita as It is - 49 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 2 🌴


2. śrī-bhagavān uvāca kutas tvā kaśmalam idaṁ viṣame samupasthitam anārya-juṣṭam asvargyam akīrti-karam arjuna


🌷 Translation :

The Supreme Personality of Godhead said: My dear Arjuna, how have these impurities come upon you? They are not at all befitting a man who knows the value of life. They lead not to higher planets but to infamy.


🌷 Purport :

Kṛṣṇa and the Supreme Personality of Godhead are identical. Therefore Lord Kṛṣṇa is referred to as Bhagavān throughout the Gītā. Bhagavān is the ultimate in the Absolute Truth. The Absolute Truth is realized in three phases of understanding, namely Brahman, or the impersonal all-pervasive spirit; Paramātmā, or the localized aspect of the Supreme within the heart of all living entities; and Bhagavān, or the Supreme Personality of Godhead, Lord Kṛṣṇa. In the Śrīmad-Bhāgavatam (1.2.11) this conception of the Absolute Truth is explained thus:

vadanti tat tattva-vidas
tattvaṁ yaj jñānam advayam
brahmeti paramātmeti
bhagavān iti śabdyate

“The Absolute Truth is realized in three phases of understanding by the knower of the Absolute Truth, and all of them are identical. Such phases of the Absolute Truth are expressed as Brahman, Paramātmā and Bhagavān.”

🌹🌹🌹🌹🌹


20 Jun 2019