శ్రీమద్భగవద్గీత - 056: 02వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 056: Chap. 02, Ver. 09



🌹. శ్రీమద్భగవద్గీత - 56 / Bhagavad-gita - 56 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 9 🌴


9. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ: పరన్తప: |
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ ||


తాత్పర్యం :

సంజయుడు పలికెను: శత్రువులను తపింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికి, పిదప శ్రీకృష్ణునితో “ గోవిందా! నేను యుద్దమును చేయను” అని పలికి మౌనమును వహించెను.


భాష్యము :

యుద్ధమాచరించుటకు బదులు అర్జునుడు యుద్ధరంగమును వీడి భిక్షాటనను స్వీకరింపనున్నాడని అవగతము చేసికొని ధృతరాష్ట్రుడు మిక్కిలి మదమంది యుండవచ్చును. కాని అర్జునుడు తన శత్రువులను వధింప సమర్థుడని (పరంతపుడు) పలుకుచు సంజయుడు అతనిని నిరాశపరచెను. బంధుప్రేమ కారణముగా అర్జునుడు కొలది సమయము మిథ్యా శోకతప్తుడైనను శిష్యుని వలె దివ్యగురువైన శ్రీకృష్ణుని శరణుపొందెను.

వంశానురాగము వలన కలిగిన మిథ్యా శోకము నుండి అతడు శీఘ్రమే ముక్తిని పొందగలడనియు మరియు ఆత్మానుభవపు (కృష్ణభక్తిరసభావనము) పూర్ణజ్ఞానముచే జ్ఞానవంతుడు కాగాలడనియు ఇది సూచించుచున్నది. పిదప అతడు నిక్కముగా యుద్ధమున పాల్గొనగలడు. అనగా శ్రీకృష్ణుని జ్ఞానమును బడసి అర్జునుడు విజయము సాధించు వరకు యుద్ధము చేయనున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిశ్చయముగా నిరాశగా మారగలదు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 56 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 2 - Sankhya Yoga - 9 🌴



9. sañjaya uvāca

evam uktvā hṛṣīkeśaṁ
guḍākeśaḥ paran-tapaḥ na yotsya iti govindam
uktvā tūṣṇīṁ babhūva ha


Translation :

Sañjaya said: Having spoken thus, Arjuna, chastiser of enemies, told Kṛṣṇa, “Govinda, I shall not fight,” and fell silent.


Purport :

Dhṛtarāṣṭra must have been very glad to understand that Arjuna was not going to fight and was instead leaving the battlefield for the begging profession. But Sañjaya disappointed him again in relating that Arjuna was competent to kill his enemies (paran-tapaḥ). Although Arjuna was, for the time being, overwhelmed with false grief due to family affection, he surrendered unto Kṛṣṇa, the supreme spiritual master, as a disciple.

This indicated that he would soon be free from the false lamentation resulting from family affection and would be enlightened with perfect knowledge of self-realization, or Kṛṣṇa consciousness, and would then surely fight. Thus Dhṛtarāṣṭra’s joy would be frustrated, since Arjuna would be enlightened by Kṛṣṇa and would fight to the end

🌹🌹🌹🌹🌹


27 Jun 2019