శ్రీమద్భగవద్గీత - 045: 01వ అధ్., శ్లో 45 / Bhagavad-Gita - 045: Chap. 01, Ver. 45


🌹. శ్రీమద్భగవద్గీత - 45 / Bhagavad-Gita - 45 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 45 🌴


45. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం |
యద్ రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతా: ||


🌷. తాత్పర్యం :

అహో! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము! రాజ్యసుఖమును అనుభవించవలెననెడి కోరికతో మేము స్వజనమును చంపగోరుచున్నాము.


🌷. భాష్యము :

స్వార్థపూరిత భావములతో ప్రేరేపింపబడి మనుజుడు కొన్నిమార్లు స్వంతసోదరుడు, తండ్రి లేదా తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు ఒడిగట్టును. ప్రపంచచరిత్రలో అట్టి సంఘటనలు పలుగలవు. కాని అర్జునుడు శ్రీకృష్ణభగవానుని భక్తుడైనందున నీతినియమములను గూర్చిన పూర్తి ఎరుక కలిగి అట్టి కార్యములు జరుగకుండునట్లుగా గాంచెను.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 45 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 - Vishada Yoga - 45 🌴


45. aho bata mahat pāpaṁ
kartuṁ vyavasitā vayam
yad rājya-sukha-lobhena
hantuṁ sva-janam udyatāḥ


Translation :

Alas, how strange it is that we are preparing to commit greatly sinful acts. Driven by the desire to enjoy royal happiness, we are intent on killing our own kinsmen.


Purport :

Driven by selfish motives, one may be inclined to such sinful acts as the killing of one’s own brother, father or mother. There are many such instances in the history of the world. But Arjuna, being a saintly devotee of the Lord, is always conscious of moral principles and therefore takes care to avoid such activities.

🌹🌹🌹🌹🌹


17 Jun 2019