✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 35 🌴
35. ఏతన్న హన్తుమిచ్చామి ఘ్నతో(పి మధుసూదన |
అపి త్రైలోక్య రాజ్యస్య హేతో: కిం ను మహీకృతే ||
🌷. తాత్పర్యం :
ఓ గోవిందా! తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా యెదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను?
🌷. భాష్యము :
అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని చంపవలసియే వచ్చినచో కృష్ణుడే స్వయముగా వారిని సంహరింపవలెనని అతడు కోరెను.
యుద్ధరంగమునకు అరుదెంచక పూర్వమే శ్రీకృష్ణుడు వారిని సంహరించి యుండెననియు మరియు తాను కేవలము శ్రీకృష్ణుని పనిముట్టుగా కావలసియున్నదని ఈ క్షణముణ అర్జునుడు తెలియకున్నాడు. ఈ సత్యము రాబోవు అధ్యాయములలో తెలుపబడినది.
భగవానుని సహజ భక్తుడైన కారణమున అర్జునుడు తన దుష్టజ్ఞాతుల యెడ మరియు సోదరుల యెడ ప్రతిక్రియ చేయగోరలేదు. కాని వారిని వదింపవలెననుట శ్రీకృష్ణుని సంకల్పమై యుండెను. భగవద్భక్తుడెన్నడును దుష్టుని యెడ ప్రతీకారము చేయడు.
కాని భక్తుల యెడ దుష్టులు కావించు తప్పిదమును మాత్రము భగవానుడు సహింపడు. భగవానుడు తన విషయమున ఎవరినైనను క్షమింపగలడు గాని భక్తులకు హాని గూర్చినవానిని మాత్రము క్షమింపడు. కనుకనే అర్జునుడు క్షమింపగోరినను దుష్టులను దునుమాడుటకే శ్రీకృష్ణభగవానుడు నిశ్చయుడై యుండెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 35 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga - The Perfection of Renunciation - 35 🌴
35. etān na hantum icchāmi
ghnato ’pi madhusūdana
api trailokya-rājyasya
hetoḥ kiṁ nu mahī-kṛte
🌷 Translation
O Govinda, of what avail to us are a kingdom, happiness or even life itself when all those for whom we may desire them are now arrayed on this battlefield?
🌷 Purport :
Arjuna did not want to kill his relatives, and if there were any need to kill them, he desired that Kṛṣṇa kill them personally. At this point he did not know that Kṛṣṇa had already killed them before their coming into the battlefield and that he was only to become an instrument for Kṛṣṇa. This fact is disclosed in following chapters.
As a natural devotee of the Lord, Arjuna did not like to retaliate against his miscreant cousins and brothers, but it was the Lord’s plan that they should all be killed. The devotee of the Lord does not retaliate against the wrongdoer, but the Lord does not tolerate any mischief done to the devotee by the miscreants.
The Lord can excuse a person on His own account, but He excuses no one who has done harm to His devotees. Therefore the Lord was determined to kill the miscreants, although Arjuna wanted to excuse them.
🌹 🌹 🌹 🌹 🌹
08 June 2019