శ్రీమద్భగవద్గీత - 043: 01వ అధ్., శ్లో 43 / Bhagavad-Gita - 043: Chap. 01, Ver. 43



🌹. శ్రీమద్భగవద్గీత - 43 / Bhagavad-Gita - 43 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 43 🌴


43. దోషైరేతై: కులఘ్నానాం వర్ణసంకరకారకై: |
ఉత్సాద్యన్తే జాతిధర్మా: కులధర్మాశ్చ శాశ్వతా: ||

🌷. తాత్పర్యం :

వంశాచారమును నశింపజేసి దుష్టసంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతిధర్మములు నాశనమగును.

🌷. భాష్యము :

మానవుడు తన చరమలక్ష్యమైన ముక్తిని బడయురీతిలో మానవసంఘపు నాలుగువర్ణముల వారి కర్మలు (కుటుంబసంక్షేమ కార్యములతో సహా) నిర్ణయింపబడినవి. అవి సనాతనధర్మము లేదా వర్ణాశ్రమధర్మముచే నిర్దేశింపబడినవి. కనుకనే బాధ్యతారహితులైన నాయకులచే సనాతనధర్మ విధానము విచ్ఛిన్నము గావింపబడినపుడు సంఘములో అయోమయస్థితి ఏర్పడును. తత్ఫలితముగా జనులు తమ జీవితలక్ష్యమైన విష్ణువును మరచిపోవుదురు. అటువంటి నాయకులు అంధులుగా పిలువబడుదురు. వారిని అనుసరించు జనులు నిక్కముగా అయోమయస్థితిన పడగలరు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 43 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj

🌴 Chapter 1 - Vishada Yoga - 43 🌴


43. doṣair etaiḥ kula-ghnānāṁ
varṇa-saṅkara-kārakaiḥ
utsādyante jāti-dharmāḥ
kula-dharmāś ca śāśvatāḥ


Translation :

By the evil deeds of those who destroy the family tradition and thus give rise to unwanted children, all kinds of community projects and family welfare activities are devastated.


Purport :

Community projects for the four orders of human society, combined with family welfare activities, as they are set forth by the institution of sanātana-dharma, or varṇāśrama-dharma, are designed to enable the human being to attain his ultimate salvation. Therefore, the breaking of the sanātana-dharma tradition by irresponsible leaders of society brings about chaos in that society, and consequently people forget the aim of life – Viṣṇu. Such leaders are called blind, and persons who follow such leaders are sure to be led into chaos.

🌹🌹🌹🌹🌹


15 Jun 2019