శ్రీమద్భగవద్గీత - 092: 02వ అధ్., శ్లో 45 / Bhagavad-Gita - 092: Chap. 02, Ver. 45
🌹. శ్రీమద్భగవద్గీత - 92 / Bhagavad-Gita - 92 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 45 🌴
45. త్రైగుణ్యవిషయా వేదా
నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో
నిర్యోగక్షేమ ఆత్మవాన్ ||
తాత్పర్యం :
వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జునా! నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై, ద్వంద్వముల నుండియు మరియు యోగ క్షేమములనెడి చింతల నుండియు విడివడిన వాడవై ఆత్మ యందు స్థిరుడవగుము.
భాష్యము :
భౌతిక కార్యములు అన్నియును త్రిగుణములను కూడిన కర్మలను మరియు ఫలములను కూడి యుండును. భౌతిక జగమున బంధము కలిగించు సకామ ఫలములను పొందుటకే అవి ఉద్దేశింపబడినవి. జనులను ఇంద్రియ భోగానుభవము నుండి ఆధ్యాత్మిక స్థాయికి క్రమముగా గొనిపోవు నిమిత్తమే వేదములు అట్టి సకామకర్మలను ఉపదేశించును.
శ్రీకృష్ణభగవానుని స్నేహితునిగా మరియు శిష్యునిగా అర్జునుడు ఇచ్చట వేదాంత తత్త్వము యొక్క దివ్యస్థాయికి ఎదుగవలసినదిగా ఉపదేశింపబడినాడు. బ్రహ్మజిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గుర్చిన ప్రశ్నలే ఆ వేదాంత తత్త్వము యొక్క ఆరంభాములోని అంశము. భౌతికజగము నందు గల జీవులందరును తీవ్ర జీవన సంఘర్షణకు లోనై యుందురు.
ఏ విధముగా మనుగడను సాగించి పిదప భౌతికబంధము నుండి ముక్తినొందగగలరో ఉపదేశించుటకే భౌతికజగత్తును సృష్టించిన పిమ్మట భగవానుడు వారికి వేదంజ్ఞానము నొసగెను. భోగవాంఛను కూడిన కర్మలు(కర్మకాండ) ముగిసినంతనే ఆధ్యాత్మికానుభవమునకు అతడు ఉపనిషత్తుల రూపున అవకాశము నొసగెను. భగవద్గీత పంచమవేదమైన మహాభారతము యొక్క భాగమైనట్లు, ఉపనిషత్తులు వివిధ వేదములందలి భాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మికజీవనపు ఆరంభము సూచించును.
భౌతికదేహము నిలిచియున్నంత కాలము త్రిగుణ పూర్ణములైన కర్మలు మరియు ఫలితములు తప్పవు. కనుక ప్రతియొక్కరు సుఖదుఃఖములు, శీతతాపముల వంటి ద్వంద్వములను సహించుట నేర్చుకొని ఆ ద్వంద్వ సహనము ద్వారా లాభనష్టముల యెడ గల చింత నుండి దూరులు కావలెను. దేవదేవుడైన శ్రీకృష్ణుని కృపా కటాక్షములపై మనుజుడు సంపూర్ణముగా ఆధారపడినప్పుడు అట్టి దివ్యస్థితి (సంపూర్ణ కృష్ణభక్తిభావన యందు) సిద్ధింపగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 92 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 45 🌴
45. trai-guṇya-viṣayā vedā nistrai-guṇyo bhavārjuna
nirdvandvo nitya-sattva-stho niryoga-kṣema ātmavān
🌻 Translation :
The Vedas deal mainly with the subject of the three modes of material nature. O Arjuna, become transcendental to these three modes. Be free from all dualities and from all anxieties for gain and safety, and be established in the self.
🌻 Purport :
All material activities involve actions and reactions in the three modes of material nature. They are meant for fruitive results, which cause bondage in the material world. The Vedas deal mostly with fruitive activities to gradually elevate the general public from the field of sense gratification to a position on the transcendental plane.
Arjuna, as a student and friend of Lord Kṛṣṇa, is advised to raise himself to the transcendental position of Vedānta philosophy where, in the beginning, there is brahma-jijñāsā, or questions on the supreme transcendence. All the living entities who are in the material world are struggling very hard for existence. For them the Lord, after creation of the material world, gave the Vedic wisdom advising how to live and get rid of the material entanglement.
When the activities for sense gratification, namely the karma-kāṇḍa chapter, are finished, then the chance for spiritual realization is offered in the form of the Upaniṣads, which are part of different Vedas, as the Bhagavad-gītā is a part of the fifth Veda, namely the Mahābhārata. The Upaniṣads mark the beginning of transcendental life.
As long as the material body exists, there are actions and reactions in the material modes. One has to learn tolerance in the face of dualities such as happiness and distress, or cold and warmth, and by tolerating such dualities become free from anxieties regarding gain and loss. This transcendental position is achieved in full Kṛṣṇa consciousness when one is fully dependent on the good will of Kṛṣṇa.
🌹🌹🌹🌹🌹
31 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 091: 02వ అధ్., శ్లో 44 / Bhagavad-Gita - 091: Chap. 02, Ver. 44
🌹. శ్రీమద్భగవద్గీత - 91 / Bhagavad-Gita - 91 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 44 🌴
44. భోగైశ్వర్యప్రసక్తానం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధి: సమాధౌ న విధీయతే ||
🌷. తాత్పర్యం :
భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై, వానిచే మొహపరవశులగు వారి మనస్సు నందు భగవానుని భక్తియుక్త సేవను గుర్చిన స్థిరనిశ్చయము కలుగనే కలుగదు.
🌻. భాష్యము :
సమాధి” యనగా స్థిరమైన చిత్తమని భావము." వేదంనిఘంటువైన “నిరుక్తి” ఈ విషయమున ఇట్లు పలుకుచున్నది. “సమ్యాగాధీయతే(స్మిన్ అత్మతత్త్వ యథాత్మ్యమ్”- అనగా ఆత్మను అవగతము చేసికొనుటలో చిత్తము లగ్నమై యున్నప్పుడు అది సమాధి యందున్నదని చెప్పబడుచున్నది. ఇంద్రియభోగములందు అనురక్తులైనవారికి గాని, అటువంటి తాత్కాలికమైన వాటిచే మోహ పరవశలగు వారికి గాని సమాధి ఎన్నడును సాధ్యపడడు. అట్టి వారందరును దాదాపు మాయాశక్తిచే శిక్షింపబడినట్టివారే.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 91 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 44 🌴
44. vyavasāyātmikā buddhir ekeha kuru-nandana
bahu- śākhā hy anantāś ca buddhayo ’vyavasāyinām
🌻 Translation :
Those who are on this path are resolute in purpose, and their aim is one. O beloved child of the Kurus, the intelligence of those who are irresolute is many-branched.
🌻. Purport :
Samādhi means “fixed mind.” The Vedic dictionary, the Nirukti, says, samyag ādhīyate ’sminn ātma-tattva-yāthātmyam: “When the mind is fixed for understanding the self, it is said to be in samādhi.” Samādhi is never possible for persons interested in material sense enjoyment and bewildered by such temporary things. They are more or less condemned by the process of material energy.
🌹🌹🌹🌹🌹
30 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 090: 02వ అధ్., శ్లో 43 / Bhagavad-Gita - 090: Chap. 02, Ver. 43
🌹. శ్రీమద్భగవద్గీత - 90 / Bhagavad-Gita - 90 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 43 🌴
43. కామాత్మాన: స్వర్గపరా
జన్మ కర్మఫలప్రదాయమ్ |
క్రియావిశేషబహులాం
భోగైశ్వర్యగతిం ప్రతి ||
🌷. తాత్పర్యం :
స్వర్గలోకప్రాప్తి, ఉత్తమజన్మము,అధికారము వంటి వానిని, భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు.
🌻. భాష్యము :
అటువంటి అనుభవశూన్య జనులకు కృష్ణభక్తిభావన యందు స్థిరప్రయోజనముతో నెలకొనియుండుట మిగుల కష్టతరము. విషపూర్ణవృక్షపు పుష్పముల యెడ గల ఆకర్షణ పరిణామము నెరుగక మూడుడు వాని యందలి భోగముల యెడ ఆకర్షితులగుదురు.
“అపామ సోమమమృతా అభూమ మరియు అక్ష్యయ్యమ్ హ వై చాతుర్మాస్యయాజిన: సుకృతం భవతి” యని వేదపు కర్మకాండ భాగములో తెలుపబడినది. అనగా వేరుమాటలలో చాతుర్మాస్య వ్రతమును పాటించినవాడు సోమరసమును త్రాగి అమృతత్వమును మరియు ఆనందమును పొందుటకు అర్హుడగుచున్నాడు. సోమరసముతో బలమును పొంది, భోగానుభవమును పొందవలెనని భూమిపై కూడా కొందరు అభిలషింతురు. అట్టివారు భవబంధముల నుండి ముక్తి యెడ శ్రద్ధను చూపక కేవలము ఆర్భాటము కలిగిన వైదియజ్ఞములందే రతులగుదురు.
భోగలాలసులైన అట్టివారు స్వర్గభోగములను తప్ప వేరేదియును కోరరు. స్వర్గమునందు నందకాననమనెడి ఉద్యానవనము కలదనియు మరియు అందు సుందరస్త్రీ సాంగత్యము, కోరినంతగా సోమరసము లభించుననియు తెలుపబడినది. అట్టి దేహపర సౌఖ్యము నిక్కముగా ఇంద్రియపరమైనట్టిది. కనుకనే భౌతికజగత్తునకు ప్రభువులమనెడి భావనలో నిలిచి అట్టి లౌకిక తాత్కాలిక సౌఖ్యముల యెడ అనురక్తులై యుండెడివారు పెక్కురు కలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 90 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 43 🌴
43. kāmātmānaḥ svarga-parā janma- karma-phala- pradām
kriyā- viśeṣa- bahulāṁ bhogaiśvarya -gatiṁ prati
🌻 Translation :
For heavenly planets, resultant good birth, power, being desirous of sense gratification and opulent life, they say that there is nothing more than this.
🌻. Purport :
It is very difficult for such inexperienced persons to be situated in the determined action of Kṛṣṇa consciousness. As fools are attached to the flowers of poisonous trees without knowing the results of such attractions, unenlightened men are similarly attracted by such heavenly opulence and the sense enjoyment thereof.
🌹 🌹 🌹 🌹🌹
29 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 089: 02వ అధ్., శ్లో 42 / Bhagavad-Gita - 089: Chap. 02, Ver. 42
🌹. శ్రీమద్భగవద్గీత - 89 / Bhagavad-Gita - 89 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 42 🌴
42. యామిమాం పుష్పితాం
వాచం ప్రవదన్త్యవిపశ్చిత: |
వేదవాదరతా: పార్థ
నాన్యదస్తీతి వాదిన: ||
🌷. తాత్పర్యం :
స్వర్గలోకప్రాప్తి, ఉత్తమజన్మము,అధికారము వంటివానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల యెడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు.
🌻. భాష్యము :
సాధారణముగా జనులు మందమతులై యుందురు. అజ్ఞానకారణముగా వారు వేదమందలి కర్మకాండ భాగములోని సకామ కర్మల యెడనే అనురక్తులగుదురు. మదిర, మగువ, లౌకికవైభవములు పుష్కలముగా లభించు స్వర్గలోకమునందు జీవితము ననుభవించుటను తప్ప వారు వేరేదియును కోరరు. అట్టి స్వర్గలోకములను పొందుటకు పెక్కు యజ్ఞములు(ముఖ్యముగా జ్యోతిష్టోమ యజ్ఞములు) వేదములందు ప్రతిపాదింపబడినవి.
స్వర్గలోకప్రాప్తిని గోరువారు అట్టి యజ్ఞములను తప్పక ఆచరించియే తీరవలెనని వాటి యందు తెలుపబడినది. కాని అల్పజ్ఞులు ఇది యొక్కటే వేదముల సమస్త ప్రయోజనమని భావింతురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 89 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 42 🌴
42. yām imāṁ puṣpitāṁ vācaṁ pravadanty avipaścitaḥ
veda-vāda-ratāḥ pārtha nānyad astīti vādinaḥ
🌻 Translation :
Men of small knowledge are very much attached to the flowery words of the Vedas, which recommend various fruitive activities for elevation to heavenly planets, resultant good birth, power, and so forth.
🌻. Purport :
People in general are not very intelligent, and due to their ignorance they are most attached to the fruitive activities recommended in the karma-kāṇḍa portions of the Vedas. They do not want anything more than sense gratificatory proposals for enjoying life in heaven, where wine and women are available and material opulence is very common.
In the Vedas many sacrifices are recommended for elevation to the heavenly planets, especially the Jyotiṣṭoma sacrifices. In fact, it is stated that anyone desiring elevation to heavenly planets must perform these sacrifices, and men with a poor fund of knowledge think that this is the whole purpose of Vedic wisdom.
🌹 🌹 🌹 🌹🌹
29 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 088: 02వ అధ్., శ్లో 41 / Bhagavad-Gita - 088: Chap. 02, Ver. 41
🌹. శ్రీమద్భగవద్గీత - 88 / Bhagavad-Gita - 88 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 41 🌴
41. వ్యవసాయాత్మికా
బుద్ధిరేకేహ కురునన్ద |
బహుశాఖా హ్యనన్తాశ్చ
బుద్దయో వ్యవసాయినామ్ ||
🌷. తాత్పర్యం :
ఈ మార్గమున ఉన్నవారు స్థిరప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందనా! స్థిర ప్రయోజనము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును.
🌻. భాష్యము :
కృష్ణభక్తి రసభావన ద్వారా మనుజుడు జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థాయికి చేరగలడనెడి దృఢనిశ్చయమే “వ్యవసాయాత్మికా బుద్ధి” యని పిలువబడును. ఈ విషయమునే చైతన్య చరితామృతము (మధ్య లీల 22.62) ఈ విధముగా పలుకుచున్నది.
శ్రద్ధా శబ్దే – విశ్వాస కహే సుదృడ నిశ్చయ |
కృష్ణే భక్తి కయిలే సర్వకర్మ కృత హోయ ||
ఉదాత్తమైన దాని యందు మ్రొక్కవోని నమ్మకమే విశ్వాసమని అందురు. కృష్ణభక్తిరసభావిత కర్మల యందు మనుజడు నిమగ్నమైనపుడు వంశాచారములకు గాని, సంఘాచారములకు గాని లేక దేశాచారములకు గాని లోబడి కర్మనొనరింప నవసరము లేదు. గతజన్మ శుభాశుభకర్మల ఫలితములే లౌకికకర్మలు. కృష్ణభక్తి హృదయములో జాగృతమైనవాడు తన కార్యములందు శుభఫలములకై విడిగా యత్నింప నవసరము లేదు. ఏలయనగా మనుజుడు కృష్ణభక్తిభావనలో స్థితుడైనంతనే కర్మలన్నియును నిర్గుణస్థితికి చెందినవి కాగలవు. శుభాశుభ ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవుటయే అందులకు కారణము. జీవితపు భౌతికభావనను సంపూర్ణముగా త్యాగము చేయుట యనునది కృష్ణభక్తిభావన యందు పరిపూర్ణత్వ స్థితి. కృష్ణభక్తి యందు పురోగతి ద్వారా అట్టి స్థితి అప్రయత్నముగా సిద్ధింపగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 88 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 41 🌴
41. vyavasāyātmikā buddhir ekeha kuru-nandana
bahu- śākhā hy anantāś ca buddhayo ’vyavasāyinām
🌻 Translation :
Those who are on this path are resolute in purpose, and their aim is one. O beloved child of the Kurus, the intelligence of those who are irresolute is many-branched.
🌻 Purport :
A strong faith that by Kṛṣṇa consciousness one will be elevated to the highest perfection of life is called vyavasāyātmikā intelligence. The Caitanya-caritāmṛta (Madhya 22.62) states:
‘śraddhā’-śabde – viśvāsa kahe sudṛḍha niścaya kṛṣṇe bhakti kaile sarva-karma kṛta haya
Faith means unflinching trust in something sublime. When one is engaged in the duties of Kṛṣṇa consciousness, he need not act in relationship to the material world with obligations to family traditions, humanity or nationality. Fruitive activities are the engagements of one’s reactions from past good or bad deeds.
When one is awake in Kṛṣṇa consciousness, he need no longer endeavor for good results in his activities. When one is situated in Kṛṣṇa consciousness, all activities are on the absolute plane, for they are no longer subject to dualities like good and bad. The highest perfection of Kṛṣṇa consciousness is renunciation of the material conception of life. This state is automatically achieved by progressive Kṛṣṇa consciousness.
The resolute purpose of a person in Kṛṣṇa consciousness is based on knowledge. Vāsudevaḥ sarvam iti sa mahātmā su-durlabhaḥ: a person in Kṛṣṇa consciousness is the rare good soul who knows perfectly that Vāsudeva, or Kṛṣṇa, is the root of all manifested causes. As by watering the root of a tree one automatically distributes water to the leaves and branches, so by acting in Kṛṣṇa consciousness one can render the highest service to everyone – namely self, family, society, country, humanity, etc. If Kṛṣṇa is satisfied by one’s actions, then everyone will be satisfied.
🌹 🌹 🌹 🌹 🌹
28 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 087: 02వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 087: Chap. 02, Ver. 40
🌹. శ్రీమద్భగవద్గీత - 87 / Bhagavad-Gita - 87 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 40 🌴
40. నేహాభీక్రమనాశోస్తి
ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య
త్రాయతే మహతో భయాత్ ||
🌷. తాత్పర్యం :
ఈ ప్రయత్నము నందు నష్టము గాని, హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్పపురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజుని రక్షించును.
🌻. భాష్యము :
కృష్ణభక్తిరసభావన యందు కర్మనొనరించుట (శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఎటువంటి భోగాభిలాష లేకుండా కర్మను చేయుట) యనునది మహోన్నత దివ్యకార్యము. అటువంటి కార్యమును కొద్దిగా ఆరంభిచినను అందు ఎటువంటి ఆటంకములు కలుగవు. అంతియేగాక అట్టి స్వల్పయత్నము ఏనాడును నశించిపోదు.
భౌతికపరిధిలో ప్రారంభింపబడు కర్మ ఒకనాటికి సంపూర్ణము చెందవలసియే యుండును. అట్లుకానిచో ఆ యత్నమంతయు విఫలము కాగలదు. కాని కృష్ణభక్తిభావనలో ప్రారంభించబడు కర్మ సంపూర్ణము కాకున్నను శాశ్వతప్రభావమును కలిగియుండును. అనగా కృష్ణభక్తిభావన యందలి తన కర్మ పూర్ణము కానప్పటికిని కర్త ఏ విధమైన నష్టమును పొందడు.
కృష్ణపరమగు కర్మ ఒక్క శాతము పూర్తియైనను శాశ్వత ఫలమును కలిగియుండి తదుపరి ప్రారంభము రెండవ శాతము నుండి మొదలగును. కాని లౌకికకర్మ యందు నూటికి నూరుపాళ్లు సఫలత కలుగనిదే లాభము చేకూరదు. అజామిళుడు తన ధర్మమును కృష్ణభక్తి భావనలో కొద్దిగానే నిర్వర్తించినను భగవానుని కరుణా వలన అంత్యమున నూటికినూరుపాళ్ళు ఫలితమును పొందెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 87 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 40 🌴
40. nehābhikrama-nāśo ’sti pratyavāyo na vidyate
sv-alpam apy asya dharmasya trāyate mahato bhayāt
🌻 Translation :
In this endeavor there is no loss or diminution, and a little advancement on this path can protect one from the most dangerous type of fear.
🌻 Purport :
Activity in Kṛṣṇa consciousness, or acting for the benefit of Kṛṣṇa without expectation of sense gratification, is the highest transcendental quality of work. Even a small beginning of such activity finds no impediment, nor can that small beginning be lost at any stage. Any work begun on the material plane has to be completed, otherwise the whole attempt becomes a failure.
But any work begun in Kṛṣṇa consciousness has a permanent effect, even though not finished. The performer of such work is therefore not at a loss even if his work in Kṛṣṇa consciousness is incomplete.
One percent done in Kṛṣṇa consciousness bears permanent results, so that the next beginning is from the point of two percent, whereas in material activity without a hundred percent success there is no profit. Ajāmila performed his duty in some percentage of Kṛṣṇa consciousness, but the result he enjoyed at the end was a hundred percent, by the grace of the Lord.
🌹 🌹 🌹 🌹 🌹
27 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 086: 02వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 086: Chap. 02, Ver. 39
🌹. శ్రీమద్భగవద్గీత - 86 / Bhagavad-Gita - 86 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 39 🌴
39. ఏషా తేభిహితా సాంఖ్యే
బుద్ధిర్యోగే త్విమాం శ్రుణు |
బుద్ధ్యా యుక్తో యయా
పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి ||
🌷. తాత్పర్యం :
ఇంతవరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ననుసరించి నీకు వివరించితిని. ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మ రూపమున వివరించెదను ఆలకింపుము. ఓ పృథాకుమారా! అట్టి జ్ఞానము ననుసరించి నీవు వర్తింతువేని కర్మబంధము నుండి విడివడగలవు.
🌻. భాష్యము :
వేదనిఘంటువైన “నిరుక్తి” ననుసరించి “సాంఖ్యము” అనగా సంపూర్ణముగా వివరించునదని భావము. సాంఖ్య మనునది ఆత్మ యొక్క నిజస్వభావమును వివరించు తత్త్వము కాగా, యోగము ఇంద్రియముల నియమమును కూడియుండును.
ఇచ్చట యుద్ధము నుండి విరమించుటనెడి అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ ప్రీతిపై ఆధారపడి యున్నది. ధృతరాష్ట్రుని తనయులైన తన సోదరులను, జ్ఞాతులను యుద్ధములో జయించి రాజ్యము ననుభవించుట కన్నాను వారిని యుద్ధములో వధింపకుండుట తనకు ఎక్కువ ఆనందమును కలుగజేయునని తలచియుండుట చేతనే ముఖ్యధర్మమును మరచి అతడు యుద్ధము నుండి విరమిమప గోరెను.
అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములను ఇంద్రియ ప్రీతికి సంబంధించినవే. వారిని జయించుటచే కలిగెడి ఆనందము మరియు వారిని జీవితులుగా గాంచుటచే ఒసగూడెడి ఆనందము రెండును జ్ఞాన ధర్మములను పణముగా పెట్టునటువంటి దేహభావనపై ఆధారపడియున్నవి. పితామహుని దేహమును వధించుట ఆత్మను వధించుట కాబోదని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు వివరింపగోరెను.
సర్వులు ఆత్మస్వరూపులైనందున తాను మరియు ఇతరులందరును శాశ్వతముగా వ్యక్తిగతులనియు, అందరును భూత, భవిష్యత్, వర్తమానములందిన్ని వేళలా ఉండగలరనియు భగవానుడు వివరించెను. కేవలము మనము దేహములనే పలురీతులుగా మార్చుచున్నాము. కాని దేహబంధము నుండి ముక్తి పిదపయు మన వ్యక్తిత్వము నిలిచియుండును. ఈ విధముగా ఆత్మ మరియు దేహములకు సంబంధించిన విశ్లేషణాత్మక వివరణను శ్రీకృష్ణభగవానుడు తెలియజేసెను. వివిధకోణములలో కావింపబడిన ఆత్మ మరియు దేహములకు సంబంధించిన వివరణాత్మక జ్ఞానమే నిరుక్తి నిఘంటువు ననుసరించి సాంఖ్యజ్ఞానముగా తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 86 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 39 🌴
39. eṣā te ’bhihitā sāṅkhye buddhir yoge tv imāṁ śṛṇu
buddhyā yukto yayā pārtha karma-bandhaṁ prahāsyasi
🌻 Translation :
Thus far I have described this knowledge to you through analytical study. Now listen as I explain it in terms of working without fruitive results. O son of Pṛthā, when you act in such knowledge you can free yourself from the bondage of works.
🌻 Purport :
According to the Nirukti, or the Vedic dictionary, saṅkhyā means that which describes things in detail, and sāṅkhya refers to that philosophy which describes the real nature of the soul. And yoga involves controlling the senses. Arjuna’s proposal not to fight was based on sense gratification. Forgetting his prime duty, he wanted to cease fighting, because he thought that by not killing his relatives and kinsmen he would be happier than by enjoying the kingdom after conquering his cousins and brothers, the sons of Dhṛtarāṣṭra. In both ways, the basic principles were for sense gratification.
Happiness derived from conquering them and happiness derived by seeing kinsmen alive are both on the basis of personal sense gratification, even at a sacrifice of wisdom and duty. Kṛṣṇa, therefore, wanted to explain to Arjuna that by killing the body of his grandfather he would not be killing the soul proper, and He explained that all individual persons, including the Lord Himself, are eternal individuals; they were individuals in the past, they are individuals in the present, and they will continue to remain individuals in the future, because all of us are individual souls eternally.
We simply change our bodily dress in different manners, but actually we keep our individuality even after liberation from the bondage of material dress. An analytical study of the soul and the body has been very graphically explained by Lord Kṛṣṇa. And this descriptive knowledge of the soul and the body from different angles of vision has been described here as Sāṅkhya, in terms of the Nirukti dictionary.
🌹 🌹 🌹 🌹 🌹
26 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 085: 02వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 085: Chap. 02, Ver. 38
🌹. శ్రీమద్భగవద్గీత - 85 / Bhagavad-Gita - 85 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 38 🌴
38. సుఖదుఃఖే సమే కృత్వా
లాభాలాభౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ
నైవం పాపమువాప్స్యసి ||
🌷. తాత్పర్యం :
సుఖదు:ఖములను గాని, లాభాలాభములను గాని, జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయము. ఆ విధముగా చేయుట వలన నీవెన్నడును పాపమును పొందవు.
🌻. భాష్యము :
తాను యుద్దమును వాంఛించుచున్నందున యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణభగవానుడు ఇప్పుడు నేరుగా పలుకుచున్నాడు. కృష్ణపరమైన కర్మల యందు సుఖదు:ఖములు, లాభనష్టములు, జయాపజయములు వంటి భావనలకు తావు లేదు. ప్రతిదియు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ఒనరింపవలెననుట ద్వియభావానము.
కావున అట భౌతికకర్మల వలన బంధము కలుగదు. తన ఇంద్రియప్రీత్యర్థమే కర్మనొనరించువాడు నిక్కముగా బద్దుడగును. అట్టి కర్మ సాత్వికమైనను లేదా రాజసమైనను తదనుగుణమైన ఫలము ప్రాప్తించియే తీరును. కాని కృష్ణభక్తిభావనలో సంపూర్ణ శరణాగతి నొందినవాడు అట్లుగాక ఎవ్వరికిని ఋణపడడు మరియు బద్ధుడు కాడు. కాని సామాన్య కార్యము లందు రతుడైనవాడు ఋణియై యున్నాడు. శ్రీమద్భాగవతము (11.5.41) నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది.
దేవర్షిభూతాప్తనృణాం పిత్రూణాం న కింకరో నాయం ఋణి చ రాజన్ |
సర్వాత్మనా య: శరణం శరణ్యం గతో ముకున్దం పరిహృత్య కర్తమ్ ||
సర్వధర్మములను త్యజించి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతిని పొందెడివాడు దేవతలకు గాని, ఋషులకు గాని, జనులకు గాని, బంధువులకు గాని, పితృదేవతలకు గాని ఋణపడియుండడు మరియు సేవకుడు కాబోడు. “ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు పరోక్షముగా ఈ శ్లోకము నందు తెలియజేసేను. రాబోవు శ్లోకములలో ఈ విషయమును మరింత స్పష్టముగా వివరింప బడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 85 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 38 🌴
38. sukha-duḥkhe same kṛtvā lābhālābhau jayājayau tato yuddhāya yujyasva naivaṁ pāpam avāpsyasi
🌻 Translation :
Do thou fight for the sake of fighting, without considering happiness or distress, loss or gain, victory or defeat – and by so doing you shall never incur sin.
🌻 Purport :
Lord Kṛṣṇa now directly says that Arjuna should fight for the sake of fighting because He desires the battle. There is no consideration of happiness or distress, profit or loss, victory or defeat in the activities of Kṛṣṇa consciousness. That everything should be performed for the sake of Kṛṣṇa is transcendental consciousness; so there is no reaction to material activities.
He who acts for his own sense gratification, either in goodness or in passion, is subject to the reaction, good or bad. But he who has completely surrendered himself in the activities of Kṛṣṇa consciousness is no longer obliged to anyone, nor is he a debtor to anyone, as one is in the ordinary course of activities. It is said:
devarṣi-bhūtāpta nṛṇāṁ pitṝṇāṁ na kiṅkaro nāyam ṛṇī ca rājan sarvātmanā yaḥ śaraṇaṁ śaraṇyaṁ gato mukundaṁ parihṛtya kartam
“Anyone who has completely surrendered unto Kṛṣṇa, Mukunda, giving up all other duties, is no longer a debtor, nor is he obliged to anyone – not the demigods, nor the sages, nor the people in general, nor kinsmen, nor humanity, nor forefathers.” (Bhāg. 11.5.41) That is the indirect hint given by Kṛṣṇa to Arjuna in this verse, and the matter will be more clearly explained in the following verses.
🌹 🌹 🌹 🌹 🌹
25 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 084: 02వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 084: Chap. 02, Ver. 37
🌹. శ్రీమద్భగవద్గీత - 84 / Bhagavad-Gita - 84 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 37 🌴
37. హతో వా ప్రాప్స్యసి స్వర్గం
జిత్వా వా భోక్ష్యసే మహీమ్ |
తస్మాదుత్తిష్ట కౌన్తేయ
యుద్ధాయ కృతనిశ్చయ: ||
🌷. తాత్పర్యం :
ఓ కుంతీ తనయా! నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుతటయో లేక యుద్దమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరుగగలదు. కావున కృతనిశ్చయుడవై లేచి యుద్ధము చేయుము.
🌻. భాష్యము :
తన పక్షమున జయము కలుగనున్న నిశ్చయము లేకున్నను అర్జునుడు యుద్దమును చేయవలసియే యున్నది. ఏలయన అట్టి యుద్ధమునందు మరణించినను అతడు స్వర్గలోకములను పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 84 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 37 🌴
37. hato vā prāpsyasi svargaṁ jitvā vā bhokṣyase
mahīm tasmād uttiṣṭha kaunteya yuddhāya kṛta-niścayaḥ
🌻 Translation :
O son of Kuntī, either you will be killed on the battlefield and attain the heavenly planets, or you will conquer and enjoy the earthly kingdom. Therefore, get up with determination and fight.
🌻 Purport :
Even though there was no certainty of victory for Arjuna’s side, he still had to fight; for, even being killed there, he could be elevated into Heavenly planets
🌹 🌹 🌹 🌹 🌹
25 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 083: 02వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 083: Chap. 02, Ver. 36
🌹. శ్రీమద్భగవద్గీత - 83 / Bhagavad-Gita - 83 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 36 🌴
36. అ అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితా: | నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ||
🌷. తాత్పర్యం :
నీ శత్రువులు నిన్ను పలు నిర్దయవాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకన్నను నీకు దుఃఖకరమైనది వేరేది గలదు?
🌷. భాష్యము :
అర్జునుని అవాంఛితమైన జాలిని గాంచి శ్రీకృష్ణభగవానుడు తొలుత దిగ్బ్రాంతి చెందెను. అట్టి జాలి అనార్యులకు మాత్రమే తగినదని అతడు తెలియజేసెను. ఈ విధముగా భగవానుడు పలువాక్యములతో అర్జునుని అవాంఛిత కరుణకు విరుద్ధముగా తన వాదమును నిరూపణ చేసియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 83 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 36 🌴
36. avācya-vādāṁś ca bahūn vadiṣyanti tavāhitāḥ nindantas tava sāmarthyaṁ tato duḥkha-taraṁ nu kim
🌻 Translation :
Your enemies will describe you in many unkind words and scorn your ability. What could be more painful for you?
🌻 Purport :
Lord Kṛṣṇa was astonished in the beginning at Arjuna’s uncalled-for plea for compassion, and He described his compassion as befitting the non-Āryans. Now in so many words, He has proved His statements against Arjuna’s so-called compassion.
🌹 🌹 🌹 🌹 🌹
24 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 082: 02వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 082: Chap. 02, Ver. 35
🌹. శ్రీమద్భగవద్గీత - 82 / Bhagavad-Gita - 82 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 35 🌴
35. భయాద్ రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథా: |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||
🌷. తాత్పర్యం :
నీ పేరు ప్రతిష్టల యెడ గొప్ప గౌరవమును కలిగియున్న సేనాదిపతులు భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడినావని తలచి నిన్ను చులకన చేయుదురు.
🌻. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు తన తీర్పును ఇంకను కొనసాగించుచున్నాడు. “సోదరులు మరియు పితామహుని పై గల జాలితో యుద్దరంగమును వీడితివని దుర్యోధనుడు, కర్ణుడు మొదలగు సేనాధిపతులు భావింతురని నీవు తలచకుము. నీవు ప్రాణభయముతోనే పలాయనమైతివని వారు తలచెదరు. తత్కారణమున నీ పేరు ప్రతిష్టల యెడ వారి గొప్ప అభిప్రాయము నశించిపోగలదు”
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 82 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 35 🌴
35. bhayād raṇād uparataṁ maṁsyante tvāṁ mahā-rathāḥ
yeṣāṁ ca tvaṁ bahu-mato bhūtvā yāsyasi lāghavam
🌻 Translation :
The great generals who have highly esteemed your name and fame will think that you have left the battlefield out of fear only, and thus they will consider you insignificant.
🌻 Purport :
Lord Kṛṣṇa continued to give His verdict to Arjuna: “Do not think that the great generals like Duryodhana, Karṇa and other contemporaries will think that you have left the battlefield out of compassion for your brothers and grandfather. They will think that you have left out of fear for your life. And thus their high estimation of your personality will go to hell.”
🌹 🌹 🌹 🌹 🌹
23 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 081: 02వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 081: Chap. 02, Ver. 34
🌹. శ్రీమద్భగవద్గీత - 81 / Bhagavad-Gita - 81 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 34 🌴
34. అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేవ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిర్మ రణాదతి రిచ్యతే ||
🌷. తాత్పర్యం :
జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడును చెప్పుకొనుదురు. గౌరవనీయుడైనవానికి అపకీర్తి యనునది మరణము కన్నను దారుణ దారుణమైనది.
🌻 భష్యము :
అర్జునుని యుద్ధవిముఖతను గూర్చి శ్రీకృష్ణభగవానుడు అతని స్నేహితుడు మరియు తత్త్వబోధకుని రూపమున తన తుది తీర్పును ఈ విధముగా పలుకుచున్నాడు. “ఓ అర్జునా! యుద్ధము ప్రారంభము గాకమునుపే నీవు యుద్ధరంగమును వీడినచో నిన్ను జనులు భీరువని పిలుతురు. జనులు నిందించినను రణరంగము నుండి పారిపోయినచో ప్రాణములు దక్కగలవని నీవు భావించవచ్చును.
కాని ఈ విషయమున నీవు యుద్ధరంగమున మరణించుటయే ఉత్తమమని నా ఉపదేశము. నీ వంటి గౌరవనీయునికి అపకీర్తి యనునది మరణము కన్నను దారుణమైనది. కావున ప్రాణభీతితో నీవు పారిపోరాదు. యుద్ధమునందు మరణించుటయే ఉత్తమము. అది నా స్నేహితమును దుర్వినియోగాపరచుట నుండియు మరియు సంఘమునందు గౌరవమును కోల్పోవుట నుండియు నిన్ను కాపాడగలదు.”
కావున యుద్ధరంగమును వీడుట కన్నను దాని యందే మరణించుట అర్జునునకు ఉత్తమమనుట శ్రీకృష్ణభగవానుని తుది తీర్పుయై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 81 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 34 🌴
34. akīrtiṁ cāpi bhūtāni kathayiṣyanti te ’vyayām
sambhāvitasya cākīrtir maraṇād atiricyate
🌻 Translation :
People will always speak of your infamy, and for a respectable person, dishonor is worse than death.
🌻 Purport :
Both as friend and philosopher to Arjuna, Lord Kṛṣṇa now gives His final judgment regarding Arjuna’s refusal to fight. The Lord says, “Arjuna, if you leave the battlefield before the battle even begins, people will call you a coward. And if you think that people may call you bad names but that you will save your life by fleeing the battlefield, then My advice is that you’d do better to die in the battle.
For a respectable man like you, ill fame is worse than death. So, you should not flee for fear of your life; better to die in the battle. That will save you from the ill fame of misusing My friendship and from losing your prestige in society.”
So, the final judgment of the Lord was for Arjuna to die in the battle and not withdraw.
🌹 🌹 🌹 🌹 🌹
22 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 080: 02వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 080: Chap. 02, Ver. 33
🌹. శ్రీమద్భగవద్గీత - 80 / Bhagavad-Gita - 80 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 33 🌴
33. అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తత: స్వధర్మ్యం కీర్తిం చ హిత్వా పాప మువాప్స్యసి ||
🌷. తాత్పర్యం :
ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్దమును చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరచి నందులకు నిక్కముగా పాపము నొందగలవు. ఆ విధముగా యోధుడవనెడి కీర్తిని నీవు పోగొట్టుకొందువు.
🌷. భాష్యము :
అర్జునుడు ప్రసిద్ధి గాంచిన యోధుడు. శివునితో సహా పలువురు దేవతలతో యుద్ధమొనర్చి అతడు కీర్తిని బడసెను. వేటగాని రూపములో నున్న శివుని అర్జునుడు రణమునందు ఓడించెను. ఆ విధముగా అతడు శివుని మెప్పించి అతని నుండు పాశుపాతాస్త్రమును బహుమతిగా పొందెను. కనుకనే అర్జునుడు గొప్ప యోధుడని సర్వులు ఎరుగుదురు.
ద్రోణాచార్యుడు సైతము అతనికి అనేక వరములను మరియు గురువును సైతము వధింపగల విశేష శక్తివంతమైన ఆయుధమును నొసగెను. ఈ విధముగా అర్జునుడు పలువురు మహానుభావుల నుండు యుద్ధమునకు కావలసిన యోగ్యతలను సాధించెను. స్వర్గాధిపతి మరియు జనకుడైన ఇంద్రుని నుండియు అతడు వరములను పొందెను.
కాని ఇప్పుడు అతడు యుద్దమును త్యజించినచో క్షత్రియునిగా తన ధర్మమును అలక్ష్య పరచిన వాడగుటయే గాక, పేరు ప్రతిష్టలను కోల్పోయి నరకమునకు రాచమార్గమును తయారు చేసికొనిన వాడగును. అనగా వేరు మాటలలో యుద్దమును చేయుట వలన గాక, దాని నుండి విరమించుట ద్వారా అతడు నరకమును పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 80 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 33 🌴
33. atha cet tvam imaṁ dharmyaṁ saṅgrāmaṁ na kariṣyasi tataḥ sva-dharmaṁ kīrtiṁ ca hitvā pāpam avāpsyasi
🌻 Translation :
If, however, you do not perform your religious duty of fighting, then you will certainly incur sins for neglecting your duties and thus lose your reputation as a fighter.
🌻 Purport :
Arjuna was a famous fighter, and he attained fame by fighting many great demigods, including even Lord Śiva. After fighting and defeating Lord Śiva in the dress of a hunter, Arjuna pleased the lord and received as a reward a weapon called pāśupata-astra.
Everyone knew that he was a great warrior. Even Droṇācārya gave him benedictions and awarded him the special weapon by which he could kill even his teacher. So he was credited with so many military certificates from many authorities, including his adoptive father Indra, the heavenly king.
But if he abandoned the battle, not only would he neglect his specific duty as a kṣatriya, but he would lose all his fame and good name and thus prepare his royal road to hell. In other words, he would go to hell not by fighting but by with drawing from battle.
🌹 🌹 🌹 🌹 🌹
21 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 079: 02వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 079: Chap. 02, Ver. 32
🌹. శ్రీమద్భగవద్గీత - 79 / Bhagavad-Gita - 79 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 32 🌴
32. యదృచ్చయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖిన: క్షత్రియా: పార్థ లభన్తే యుద్ధమీదృశమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థా! స్వర్గద్వారములను తెరచునటువంటి యుద్దావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు.
🌷. భాష్యము :
“ఈ యుద్ధము నందు ఎటువంటి శుభమును నేను గాంచుట లేదు. ఇది శాశ్వతమగు నరకవాసమునే గూర్చును.” అని పలికిన అర్జునుని నైజమును జగద్గురువైన శ్రీకృష్ణుడు నిరసించుచున్నాడు. అర్జునుని అట్టి పలుకులు కేవలము అజ్ఞానజనితములు. అతడు తన విధ్యుక్తధధర్మ నిర్వహణమునందు అహింసను పాటింపదలచెను. క్షత్రియుడైనవాడు యుద్ధరంగమునందు అహింసను పాటించుట యనునది మూర్ఖుల సిద్ధాంతము. వ్యాసదేవుని జనకుడు మరియు గొప్ప ఋషియైన పరాశరుడు రచించిన పరాశరుడు రచించిన పరాశరస్మృతి యందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.
క్షత్రియో హి ప్రజా రక్షన్ శస్త్రపాణి: ప్రదణ్డయన్ |
ననిర్జిత్య పరసైన్యాది క్షితిం ధర్మేణ పాలయేత్ ||
“పౌరులకు అన్నిరకములైన కష్టముల నుండి రక్షించుట క్షత్రియుని ధర్మమై యున్నందున అవసరమగు విషయములందు శాంతిభద్రతల పరిరక్షణకై హింసను చేపట్టవలసి యుండును. కావున అతడు శత్రురాజుల సైన్యమును జయించి, తదుపరి ధర్మబద్దముగా రాజ్యమును పాలించెను.
ఈ విషయమున నన్నింటిని బట్టి అర్జునుడు యుద్దమును త్యజించుటకు ఎట్టి కారణము లేదు. శత్రువులను జయించినచో రాజ్యమును అతడు అనుభవింపగలడు. ఒకవేళ యుద్ధరంగమునందు మరణించినచో ద్వారములు తెరువబడియున్న స్వర్గమునకు అతడు చేరగలడు. కావున ఏ విధముగా గాంచినను యుద్ధమే అతనికి లాభదాయకమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 79 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 32 🌴
32. yadṛcchayā copapannaṁ svarga-dvāram apāvṛtam sukhinaḥ kṣatriyāḥ pārtha labhante yuddham īdṛśam
🌻 Translation :
O Pārtha, happy are the kṣatriyas to whom such fighting opportunities come unsought, opening for them the doors of the heavenly planets.
🌻 Purport :
As supreme teacher of the world, Lord Kṛṣṇa condemns the attitude of Arjuna, who said, “I do not find any good in this fighting. It will cause perpetual habitation in hell.” Such statements by Arjuna were due to ignorance only. He wanted to become nonviolent in the discharge of his specific duty. For a kṣatriya to be on the battlefield and to become nonviolent is the philosophy of fools. In the Parāśara-smṛti, or religious codes made by Parāśara, the great sage and father of Vyāsadeva, it is stated:
kṣatriyo hi prajā rakṣan śastra-pāṇiḥ pradaṇḍayan nirjitya para-sainyādi kṣitiṁ dharmeṇa pālayet
“The kṣatriya’s duty is to protect the citizens from all kinds of difficulties, and for that reason he has to apply violence in suitable cases for law and order. Therefore he has to conquer the soldiers of inimical kings, and thus, with religious principles, he should rule over the world.”
Considering all aspects, Arjuna had no reason to refrain from fighting. If he should conquer his enemies, he would enjoy the kingdom; and if he should die in the battle, he would be elevated to the heavenly planets, whose doors were wide open to him. Fighting would be for his benefit in either case.
🌹 🌹 🌹 🌹 🌹
20 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 078: 02వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 078: Chap. 02, Ver. 31
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 78 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 31 🌴
31. స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి |
ధర్మ్యాద్ది యుద్ధాచ్చ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే ||
🌷. తాత్పర్యం :
క్షత్రియునిగా స్వధర్మము ననుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను శ్రేయోదాయకమైనది వేరోక్కటి లేదని నివెరుగవలెను. కావున సంశయింపవలసిన అవసరమే లేదు.
🌷. భాష్యము :
సంఘము నడచుటకై అవసరమైన నాలుగు విధములైన వర్ణములలో సత్పరిపాలన కొరకై యున్న రెండవ వర్ణమునకు క్షత్రియవర్ణమని పేరు. “క్షత్” అనగా హాని యని భావము. హాని నుండి రక్షణము గూర్చువారే క్షత్రియులు (త్రాయతే – రక్షించుట). సాధారణముగా సంహారము విషయమున క్షత్రియులకు అరణ్యమున శిక్షణ ఇవ్వబడును. క్షత్రియులు అడవికి పోయి, ఒంటరిగా పులితో ఖడ్గమును బూని తలపడి, అది మరణించిన పిమ్మట దానికి రాజలాంఛనములతో దహనక్రియలు చేయుదురు.
ఈ విధమైన పధ్ధతి నేటికిని జైపూరు రాష్ట్రమనందలి క్షత్రియవంశరాజులచే పాటింపబడుచున్నది. ధర్మరహితమైన హింసయనునది కొన్నిమార్లు అత్యంత అవసరమైనది కనుక క్షత్రియులకు పోటీపడుట మరియు సంహరించుట యందు అభ్యాసము గూర్చబడును. కావుననే క్షత్రియులు నేరుగా సన్యాసమును స్వీకరించరాదు. అహింస యనునది రాజనీతి యందు ఒక తంత్రమైన అది ఎన్నడును ఒక సిద్ధాంతము కాదు.
స్వధర్మము రెండు రకములు. ముక్తిని పొందనంత వరకు మనుజుడు దేహమునకు సంబంధించిన విధ్యుక్తధర్మములను ధర్మనుసారముగా ముక్తిని పొందుట కొరకై ఒనరించవలెను. ముక్తిని పొందిన పిమ్మట స్వధర్మము ఆధ్యాత్మికము కాగలదు. అది ఆపై దేహభావన యందున్నంత వరకు బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు వేరు వేరు ధర్మములుండును.
అట్టి ధర్మములు అనివార్యములు. వాస్తవమునకు సస్వధర్మము భగవానునిచే నిర్ణయింపబడినది. ఈ విషయము చతుర్థాధ్యాయము నందు స్పష్టపరుపబడినది. దేహభావనలో ఒనరింపబడెడి స్వధర్మము వర్ణాశ్రమధర్మముగా పిలువబడుచున్నది.అదియే మనుజుని ఆధ్యాత్మిక అవగాహనమునకు సోపానమై యున్నది. వర్ణాశ్రమధర్మ పాలనముతో (గుణముల ననుసరించియున్న ప్రత్యేకధర్మములు) మానవనాగరికత ఆరంభమగును.
ఏ రంగమునందైనను ప్రామాణికులైన వారి ఆజ్ఞల ప్రకారము స్వధర్మము నిర్వహించుట యనునది మనుజుని ఉత్తమ జన్మమునకు ఉద్ధరించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 78 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 31 🌴
31. sva-dharmam api cāvekṣya na vikampitum arhasi dharmyād dhi yuddhāc chreyo ’nyat kṣatriyasya na vidyate
🌻 Translation :
Considering your specific duty as a kṣatriya, you should know that there is no better engagement for you than fighting on religious principles; and so there is no need for hesitation.
🌻 Purport :
Out of the four orders of social administration, the second order, for the matter of good administration, is called kṣatriya. Kṣat means hurt. One who gives protection from harm is called kṣatriya (trāyate – to give protection). The kṣatriyas are trained for killing in the forest. A kṣatriya would go into the forest and challenge a tiger face to face and fight with the tiger with his sword. When the tiger was killed, it would be offered the royal order of cremation.
This system has been followed even up to the present day by the kṣatriya kings of Jaipur state. The kṣatriyas are specially trained for challenging and killing because religious violence is sometimes a necessary factor. Therefore, kṣatriyas are never meant for accepting directly the order of sannyāsa, or renunciation. Nonviolence in politics may be a diplomacy, but it is never a factor or principle.
There are two kinds of sva-dharmas, specific duties. As long as one is not liberated, one has to perform the duties of his particular body in accordance with religious principles in order to achieve liberation.
When one is liberated, one’s sva-dharma – specific duty – becomes spiritual and is not in the material bodily concept.
🌹 🌹 🌹 🌹 🌹
19 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 077: 02వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 077: Chap. 02, Ver. 30
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 77 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 30 🌴
30. దేహీ నిత్య మవధ్యోయం దేహేసర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాణి న త్వం శోచితుమర్హసి ||
🌷. తాత్పర్యం :
ఓ భరతవంశీయుడా! దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖించుట తగదు.
🌷. భాష్యము :
అవధ్యమైన ఆత్మను గూర్చిన ఉపదేశము శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట ముగించుచున్నాడు. అమరమైన ఆత్మను గూర్చి అనేక విధములుగా వివరించుచు అది నిత్యమైనదియు, దేహము శాశ్వతము కానిదనియు భగవానుడు నిర్దారించెను. కావున పితామహుడైన భీష్ముడు మరియు గురువైన ద్రోణుడు యుద్ధమున మరణింతురనెడి భీతితో క్షత్రియుడైన అర్జునుడు యుద్దమును త్యజింపరాదు. శ్రీకృష్ణుని ప్రామణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతియెక్కరు విశ్వసింపవలెను.
ఆత్మ యనునది లేదనియు లేదా రసాయనముల కలయికతో ఒకానొక స్థితిలో జీవము పుట్టుననియు భావించరాదు. ఆత్మ నిత్యమైనను హింస ఎన్నడును ప్రోత్సహనీయము కాదు. కాని యుద్ధసమయమున దాని నిజమైన అవసరము కలిగినపడు మాత్రము దానిని తజించరాదు. అట్టి అవసరము భగవానుని ఆదేశము పైననే సమర్థింపవలెను గాని తోచినరీతిగా కాదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 77 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 30 🌴
30. dehī nityam avadhyo ’yaṁ
dehe sarvasya bhārata
tasmāt sarvāṇi bhūtāni
na tvaṁ śocitum arhasi
🌻 Translation :
O descendant of Bharata, he who dwells in the body can never be slain. Therefore you need not grieve for any living being.
🌻 Purport :
The Lord now concludes the chapter of instruction on the immutable spirit soul. In describing the immortal soul in various ways, Lord Kṛṣṇa establishes that the soul is immortal and the body is temporary.
Therefore Arjuna as a kṣatriya should not abandon his duty out of fear that his grandfather and teacher – Bhīṣma and Droṇa – will die in the battle. On the authority of Śrī Kṛṣṇa, one has to believe that there is a soul different from the material body, not that there is no such thing as soul, or that living symptoms develop at a certain stage of material maturity resulting from the interaction of chemicals.
Though the soul is immortal, violence is not encouraged, but at the time of war it is not discouraged when there is actual need for it. That need must be justified in terms of the sanction of the Lord, and not capriciously.
🌹🌹🌹🌹🌹
18 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 076: 02వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 076: Chap. 02, Ver. 29
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 76 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 29 🌴
29. ఆశ్చర్యవత్ పశ్యతి కష్చిదేనమ్ ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్య: |
ఆశ్చర్యవచ్చైనమన్య: శ్రుణోతి శ్రుత్వాప్యేనం వేదం న చైవ కశ్చిత్ ||
🌷. తాత్పర్యం :
కొందరు ఆత్మను అధ్బుతమైనదానిగా గాంచుదురు. కొందరు దానిని అధ్బుతమైన దానిగా వర్ణింతురు. మరికొందరు దానిని అధ్బుతమైనదానిగా శ్రవణము చేయుదురు. ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏ మాత్రము తెలియకుందురు.
🌷. భాష్యము :
అధికపరిమాణ దేహము గల జంతువునందు మరియు ఘనమైన అశ్వత్థవృక్షమునందే గాక, ఒక అంగుళమాత్ర స్థలములో కోట్లాది సంఖ్యలో నుండు సూక్ష్మజీవుల యందును ఆత్మ ఉన్నదనెడు విషయము నిక్కముగా అధ్బుతమైనది. అల్పజ్ఞులు మరియు తపోనిష్ట లేనివారు ఇట్టి ఆత్మ యొక్క అధ్బుతకర్మలను తెలియకున్నారు. విశ్వమునందు తొలిజీవియైన బ్రహ్మదేవునకు సైతము జ్ఞానము ప్రసాదించిన పరమప్రామణికుడైన శ్రీకృష్ణభగవానుడే స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయమును గ్రహింపజాలరు.
కేవలము భౌతికభావనయే కలిగియుండుట వలన ఎట్లు అణుపరిమాణ ఆత్మ అతిపెద్దదిగా మరియు అతి చిన్నదిగా వర్తింపగలదో ఈ కాలపు జనులు ఊహింపజాలరు. కనుకనే వారు దాని నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అధ్బుతమైనదిగా గాంతురు. భౌతికశక్తిచే మోహమునకు గురియై జనులు ఇంద్రియభోగ విషయములందే అధికముగా రతులగుదురు.
ఆత్మానుభవమును పొందకున్నచో కర్మలన్నియును జీవనసంఘర్షణలో అంత్యమున ఓటమినే కలుగజేయుననుట వాస్తవమైనను వారు దాని కొరకై సమయమును కేటాయింపరు. ప్రతియొక్కరు ఆత్మను గూర్చి తెలిసికొని తద్ద్వారా భౌతికక్లేశములను పరిష్కారము చూపవలెనని వారు బహుషా తెలిసియుండకపోవచ్చును.
ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సంగమున ప్రవచనములను వినుచుందురు. కాని కొన్నిమార్లు అజ్ఞానవశమున వారు ఆత్మ మరియు పరమాత్మ లిరివురును ఒక్కటే యనియు, వారివురి నడుమ పరిమాణమందును భేదము లేదనియు భావించి తప్పుమార్గమున చనుదురు. ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని, వారి కర్మల, వారి నడుమ గల సంబంధమును, వారికి సంబంధించిన విషయముల నన్నింటిని సంపూర్తిగా తెలిసిన మనుజుడు దుర్లభుడు.
ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది, ఆత్మ యొక్క స్థానమును వివిధకోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత దుర్లభుడు. కాని ఏదియో ఒక విధముగా ఈ ఆత్మను గుర్చిన విషయమును మనుజుడు అవగతము చేసికొనినచో జన్మ సఫలము కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 76 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 29 🌴
29. āścarya-vat paśyati kaścid enam
āścarya-vad vadati tathaiva cānyaḥ
āścarya-vac cainam anyaḥ śṛṇoti
śrutvāpy enaṁ veda na caiva kaścit
🌻 Translation :
Some look on the soul as amazing, some describe him as amazing, and some hear of him as amazing, while others, even after hearing about him, cannot understand him at all.
🌻 Purport :
The fact that the atomic soul is within the body of a gigantic animal, in the body of a gigantic banyan tree, and also in the microbic germs, millions and billions of which occupy only an inch of space, is certainly very amazing.
Men with a poor fund of knowledge and men who are not austere cannot understand the wonders of the individual atomic spark of spirit, even though it is explained by the greatest authority of knowledge, who imparted lessons even to Brahmā, the first living being in the universe.
Owing to a gross material conception of things, most men in this age cannot imagine how such a small particle can become both so great and so small. So men look at the soul proper as wonderful either by constitution or by description.
Illusioned by the material energy, people are so engrossed in subject matters for sense gratification that they have very little time to understand the question of self-understanding, even though it is a fact that without this self-understanding all activities result in ultimate defeat in the struggle for existence. Perhaps they have no idea that one must think of the soul, and thus make a solution to the material miseries.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
17 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 075: 02వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 075: Chap. 02, Ver. 28
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 75 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 28 🌴
28. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత |
అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||
🌷. తాత్పర్యం :
సృజింపబడిన జీవులందరు ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక యుందురు. అట్టి యెడ దుఃఖించుటకు అవసరమేమి కలదు?
🌷. భాష్యము :
ఆత్మ ఉనికిని అంగీకరించువారు మరియు ఆత్మ ఉనికిని అంగీకరింపనివారు అనుచు తత్వవేత్తలు రెండు రకములుగా నున్నారు. వీరిలో ఎవరిని అనుసరించినప్పటికిని దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. వేదజ్ఞానము ననుసరించువారు ఆత్మ ఉనికిని అంగీకరింపని వారిని నాస్తికులని పిలుతురు.
మాటవరుసకు ఆ నాస్తికవాదమును గ్రహించినను దుఃఖమునకు ఎత్తి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగియుండగా భౌతికాంశములన్నియును సృష్టికి పూర్వము అవ్యక్తములై యుండును. సూక్ష్మమైన ఈ అవ్యక్తస్థితి నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును.
భూమి నుండి అనేకములు సృష్టింపబడుచున్నవి. ఒక ఎత్తైన భవంతిని ఉదాహరణముగా గైకొననిచో అది భూమ యొక్క పదార్థముల నుండియే వ్యక్తమగుచున్నది. దానిని కూలగొట్టి నప్పుడు అది తిరిగి అవ్యక్తమైదాని పదార్థములులన్నియును భూమిలో కలసిపోవును. శక్తి యనునది సృష్టింపబడదు మరియు నశింపబడదనెడి సిద్ధాంతము ప్రకారము శక్తి అక్షయమై యున్నను కాలములో అనేకములు వ్యక్తములై తిరిగి అవ్యక్తములగు చుండును.
అట్టి యెడ వాటి వ్యక్తస్థితి గూర్చియు లేదా అవ్యక్తస్థితిని గూర్చియు దుఃఖించుటకు కారణమేమి? అవ్యక్తస్థితి యందు వాటికి నాశము లేదు. ఆద్యంతములు రెండింటి యందును అవి అవ్యక్తరూపమున నిలిచి మధ్యలో వ్యక్తములగుచున్నవి. కాని అది ఎట్టి నిజమైన భేదమును కలుగజేయదు.
దేహము కాలక్రములో నశించు స్వభావము కలది(అన్తవన్త ఇమే దేహా:) అయినను ఆత్మ శాస్వతమైనదని (నిత్యస్యోక్తా: శరీరిణ:) యనెడి భగవద్గీత యందు తెలుపబడిన వేదసారాంశమును మనము అంగీకరింతుమేని ఈ దేహము ఒక వస్త్రము వంటిదని సదా జ్ఞప్తి యందుంచు కొనవలెను. కావున వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖించవలెను? ఆత్మతో పోల్చినచో దేహమునకెట్టి అస్తిత్వము లేదు.
అది ఒక స్వప్నము వంటిది. స్వప్నములో కొన్నిమార్లు మనము ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజు వలె ఒక రథము నందు కూర్చొనినట్లు గాంచవచ్చును. కాని మేల్కొంచినంతనే మనము ఆకాశమున గాని, రథమునందు గాని లేమని భోధపడగలదు.
భౌతికదేహపు అస్తిత్వలేమిని ఆధారము చేసికోనియే వేదజ్ఞానము మనుజుని ఆత్మానుభవమునకు ప్రోత్సహించుచున్నది. కావున ఆత్మ యొక్క అస్తిత్వము అంగీకరించినను లేదా అంగీకరింపకున్నను దేహము నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 75 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 28 🌴
28. avyaktādīni bhūtāni vyakta-madhyāni bhārata
avyakta-nidhanāny eva tatra kā paridevanā
🌻 Translation :
All created beings are unmanifest in their beginning, manifest in their interim state, and unmanifest again when annihilated. So what need is there for lamentation?
🌻 Purport :
Accepting that there are two classes of philosophers, one believing in the existence of the soul and the other not believing in the existence of the soul, there is no cause for lamentation in either case.
Nonbelievers in the existence of the soul are called atheists by followers of Vedic wisdom. Yet even if, for argument’s sake, we accept this atheistic theory, there is still no cause for lamentation.
Apart from the separate existence of the soul, the material elements remain unmanifested before creation. From this subtle state of nonmanifestation comes manifestation, just as from ether, air is generated; from air, fire is generated; from fire, water is generated; and from water, earth becomes manifested.
From the earth, many varieties of manifestations take place. Take, for example, a big skyscraper manifested from the earth. When it is dismantled, the manifestation becomes again unmanifested and remains as atoms in the ultimate stage.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
16 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 074: 02వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 074: Chap. 02, Ver. 27
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 27 🌴
27. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి ||
🌷. తాత్పర్యం :
పుట్టిన వానికి మరణము తప్పదు మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విధ్యుక్త ధర్మ నిర్వహణము నందు నీవు దుఃఖింప రాదు.
🌷. భాష్యము :
కర్మానుసారము ప్రతి యొక్కరు జన్మింప వలసి యున్నది. నిర్ణీత కాల కార్యములు ముగిసిన పిమ్మట మరణించి వేరొక జన్మ నొందవలసి యుండును. ఈ విధముగా జనన, మరణచక్రములో ప్రతియోక్కరు ముక్తి యనునది లేకుండా పరిభ్రమింతురు.
ఇట్టి జననమరణచక్రము అనవసర హత్యలు, జంతుహింస, యుద్ధము వంటివానిని ప్రోత్సహించునది కాదు. కాని అదే సమయమున అట్టి హింస మరియు యుద్ధము లనునవి మానవసంఘములో శాంతి భద్రతలను నెలకొల్పుటకు అనివార్య అంశములు కాగలవు.
శ్రీకృష్ణభగవానుని వాంఛ అయినందున కురుక్షేత్రయుద్ధము అనివార్యామై యుండెను. అంతియేగాక ధర్మము కొరకై యుద్ధము చేయుట క్షత్రియుల విధ్యుక్తధర్మమై యున్నది. తానూ విధ్యుక్తధర్మమునే నిర్వర్తించుచున్నప్పుడు అర్జునుడు ఎందులకై తనవారి మరణమును గూర్చి చింతింపవలెను లేదా భయపడవలెను.
ధర్మమును త్యజించి తద్ద్వారా పాపమును పొందుట అతనికి ఏమాత్రము తగదు. అటువంటి పాపము విషయమున అతడు మిగుల భీతుడై యున్నాడు. విధ్యుక్తధర్మమైన యుద్దమును విడునాడుట ద్వారా ఎన్నడును అతడు తన బంధువుల మరణము ఆపలేడు. పైగా అధర్మమార్గమును ఎంచుకొనుట వలన అతడు పతనము నొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 74 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 27 🌴
27. jātasya hi dhruvo mṛtyur dhruvaṁ janma mṛtasya
ca tasmād aparihārye ’rthe na tvaṁ śocitum arhasi
🌻 Translation :
One who has taken his birth is sure to die, and after death one is sure to take birth again. Therefore, in the unavoidable discharge of your duty, you should not lament.
🌻 Purport :
One has to take birth according to one’s activities of life. And after finishing one term of activities, one has to die to take birth for the next. In this way one is going through one cycle of birth and death after another without liberation. This cycle of birth and death does not, however, support unnecessary murder, slaughter and war. But at the same time, violence and war are inevitable factors in human society for keeping law and order.
The Battle of Kurukṣetra, being the will of the Supreme, was an inevitable event, and to fight for the right cause is the duty of a kṣatriya. Why should he be afraid of or aggrieved at the death of his relatives since he was discharging his proper duty?
He did not deserve to break the law, thereby becoming subjected to the reactions of sinful acts, of which he was so afraid. By avoiding the discharge of his proper duty, he would not be able to stop the death of his relatives, and he would be degraded due to his selection of the wrong path of action.
🌹🌹🌹🌹🌹
15 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 073: 02వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 073: Chap. 02, Ver. 26
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 73 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 26 🌴
26. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మాహాబాహో నైనం శోచితుమర్హసి ||
తాత్పర్యం :
ఓ మహాబాహో! ఒకవేళ నీవీ ఆత్మ ( లేదా జీవలక్షణములు) ఎల్లప్పుడును పుట్టుచు, మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు.
భాష్యము :
దేహమునకు పరముగా ఆత్మ కోక ప్రత్యేక ఉనికి కలదని అంగీకరింపని తత్త్వవేత్తల తెగ ఒకటి ఎల్లప్పుడు ఉండును. వారు దాదాపు బౌద్ధులను పోలినట్టివారు. శ్రీకృష్ణభగవానుడు గీతను తెలియజేసిన కాలమునందు అట్టివారు ఉన్నట్లుగా గోచరించుచున్నది. “లోకాయతికులు” మరియు “వైభాషికులు” అని తెలియబడు అట్టి తత్త్వవేత్తలు మూలకముల సరియైన సమ్మేళనము వలన జీవనము కలుగునని పలుకుదురు.
నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తత్త్వవేత్తలు సైతము అదేవిధముగా తలతురు. వారి సిద్ధాంతము ప్రకారము మూలకముల కలయికలో కొన్ని భౌతిక, రసాయయనచర్యల వలన జీవము కలుగుచున్నది. నవీన మానవశాస్త్రములు ఇట్టి సిద్ధాంతము పైననే ఆధారపడియున్నది. పలు కుహునా ధర్మములు ఈ సిద్ధాంతమును మరియు భక్తిరహితమైన బౌద్ధవాదమును అనుసరించుచు అమెరికాదేశమునందు ప్రాచుర్యము నొందుచున్నది.
ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతము వలె ఆత్మ ఉనికిని గుర్తింపకున్నను దుఃఖించుటకు కారణము లేదు. కొన్ని రసాయనములు నష్టము వలన ఎవ్వరును చింతాక్రంతులై విధ్యుక్త ధర్మమును విడనాడరు. పైగా నేటి ఆధునిక యుద్ధపద్ధతిన శత్రువుపై విజయమును పొందుటకు మనుజుడు టన్నుల పరిమాణములో రసాయనములను వృథా చేయుచున్నాడు. వైభాషిక సిద్ధాంతముప్రకారము దేహముతో పాటు ఆత్మ నశించును. కావున అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేదంనిర్ణయమును అంగీకరించినను లేదా ఆత్మ ఉనికిని నిరాకరించినను చింతించుటకు ఎట్టి కారణము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 73 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 26 🌴
26. atha cainaṁ nitya-jātaṁ nityaṁ vā manyase mṛtam tathāpi tvaṁ mahā-bāho nainaṁ śocitum arhasi
🌻 Translation :
If, however, you think that the soul [or the symptoms of life] will always be born and die forever, you still have no reason to lament, O mighty-armed.
🌻 Purport :
There is always a class of philosophers, almost akin to the Buddhists, who do not believe in the separate existence of the soul beyond the body. When Lord Kṛṣṇa spoke the Bhagavad-gītā, it appears that such philosophers existed, and they were known as the Lokāyatikas and Vaibhāṣikas. Such philosophers maintain that life symptoms take place at a certain mature condition of material combination. The modern material scientist and materialist philosophers also think similarly.
According to them, the body is a combination of physical elements, and at a certain stage the life symptoms develop by interaction of the physical and chemical elements. The science of anthropology is based on this philosophy. Currently, many pseudo religions – now becoming fashionable in America – are also adhering to this philosophy, as are the nihilistic nondevotional Buddhist sects.
Even if Arjuna did not believe in the existence of the soul – as in the Vaibhāṣika philosophy – there would still have been no cause for lamentation. No one laments the loss of a certain bulk of chemicals and stops discharging his prescribed duty. On the other hand, in modern science and scientific warfare, so many tons of chemicals are wasted for achieving victory over the enemy.
According to the Vaibhāṣika philosophy, the so-called soul or ātmā vanishes along with the deterioration of the body. So, in any case, whether Arjuna accepted the Vedic conclusion that there is an atomic soul or he did not believe in the existence of the soul, he had no reason to lament.
🌹 🌹 🌹 🌹 🌹
14 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 072: 02వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 072: Chap. 02, Ver. 25
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 72 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 25 🌴
25. అవ్యక్తో యమచిన్త్యో యమవికార్యో య ముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||
🌷. తాత్పర్యం :
ఈ అత్మ కనబడనిది, ఊహింపరానిది, మార్పు రహితము అని చెప్పబడినది. అందుచే ఈ విధముగా దానిని బాగుగా తెలిసికొని, నీవు ఈ శరీరము కొరకు దుఃఖించుటకు తగవు.
🌷. భాష్యము :
ఇదివరకు వివరింపబడిన రీతి ఆత్మ యొక్క పరిమాణము అత్యంత సూక్ష్మమైనట్టిది. శక్తివంతమైన సూక్ష్మదర్శిని చేతను అది దర్శింపబడదు. కనుకనే అది అవ్యక్తమని తెలుపబడినది. ఇక డని అస్తిత్వమునకు సమంధించినంతవరకు శృతి లేదా వేదంజ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవ్వరును ప్రయోగాత్మకముగా నిర్దారింపలేరు.
అనుభవైకవేద్యమైన ఆత్మను తెలియుటకై ఇతర మార్గములు వేరేవియును లేనందున ఈ సత్యమును మనము అంగీకరింపవలసియున్నది. కొన్ని విషయములు మనము కేవలము ఉన్నతమగు ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసివచ్చును.
ఉదాహరణమునకు తల్లి ప్రామాణికతపై ఆధారపడి తండ్రి ఉనికిని గుర్తించుట సాధారణముగా జరుగుచుండును. అచ్చట తండ్రిని గుర్తించుటకు తల్లి ప్రామాణికత ఒక్కటే మార్గము. అదేవిధముగా ఆత్మను అవగతము చేసికొనుటకు కేవలము వేదాధ్యనము తప్ప వేరొక్క మార్గము లేదు. వేరుమాటలలో ఆత్మ యనునది మానవ మావవ ప్రయోగాత్మక జ్ఞానముచే అవగతము కానట్టిది.
ఆత్మ చైతన్య స్వరూపమనియు మరియు చైతన్య సహితమనియు వేదములలో తెలుపబడినది. ఆ విషయమును మనము అంగీకరింపవలెను. దేహమునందు మార్పులు జరుగునట్లుగా ఆత్మ యందు మార్పులు సంభవింపవు. మార్పురహితమైనట్టిదిగా అట్టి ఆత్మ సదా అణురూపమున నిలిచియుండును. పరమాత్ముడు అనంతుడు కాగా, అణురూప ఆత్మ అత్యంత సూక్ష్మమైయున్నది.
కావుననే మార్పురహితమగు సూక్ష్మమైన ఆత్మ ఏనాడును అనంతమైన పరమాత్మతో(భగవానునితో) సమానము కాజాలదు. ఆత్మ యొక్క మార్పురహిత స్థితిని నిర్దారించుటకే ఈ సిద్ధాంతము వేదములందు పలురీతులుగా మరల మరల వివరింపబడినది. దోషరహితముగా ఒక విషయమును గూర్చి మనము అవగతము చేసికొనుటకై మరల మరల వివిరించుట అత్యంత అవరసరము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 72 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 25 🌴
25. avyakto ’yam acintyo ’yam avikāryo
’yam ucyate tasmād evaṁ viditvainaṁ nānuśocitum arhasi
🌻 Translation :
It is said that the soul is invisible, inconceivable and immutable. Knowing this, you should not grieve for the body.
🌻 Purport :
As described previously, the magnitude of the soul is so small for our material calculation that he cannot be seen even by the most powerful microscope; therefore, he is invisible.
As far as the soul’s existence is concerned, no one can establish his existence experimentally beyond the proof of śruti, or Vedic wisdom. We have to accept this truth, because there is no other source of understanding the existence of the soul, although it is a fact by perception. There are many things we have to accept solely on grounds of superior authority.
No one can deny the existence of his father, based upon the authority of his mother. There is no source of understanding the identity of the father except by the authority of the mother. Similarly, there is no source of understanding the soul except by studying the Vedas. In other words, the soul is inconceivable by human experimental knowledge.
The soul is consciousness and conscious – that also is the statement of the Vedas, and we have to accept that. Unlike the bodily changes, there is no change in the soul. As eternally unchangeable, the soul remains atomic in comparison to the infinite Supreme Soul. The Supreme Soul is infinite, and the atomic soul is infinitesimal.
Therefore, the infinitesimal soul, being unchangeable, can never become equal to the infinite soul, or the Supreme Personality of Godhead. This concept is repeated in the Vedas in different ways just to confirm the stability of the conception of the soul. Repetition of something is necessary in order that we understand the matter thoroughly, without error.
🌹🌹🌹🌹🌹
13 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 071: 02వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 071: Chap. 02, Ver. 24
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 71 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 24 🌴
24. అచ్చేధ్య యమదాహ్యో యమక్లేద్యో శోష్య ఏవ చ |
నిత్య: సర్వగత: స్థాణురచలోయం సనాతన: ||
🌷. తాత్పర్యం :
ఆత్మ ఛేదింప బడనటు వంటి మరియు కరుగునటువంటిది. దహింపజేయుటకు గాని, శోషింపజేయుటకు గాని అది వీలుకానటువంటిది. అది నిత్యమును, సర్వత్రా వ్యాపితమును, మార్పురహితమును, అచలమును, సనాతనము అయియున్నది.
🌷. భాష్యము :
ఆత్మ యొక్క ఈ లక్షణములన్నియు దానిని పరమపురుషుని నిత్యమైన అంశగా నిరూపించుచున్నవి. అది ఎటువంటి మార్పు లేకుండా తన అణుస్థితి యందే సదా నిలిచియుండును. ఐక్యము నొందుట యనునది ఆత్మ విషయమున ఊహింపరానిదైనందున మాయావాద సిద్ధాంతము దానికి సరిపోదు.
భౌతికసంపర్కము నుండి ముక్తినొందిన పిమ్మట అది భగవానుని తేజోమయ కిరణములలో ఒక ఆధ్యాత్మిక కణముగా నిలువగోరవచ్చును. కాని బుద్ధిమంతులైన జీవులు మాత్రము భగవానుని సాహచార్యమును పొందుటకై ఆధ్యాత్మికలోకములందు ప్రవేశింతురు.
జీవులు భగవానుని సృష్టియందంతటను నిలిచియున్న విషయము నిస్సందేహము కనుక “సర్వగత” అను పదమునకు ఇచ్చట ప్రాముఖ్యము కలిగినది.
అనగాఅనగా వారు భూమిపైనను, జలమునందు, వాయువునందును, భూమి అడుగుభాగామునను, చివరికి అగ్ని యందును జీవించుచున్నారు. ఆత్మ అగ్నిచే దగ్ధము కాదనెడి విషయము ఇచ్చట స్పష్టముగా తెలుపబడినందున అగ్నిలో వారు దగ్ధమై పోదురనెడి నమ్మకమును నిరాకారింపవచ్చును.
కావున సూర్య మండలమున కూడా జీవులు అట్టి లోకమునకు తగిన దేహములతో జీవించుచున్నరనుటలో ఎట్టి సందేహము లేదు. సూర్యమండలము జీవరహితమైన సర్వగతమనెడి పదము అర్థరహితము కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 71 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 24 🌴
24. acchedyo ’yam adāhyo ’yam akledyo ’śoṣya eva ca
nityaḥ sarva-gataḥ sthāṇur acalo ’yaṁ sanātanaḥ
🌻 Translation :
This individual soul is unbreakable and insoluble, and can be neither burned nor dried. He is everlasting, present everywhere, unchangeable, immovable and eternally the same.
🌻 Purport :
All these qualifications of the atomic soul definitely prove that the individual soul is eternally the atomic particle of the spirit whole, and he remains the same atom eternally, without change.
The theory of monism is very difficult to apply in this case, because the individual soul is never expected to become one homogeneously. After liberation from material contamination, the atomic soul may prefer to remain as a spiritual spark in the effulgent rays of the Supreme Personality of Godhead, but the intelligent souls enter into the spiritual planets to associate with the Personality of Godhead.
The word sarva-gata (“all-pervading”) is significant because there is no doubt that living entities are all over God’s creation. They live on the land, in the water, in the air, within the earth and even within fire.
The belief that they are sterilized in fire is not acceptable, because it is clearly stated here that the soul cannot be burned by fire. Therefore, there is no doubt that there are living entities also in the sun planet with suitable bodies to live there. If the sun globe is uninhabited, then the word sarva-gata – “living everywhere” – becomes meaningless.
🌹🌹🌹🌹🌹
12 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 070: 02వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 070: Chap. 02, Ver. 23
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 70 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 23 🌴
23. నైనం చిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావక: |
న చైనం క్లేక్లేదయన్త్యాపో న శోషయతి మారుత: ||
🌷. తాత్పర్యం :
ఆత్మ ఎత్తి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే శోషింపబడదు.
🌷. భాష్యము :
ఖడ్గములు, ఆగ్నేయాస్త్రములు, వారుణాస్త్రములు, వాయవ్యాస్త్రములు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపజేయలేవు.
ఆధునిక అగ్ని అస్త్రములతో పాటు పృథివి, జలము,వాయువు,ఆకాశములతో తయారు చేయబడిన అస్త్రములు సైతము పలుగాలవని తెలియవచ్చుచున్నది. ఈనాటి అణ్వస్త్రములు ఆగ్నేయాస్త్రములు కోవకు చెందినవి. కాని పూర్వపు అస్త్రములు అన్నిరకములైన భౌతిక ములకములతో చేయబడి యుండెడివి.
ఆగ్నేయాస్త్రములు వారుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతుల నేటి ఆధునిక విజ్ఞానశాస్త్రమునకు తెలియవు. అదే కాకుండా వాయవ్యాస్త్రములు గూర్చి నవీన శాస్త్రజ్ఞులకు ఏమాత్రము జ్ఞానము లేదు. ఏదిఏమైనను ఎన్ని ఆయుధములను ఉపయోగించినను (అవి ఎంతటి వైజ్ఞానికములైననను) ఆత్మ చేదింపబడదు లేదా నశింపబడదు.
ఏ విధముగా ఆత్మ అజ్ఞానముచే ఉనికి లోనికి వచ్చి ఆపై మాయచే కప్పబడుచున్నదో మాయవాదులు వివరింపలేరు. అలాగుననే మూలమైన పరమాత్మా నుండి ఆత్మలను ఖండించుటయు సాధ్యమయిన విషయము కాదు.
వాస్తవమునకు ఆత్మలు పరమాత్ముని నుండి నిత్యముగా విడివడియుండెడి అంశలు. నిత్యముగా(సనాతముగా) విడివడియుండెడి అంశలైనందునే ఆత్మలు మాయచే ఆవరింపబడునవై యున్నవి. అగ్నికణములు అగ్ని గునమునే కలిగియున్నట్లు, భగవానుని సాహచార్యము నుండి ఆ విధముగా ఆత్మలు విడివడిగలవు. జీవులు శ్రీకృష్ణభగవానుని నుండి విడివడియున్న అంశలుగా వరాహపురాణమునందు వర్ణింపబడినది.
భగవద్గీత ప్రకారము కుడా ఈ విషయము సత్యమై యున్నది. కావున మాయ నుండి ముక్తి పొందిన పిదపయు జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే యుండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు ఒసగిన ఉపదేశము ద్వారా విదితమగుచున్నది. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానము వలన అర్జునుడు ముక్తిని పొందెనే గాని శ్రీకృష్ణునితో ఎన్నడును ఏకము కాలేదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 70 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 23 🌴
23. nainaṁ chindanti śastrāṇi nainaṁ dahati pāvakaḥ
na cainaṁ kledayanty āpo na śoṣayati mārutaḥ
🌻 Translation :
The soul can never be cut to pieces by any weapon, nor burned by fire, nor moistened by water, nor withered by the wind.
🌻 Purport :
All kinds of weapons – swords, flame weapons, rain weapons, tornado weapons, etc. – are unable to kill the spirit soul. It appears that there were many kinds of weapons made of earth, water, air, ether, etc., in addition to the modern weapons of fire. Even the nuclear weapons of the modern age are classified as fire weapons, but formerly there were other weapons made of all different types of material elements.
Fire weapons were counteracted by water weapons, which are now unknown to modern science. Nor do modern scientists have knowledge of tornado weapons. Nonetheless, the soul can never be cut into pieces, nor annihilated by any number of weapons, regardless of scientific devices.
The Māyāvādī cannot explain how the individual soul came into existence simply by ignorance and consequently became covered by the illusory energy. Nor was it ever possible to cut the individual souls from the original Supreme Soul; rather, the individual souls are eternally separated parts of the Supreme Soul.
Because they are atomic individual souls eternally (sanātana), they are prone to be covered by the illusory energy, and thus they become separated from the association of the Supreme Lord, just as the sparks of a fire, although one in quality with the fire, are prone to be extinguished when out of the fire. In the Varāha Purāṇa, the living entities are described as separated parts and parcels of the Supreme.
They are eternally so, according to the Bhagavad-gītā also. So, even after being liberated from illusion, the living entity remains a separate identity, as is evident from the teachings of the Lord to Arjuna. Arjuna became liberated by the knowledge received from Kṛṣṇa, but he never became one with Kṛṣṇa.
🌹🌹🌹🌹🌹
11 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 069: 02వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 069: Chap. 02, Ver. 22
🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 69 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 22 🌴
22. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాటి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాస్య అన్యాని సంయాతి నవాని దేహీ ||
🌷. తాత్పర్యం :
మనుజుడు పాతవస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి, ఆత్మ జీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది.
🌷. భాష్యము :
ఆత్మ దేహములను మార్చుననెడి విషయము అంగీకరింపబడిన సత్యము. ఆత్మ ఉనికిని అంగీకరింపని ఆధునిక విజ్ఞానశాస్త్రవేత్తలు ఏ విధముగా హృదయము నుండి శక్తి కలుగునో వివరింపలేకున్నను, దేహమునందు జరిగెడి మార్పులను అంగీకరించియే తీరవలెను.
శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యౌవనము వరకు, యౌవనము నుండి ముసలితనము వరకు కలుగు దేహమునందలి మార్పులను వారు అంగీకరింపవలసియున్నది. ముసలితనము పిమ్మట మార్పు అనునది వేరొక దేహమును కలుగజేయును. ఈ విషయమును ఇదివరకే పూర్వశ్లోకము(2.13) నందు వివరింపబడినది.
ఒక దేహము నుండి వేరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కరుణచే సాధ్యపడుచున్నది. స్నేహితుని కోరికను ఇంకొక స్నేహితుడు తీర్చు రీతి, ఆత్మ యొక్క కోరికను పరమాత్ముడు తీర్చును.
ఆత్మ మరియు పరమాత్మలను ఒకే వృక్షముపై కూర్చొనియున్న రెండు పక్షులతో ముండకోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు పోల్చినవి. ఆ రెండు పక్షులలో ఒకటి(ఆత్మ) వృక్షఫలములను ఆరగించుచుండగా, వేరొక పక్షి (శ్రీకృష్ణుడు) తన మిత్రుని గాంచుచున్నది.
ఈ పక్షులు రెండును గుణరీతిని ఏకమైనను, అందొకటి భౌతికవృక్షపు ఫలములచే ఆకర్షింపబడగా, రెండవది తన మిత్రుని కార్యములను కేవలము సాక్షిగా నిలిచియున్నది. ఇచ్చట శ్రీకృష్ణుడు సాక్షియైన పక్షి కాగా, అర్జునుడు ఫలమారగించు పక్షియై యున్నాడు. వారివురు స్నేహితులే అయినను అందులో ఒకరు గురువు కాగా, రెండవవాడు శిష్యుడై యున్నాడు.
ఈ సంబంధమును మరచుటయే ఆత్మ ఒక వృక్షము నుండి వేరొక వృక్షమునకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమై యున్నది. అనగా దేహమనెడి వృక్షముపై జీవాత్మ తీవ్రప్రయాస నొందుచుండును. కాని అది చెంతనే ఉన్న మిత్రుడైన వేరొక పక్షిని గురువుగా అంగీకరించినంతనే శీఘ్రముగా సర్వశోకముల నుండి ముక్తినొందగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 69 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 22 🌴
22. vāsāṁsi jīrṇāni yathā vihāya navāni gṛhṇāti naro ’parāṇi tathā
śarīrāṇi vihāya jīrṇāny anyāni saṁyāti navāni dehī
🌻 Translation :
As a person puts on new garments, giving up old ones, the soul similarly accepts new material bodies, giving up the old and useless ones.
🌻 Purport :
Change of body by the atomic individual soul is an accepted fact. Even the modern scientists who do not believe in the existence of the soul, but at the same time cannot explain the source of energy from the heart, have to accept continuous changes of body which appear from childhood to boyhood and from boyhood to youth and again from youth to old age. From old age, the change is transferred to another body. This has already been explained in a previous verse (2.13).
Transference of the atomic individual soul to another body is made possible by the grace of the Supersoul. The Supersoul fulfills the desire of the atomic soul as one friend fulfills the desire of another.
The Vedas, like the Muṇḍaka Upaniṣad (3.1.2), as well as the Śvetāśvatara Upaniṣad (4.7), compare the soul and the Supersoul to two friendly birds sitting on the same tree. One of the birds (the individual atomic soul) is eating the fruit of the tree, and the other bird (Kṛṣṇa) is simply watching His friend.
Of these two birds – although they are the same in quality – one is captivated by the fruits of the material tree, while the other is simply witnessing the activities of His friend. Kṛṣṇa is the witnessing bird, and Arjuna is the eating bird. Although they are friends, one is still the master and the other is the servant. Forgetfulness of this relationship by the atomic soul is the cause of one’s changing his position from one tree to another, or from one body to another.
The jīva soul is struggling very hard on the tree of the material body, but as soon as he agrees to accept the other bird as the supreme spiritual master the subordinate bird immediately becomes free from all lamentations.
🌹 🌹 🌹 🌹 🌹
10 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 068: 02వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 068: Chap. 02, Ver. 21
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 21 🌴
21. వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పరుష: పార్థ కం ఘాతయతి హన్తి కం ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థా! ఆత్మ నాశము లేనిదనియు, నిత్యమైనదనియు, పుట్టుకలేనిదనియు, అవ్యయమైనదనియు తెలిసినవాడు ఎవ్వరినేని ఎట్లు చంపును? లేదా చంపించును?
🌷. భాష్యము :
వాస్తవమునకు ప్రతిదానికి ఒక ప్రయోజనముండును. పూర్ణజ్ఞానవంతుడైనవాడు ఎచ్చట మరియు ఏవిధముగా ఒకదానిని సరియైన ప్రయోజనము కొరకై వినియోగించవలేనో తెలిసియుండును. అలాగుననే హింసకు సైతము ఒక ప్రయోజనమున్నది. కాని దానిని ఎట్లు వినియోగించవలెనన్న విషయమును జ్ఞానవంతుడు ఎరిగియుండును.
హంతకునికి ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాడు. ఏలయన అతడు ఉరిశిక్ష యను హింసను న్యాయసూత్రముల ననుసరించియే అమలుపరచును. హత్య గావించినవానికి మరణదండన విధింపబడవలెననియు, తద్ రీతినే చేసిన ఘోరపాపమునకు అతడు మరుసటి జన్మలో దుఃఖభాగుడు కావలసిన అవసరము కలుగగలదని మానవధర్మ శాస్త్రమైన మనుసంహిత తెలియజేయుచున్నది.
అనగా హంతకుని రాజు ద్వారా విధింపబడెడి ఉరిశిక్ష లాభదాయకమైనదే. అలాగుననే శ్రీకృష్ణుడు యుద్ధమునకై ఆదేశింపగా అట్టి హింస పరమధర్మము కొరకేని నిర్దారింపవలసియున్నది. శ్రీకృష్ణుని కొరకై చేయబడు యుద్ధమున సంభవించు హింస యనునది హింస ఏమాత్రము కానేరదని ఎరిగి అర్జునుడు అట్టి ఆదేశమును అనుసరింపవలెను. ఏలయన ఆత్మ యనునది వధింపబడునది కాదు.
కనుక న్యాయమును నెలకొల్పుటకై అట్టి నామమాత్ర హింస ఆమోదనీయమే. శస్త్రచికిత్స రోగిని బాగు చేయుటకే గాని చంపుటకు కాదు. కావున శ్రీకృష్ణుని ఉపదేశమున అర్జునుడు ఒనరింపబోవు యుద్ధము జ్ఞానపూర్ణమై యున్నది. దాని యందు పాపమునకు ఏమాత్రము అవకాశము లేదు
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 68 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 21 🌴
21. vedāvināśinaṁ nityaṁ ya enam ajam avyayam kathaṁ sa puruṣaḥ pārtha kaṁ ghātayati hanti kam
🌻 Translation :
O Pārtha, how can a person who knows that the soul is indestructible, eternal, unborn and immutable kill anyone or cause anyone to kill?
🌻 Purport :
Everything has its proper utility, and a man who is situated in complete knowledge knows how and where to apply a thing for its proper utility. Similarly, violence also has its utility, and how to apply violence rests with the person in knowledge.
Although the justice of the peace awards capital punishment to a person condemned for murder, the justice of the peace cannot be blamed, because he orders violence to another person according to the codes of justice. In Manu-saṁhitā, the lawbook for mankind, it is supported that a murderer should be condemned to death so that in his next life he will not have to suffer for the great sin he has committed.
Therefore, the king’s punishment of hanging a murderer is actually beneficial. Similarly, when Kṛṣṇa orders fighting, it must be concluded that violence is for supreme justice, and thus Arjuna should follow the instruction, knowing well that such violence, committed in the act of fighting for Kṛṣṇa, is not violence at all because, at any rate, the man, or rather the soul, cannot be killed; so for the administration of justice, so-called violence is permitted.
A surgical operation is not meant to kill the patient, but to cure him. Therefore the fighting to be executed by Arjuna at the instruction of Kṛṣṇa is with full knowledge, so there is no possibility of sinful reaction.
🌹🌹🌹🌹🌹
9 Jul 2019
శ్రీమద్భగవద్గీత - 067: 02వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 067: Chap. 02, Ver. 20
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 20 🌴
20. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయ: |
అజో నిత్య: శాశ్వతో(యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ||
🌷. తాత్పర్యం :
ఆత్మకు ఎన్నడును జన్మగాని, మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింప బోదు. జన్మ రహితమును, నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు.
🌻. భాష్యము :
భగవానుని అణుపరిమాణ అంశయైన ఆత్మ భగానునితో గుణరీతిని సమానమైనది. దేహము వలె అది మార్పునొందదు. కనుకనే అది కొన్నిమార్లు స్థిరము లేదా కూటస్థమని పిలువబడును. తల్లి గర్భము నుండి జన్మించుట, స్థితిని కలిగియుండుట, పెరుగుట, ఇతరములను సృష్టించుట, క్రమముగా క్షీణించుట, చివరికి నశించుట అనెడి ఆరువిధములైన మార్పులు దేహమునందు కలుగుచుండును.
కాని ఆత్మ ఎన్నడును అటువంటి మార్పుల నొందదు. అనగా జన్మను లేదు. కాని అది దేహమును స్వీకరించుట వలన దేహము జన్మము నొందుచున్నది. అనగా అట ఆత్మ జన్మము నొందుట లేదు. అలాగుననే అది మరణమునకు సైతము గురుకాదు. జన్మించిన ప్రతి దానికి మరణము తప్పదు. కాని ఆత్మకు జన్మము లేనందున భూత, భవిష్యత్, వర్తమానములనునవి దాని లేవు.
నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అగు ఆత్మ యెన్నడు ఆవిర్భవించెనో ఎట్టి చారిత్రిక ఆధారము లేదు. దేహభావన కారణముగా మనము ఆత్మ యొక్క జన్మాది విషయములను గూర్చి ప్రశ్నింపవచ్చను. కాని నిత్యమైన ఆత్మ ఎన్నడును దేహము వలె ముసలితనము నొందదు. కనుకనే ముదుసలి కుడా కుడా తన బాల్యము లేదా యౌవనములో కలిగియున్న ఉత్సాహమునే కలిగియుండును. దేహమునందు కలిగెడి మార్పులు ఆత్మపై ప్రభావము చూపవు. వృక్షముగాని లేదా మరియే ఇతర భౌతికవిషయముల వలె గాని ఆత్మ క్షీణింపదు. ఇతరములను కుడా సృష్టింపదు.
దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్నములైన జీవత్మలు. కాని దేహము కలిగియున్న కారణముగా వారు ఒక వ్యకికి సంతానముగా గోచరించుచున్నారు. అనగా ఆత్మ యొక్క ఉనికి కారణముననే దేహము వృద్ధినొందుచున్నది. అయినను ఆత్మ యందు మాత్రము మార్పులు లేదా ఇతర సృష్టులు కలుగవు. కనుకనే దేహమునందు కలిగెడి ఆరుమార్పులకు ఆత్మ అతీతమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 67 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 20 🌴
20. na jāyate mriyate vā kadācin nāyaṁ bhūtvā bhavitā vā na bhūyaḥ
ajo nityaḥ śāśvato ’yaṁ purāṇo na hanyate hanyamāne śarīre
🌻 Translation :
For the soul there is neither birth nor death at any time. He has not come into being, does not come into being, and will not come into being. He is unborn, eternal, ever-existing and primeval. He is not slain when the body is slain.
🌻 Purport :
Qualitatively, the small atomic fragmental part of the Supreme Spirit is one with the Supreme. He undergoes no changes like the body. Sometimes the soul is called the steady, or kūṭa-stha.
The body is subject to six kinds of transformations. It takes its birth from the womb of the mother’s body, remains for some time, grows, produces some effects, gradually dwindles, and at last vanishes into oblivion. The soul, however, does not go through such changes. The soul is not born, but, because he takes on a material body, the body takes its birth. The soul does not take birth there, and the soul does not die. Anything which has birth also has death. And because the soul has no birth, he therefore has no past, present or future.
He is eternal, ever-existing and primeval – that is, there is no trace in history of his coming into being. Under the impression of the body, we seek the history of birth, etc., of the soul. The soul does not at any time become old, as the body does. The so-called old man, therefore, feels himself to be in the same spirit as in his childhood or youth. The changes of the body do not affect the soul.
The soul does not deteriorate like a tree, nor anything material. The soul has no by-product either. The by-products of the body, namely children, are also different individual souls; and, owing to the body, they appear as children of a particular man. The body develops because of the soul’s presence, but the soul has neither offshoots nor change. Therefore, the soul is free from the six changes of the body.
🌹 🌹 🌹 🌹 🌹
8 Jul 2019
Subscribe to:
Posts (Atom)