శ్రీమద్భగవద్గీత - 622: 18వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 622: Chap. 18, Ver. 39
🌹. శ్రీమద్భగవద్గీత - 622 / Bhagavad-Gita - 622 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 39 🌴
39. యదగ్రే చానుబన్దే చ సుఖం మోహనమాత్మన : |
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ||
🌷. తాత్పర్యం :
ఆత్మానుభవదృష్టి లేనిదియు, ఆది నుండి అంత్యము వరకు మోహ కారణమైనదియు, నిద్ర, సోమరితనము, భ్రాంతుల నుండి ఉద్భవించినదియు నైన సుఖము తమోగుణప్రధానమైనదని చెప్పబడును.
🌷. భాష్యము :
సోమరితనము మరియు నిద్ర యందు ఆనందము పొందువాడు నిక్కము తమోగుణమునందు స్థితుడైనట్టివాడే. అలాగుననే ఏ విధముగా వర్తించవలెనో, ఏ విధముగా వర్తించరాదో ఎరుగజాలనివాడు కూడా తమోగుణసహితుడే. అట్టివానికి ప్రతిదియు భ్రాంతియే.
ఆద్యంతములందును వానికి సుఖము లభింపదు. రజోగుణస్వభావునకు ఆదిలో బుద్భుదప్రాయమైన సుఖము మరియు అంత్యమున దుఃఖము లభించును, తమోగుణునికి మాత్రము ఆద్యంతములు రెండింటి యందును దుఖమే ప్రాప్తించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 622 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 39 🌴
39. yad agre cānubandhe ca
sukhaṁ mohanam ātmanaḥ
nidrālasya-pramādotthaṁ
tat tāmasam udāhṛtam
🌷 Translation :
And that happiness which is blind to self-realization, which is delusion from beginning to end and which arises from sleep, laziness and illusion is said to be of the nature of ignorance.
🌹 Purport :
One who takes pleasure in laziness and in sleep is certainly in the mode of darkness, ignorance, and one who has no idea how to act and how not to act is also in the mode of ignorance. For the person in the mode of ignorance, everything is illusion.
There is no happiness either in the beginning or at the end. For the person in the mode of passion there might be some kind of ephemeral happiness in the beginning and at the end distress, but for the person in the mode of ignorance there is only distress both in the beginning and at the end.
🌹 🌹 🌹 🌹 🌹
28 Jan 2021