శ్రీమద్భగవద్గీత - 618: 18వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 618: Chap. 18, Ver. 35


🌹. శ్రీమద్భగవద్గీత - 618 / Bhagavad-Gita - 618 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 35 🌴

35. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |
న విముఞ్చతి దుర్మేధా ధృతి: సా పార్థ తామసీ ||


🌷. తాత్పర్యం :

ఓ పార్థా! ఒక స్వప్నము, భయము, శోకము, విషాదము, భ్రాంతి యనువానిని దాటలేనటువంటి మందబుద్ధితో కూడిన నిశ్చయము తమోగుణమునకు సంబంధించినట్టిది.


🌷. భాష్యము :

సత్త్వగుణప్రదానుడైనవాడు స్వప్నమును పొందడని భావింపరాదు. ఇచ్చట స్వప్నమనగా అధికనిద్ర యని అర్థము. స్వప్నము సహజమై యున్నందున సత్త్వరజస్తమో గుణములన్నింటి యందును కలుగుచుండును.

కాని అధికనిద్రను నివారింపజాలనివారు, విషయభోగములను అనుభవించుచున్నామనెడి గర్వమును వీడలేనివారు, భౌతికప్రకృతిపై ఆధిపత్యమనెడి స్వప్నమును కలిగియుండువారు, ఇంద్రియమనోప్రాణములను తద్రీతిగనే నియుక్తము చేయువారు తమోగుణప్రదానమైన నిశ్చయము (ధృతి) కలిగినవారుగా పరిగణింపబడుదురు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 618 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 35 🌴

35. yayā svapnaṁ bhayaṁ śokaṁ
viṣādaṁ madam eva ca
na vimuñcati durmedhā
dhṛtiḥ sā pārtha tāmasī


🌷 Translation :

And that determination which cannot go beyond dreaming, fearfulness, lamentation, moroseness and illusion – such unintelligent determination, O son of Pṛthā, is in the mode of darkness.


🌹 Purport :

It should not be concluded that a person in the mode of goodness does not dream. Here “dream” means too much sleep. Dreaming is always present; either in the mode of goodness, passion or ignorance, dreaming is a natural occurrence.

But those who cannot avoid oversleeping, who cannot avoid the pride of enjoying material objects, who are always dreaming of lording it over the material world, and whose life, mind and senses are thus engaged, are considered to have determination in the mode of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹


24 Jan 2021