శ్రీమద్భగవద్గీత - 619: 18వ అధ్., శ్లో 36 / Bhagavad-Gita - 619: Chap. 18, Ver. 36
🌹. శ్రీమద్భగవద్గీత - 619 / Bhagavad-Gita - 619 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 36 🌴
36. సుఖం త్విదానీం త్రివిధం శ్రుణు మే భరతర్షభ |
అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
భరతవంశీయులలో శ్రేష్టుడా! ఇక సుఖము నందలి మూడురకములను గూర్చి నా నుండి ఆలకింపుము. వాని ద్వారా బద్ధజీవుడు సుఖము ననుభవించుట, మరికొన్నిమార్లు సర్వదుఃఖముల అంతమును చేరుట జరుగుచుండును.
🌷. భాష్యము :
బద్ధజీవుడు భౌతికసుఖమును పదే పదే అనుభవింప యత్నించుచుండును. ఆ విధముగా అతడు రసరహిత పిప్పినే మరల మరల ఆస్వాదించుచుండును. కాని కొన్నిమార్లు అతడు మహాత్ముల సాంగత్యఫలముచే అట్టి భౌతిక భోగానుభావమనెడు బంధనము నుండి ముక్తుడగుచుండును.
అనగా ఏదియోనొక ఇంద్రియ భోగము నందు సదా నియుక్తుడై యుండెడి బద్ధజీవుడు తాను కేవలము చేసిన దానినే తిరిగి తిరిగి చేయుచున్నానని సత్సాంగత్యము ద్వారా అవగతము చేసికొనినపుడు నిజమగు కృష్ణభక్తి రసభావన అతని యందు జాగృతము కాగలదు. ఈ విధముగా అతడు కొన్నిమార్లు చర్వితచరణము వంటి నామమాత్ర సుఖము నుండి విముక్తుడగు చుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 619 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 36 🌴
36. sukhaṁ tv idānīṁ tri-vidhaṁ
śṛṇu me bharatarṣabha
abhyāsād ramate yatra
duḥkhāntaṁ ca nigacchati
🌷 Translation :
O best of the Bhāratas, now please hear from Me about the three kinds of happiness by which the conditioned soul enjoys, and by which he sometimes comes to the end of all distress.
🌹 Purport :
A conditioned soul tries to enjoy material happiness again and again. Thus he chews the chewed. But sometimes, in the course of such enjoyment, he becomes relieved from material entanglement by association with a great soul.
In other words, a conditioned soul is always engaged in some type of sense gratification, but when he understands by good association that it is only a repetition of the same thing, and he is awakened to his real Kṛṣṇa consciousness, he is sometimes relieved from such repetitive so-called happiness.
🌹 🌹 🌹 🌹 🌹
25 Jan 2021