శ్రీమద్భగవద్గీత - 598: 18వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 598: Chap. 18, Ver. 15


🌹. శ్రీమద్భగవద్గీత - 598 / Bhagavad-Gita - 598 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 15 🌴

15. శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నర: |
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవ: ||


🌷. తాత్పర్యం :

దేహముచే గాని, మనస్సుచే గాని, వాక్కుచే గాని మనుజుడు ఒనరించు న్యాయాన్యాయ కర్మలన్నింటిని ఈ ఐదు అంశములే కారణములు.


🌷. భాష్యము :

“న్యాయం” మరియు “విపరీతం” అనెడి పదములు ఈ శ్లోకమున అతి ప్రధానమైనవి. శాస్త్ర నిర్దేశముల ననుసరించి ఒనర్చబడెడి కర్మలు న్యాయకర్మలుగా తెలియబడగా, శాస్త్రనియమములకు విరుద్ధముగా ఒనర్చబడు కర్మలు విపరీతకర్మలుగా తెలియబడుచున్నవి. కాని ఏది ఒనరించినను అద్దాని పూర్ణ నిర్వహణ కొరకు ఈ ఐదు అంశములు అత్యంత అవసరములై యున్నవి.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 598 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 15 🌴

15. śarīra-vāṅ-manobhir yat karma prārabhate naraḥ
nyāyyaṁ vā viparītaṁ vā pañcaite tasya hetavaḥ


🌷 Translation :

Whatever right or wrong action a man performs by body, mind or speech is caused by these five factors.


🌹 Purport :

The words “right” and “wrong” are very significant in this verse. Right work is work done in terms of the prescribed directions in the scriptures, and wrong work is work done against the principles of the scriptural injunctions. But whatever is done requires these five factors for its complete performance.

🌹 🌹 🌹 🌹 🌹

03 Jan 2021