శ్రీమద్భగవద్గీత - 613: 18వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 613: Chap. 18, Ver. 30


🌹. శ్రీమద్భగవద్గీత - 613 / Bhagavad-Gita - 613 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 30 🌴

30. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |
బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధి: సా పార్థ సాత్త్వికీ ||


🌷. తాత్పర్యం :

ఓ పార్థా! ఏ బుద్ధి ద్వారా మనుజుడు ఏది చేయదగినదో ఏది చేయరానిదో, దేనికి భయపడవలెనో దేనికి భయము నొందరాదో, ఏది బంధకరమో ఏది ముక్తిదాయకమో తెలిసికొనగలుగునో అట్టి బుద్ధి సత్త్వగుణప్రధానమైనది.


🌷. భాష్యము :

శాస్త్రనిర్దేశముల దృష్ట్యా కార్యముల నొనరించుట “ప్రవృత్తి” యనబడును. అదియే చేయదగిన కర్మముల నొనరించుట యగును. నిర్దేశములు కానటువంటి కర్మల నెన్నడును ఒనరింపరాదు. శాస్త్రనిర్దేశములను ఎరుగనివాడు కర్మల యందు మరియు కర్మఫలముల యందు బంధితుడగుచున్నాడు. అట్టి విచక్షణా జ్ఞానమును కలిగించు బుద్ధియే సత్త్వగుణప్రధానమైనదని చెప్పబడును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 613 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 30 🌴

30. pravṛttiṁ ca nivṛttiṁ ca kāryākārye bhayābhaye
bandhaṁ mokṣaṁ ca yā vetti buddhiḥ sā pārtha sāttvikī


🌷 Translation :

O son of Pṛthā, that understanding by which one knows what ought to be done and what ought not to be done, what is to be feared and what is not to be feared, what is binding and what is liberating, is in the mode of goodness.


🌹 Purport :

Performing actions in terms of the directions of the scriptures is called pravṛtti, or executing actions that deserve to be performed. And actions which are not so directed are not to be performed.

One who does not know the scriptural directions becomes entangled in the actions and reactions of work. Understanding which discriminates by intelligence is situated in the mode of goodness.

🌹 🌹 🌹 🌹 🌹


18 Jan 2021