✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 27 🌴
27. రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోశుచి: |
హర్షశోకాన్విత: కర్తా రాజస: పరికీర్తిత: ||
🌷. తాత్పర్యం :
కర్మఫలములను అనుభవింపగోరుచు కర్మ మరియు కర్మఫలముల యెడ ఆసక్తుడై యుండువాడును, లోభియును, అసూయపరుడును, శుచిరహితుడును, సుఖదుఃఖములచే చలించువాడును అగు కర్త రజోగుణకర్త యనబడును.
🌷. భాష్యము :
భౌతికత్వము లేదా గృహపుత్రకళత్రాదుల యందు గల విపరీత ఆసక్తికారణముగా మనుజుద్ ఏదేని ఒక కర్మ లేదా కర్మఫలముల యెడ మిక్కిలి ఆసక్తుడగును. అట్టివాడు జీవితోద్దారమునకు సంబంధించిన కోరికను ఏ మాత్రము కలిగియుండడు. ఈ జగమున వీలయినంత సంబంధించిన కోరికను ఏ మాత్రము కలిగియుండడు.
ఈ జగమును వీలయినంత భౌతికముగా సుఖవంత మొనర్చుకొనుటయే అతని లక్ష్యము. సాధారణముగా లోభియై యుండు అతడు తనకు లభించినది శాశ్వతమనియు, ఎన్నడును నశింపదనియు భావించును. ఇతరుల యెడ అసూయను కలిగియుండు అట్టివాడు తన ప్రీత్యర్థమై ఎట్టి తప్పుకార్యము చేయుటకైనను సిద్ధపడియుండును.
తత్కారణముగా అతడు అశుచియై, తాను సంపాదించునది పవిత్రమా లేక అపవిత్రమా అనెడి విషయమును సైతము లెక్కచేయకుండును. తన పని విజయవంతమైనచో అత్యంత ఆనందమును పొందు నాతడు కర్మ విఫలమైనపుడు మిగుల చింతాక్రాంతుడగును. రజోగుణకర్త ఆ రీతిగనే ఉండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 610 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 27 🌴
27. rāgī karma-phala-prepsur lubdho hiṁsātmako ’śuciḥ
harṣa-śokānvitaḥ kartā rājasaḥ parikīrtitaḥ
🌷 Translation :
The worker who is attached to work and the fruits of work, desiring to enjoy those fruits, and who is greedy, always envious, impure, and moved by joy and sorrow, is said to be in the mode of passion.
🌹 Purport :
A person is too much attached to a certain kind of work or to the result because he has too much attachment for materialism or hearth and home, wife and children. Such a person has no desire for higher elevation in life.
He is simply concerned with making this world as materially comfortable as possible. He is generally very greedy, and he thinks that anything attained by him is permanent and never to be lost.
Such a person is envious of others and prepared to do anything wrong for sense gratification. Therefore such a person is unclean, and he does not care whether his earning is pure or impure. He is very happy if his work is successful and very much distressed when his work is not successful. Such is the worker in the mode of passion.
🌹 🌹 🌹 🌹 🌹
15 Jan 2021