శ్రీమద్భగవద్గీత - 608: 18వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 608: Chap. 18, Ver. 25


🌹. శ్రీమద్భగవద్గీత - 608 / Bhagavad-Gita - 608 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 25 🌴

25. అనుబన్ధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్య తే ||


🌷. తాత్పర్యం :

శాస్త్రనిర్దేశములను నిరసించి భవిష్యత్బంధమును గాని, పరహింసను, పరదుఃఖమును గాని లెక్కపెట్టక భ్రాంతియందు ఒనర్చబడు కర్మలు తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును.


🌷. భాష్యము :

మనుజుడు తాను చేయు కర్మలకు ప్రభుత్వమునకు గాని, యమదూతలకు గాని జవాబుదారి కావలసివచ్చును. బాధ్యతారహితముగా ఒనర్చబడు కర్మ సర్వదా విధ్వంసకరమే కాగలదు. ఏలయన అట్టి కర్మ శాస్త్రనిర్దేశములైన ధర్మనియమములను సమూలముగా నశింపజేయును.

అటువంటి బాధ్యతారహిత కర్మలు సదా హింస పైననే ఆధారపడియుండి పరులకు దుఃఖమునే కలిగించును. స్వానుభవముపై ఆధారపడి ఒనర్చబడు అట్టి బాధ్యతారహిత కర్మలు నిక్కము భ్రాంతిమయములే. అట్టి భ్రాంతిమయ కర్మ తమోగుణఫలమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 608 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 25 🌴

25. anubandhaṁ kṣayaṁ hiṁsām anapekṣya ca pauruṣam
mohād ārabhyate karma yat tat tāmasam ucyate


🌷 Translation :

That action performed in illusion, in disregard of scriptural injunctions, and without concern for future bondage or for violence or distress caused to others is said to be in the mode of ignorance.


🌹 Purport :

One has to give account of one’s actions to the state or to the agents of the Supreme Lord called the Yamadūtas. Irresponsible work is destructive because it destroys the regulative principles of scriptural injunction.

It is often based on violence and is distressing to other living entities. Such irresponsible work is carried out in the light of one’s personal experience. This is called illusion. And all such illusory work is a product of the mode of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2021