శ్రీమద్భగవద్గీత - 605: 18వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 605: Chap. 18, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 605 / Bhagavad-Gita - 605 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 22 🌴

22. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ |
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ||


🌷. తాత్పర్యం :

ఏఏ జ్ఞానము ద్వారా మనుజుడు అల్పమైనట్టి ఒకానొక కార్యము నందు కారణము మరియు సత్యావగాహనము లేకుండ అదియే సర్వస్వమనెడి భావనలో ఆసక్తుడగునో అట్టి జ్ఞానము తమోగుణ సంబంధమైనదని చెప్పబడును.


🌷. భాష్యము :

సామాన్యమానవుని “జ్ఞానము” సదా తమోగుణభరితమై యుండును. ప్రతిజీవుడు బద్ధజీవనమున తమోగుణమునందు జన్మించుటయే అందులకు కారణము. మానవుడు జ్ఞానమును ప్రామాణికుల ద్వారా గాని, శాస్త్రముల ద్వారా గాని వృద్దిచేసికొనినచో అతని జ్ఞానము దేహము వరకే పరిమితమై యుండును.

అట్టి స్థితిలో అతడు శాస్త్రనిర్దేశానుసారము వర్తించవలననెడి భావనను ఏ మాత్రము కలిగియుండడు. అటువంటి వారికి ధనమే భగవంతుడు మరియు దేహావసరములను తీర్చుకొనుటయే జ్ఞానము. అట్టి జ్ఞానమునకు మరియు పరతత్త్వజ్ఞానమునకు ఎట్టి సంబంధము లేదు. అది దాదాపు ఆహారము, నిద్ర, భయము, మైథునములతో కూడిన పశుజ్ఞానముతో సమానమైనట్టిది. ఈ శ్లోకమున అటువంటి జ్ఞానము తమోగుణఫలమని వర్ణింపబడినది.

అనగా దేహమునకు పరమైన ఆత్మజ్ఞానము సత్త్వగుణపూర్ణమైనది. తర్కము మరియు మానసికకల్పనల ద్వారా పలుసిద్ధాంతములను కల్పించు జ్ఞానము రజోగుణపూర్ణమైనది. దేహమును ఏ విధముగా సుఖింపజేయవలెనను భావననే కలిగిన జ్ఞానము తమోగుణపూర్ణమైనది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 605 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 22 🌴

22. yat tu kṛtsna-vad ekasmin kārye saktam ahaitukam
atattvārtha-vad alpaṁ ca tat tāmasam udāhṛtam


🌷 Translation :

And that knowledge by which one is attached to one kind of work as the all in all, without knowledge of the truth, and which is very meager, is said to be in the mode of darkness.


🌹 Purport :

The “knowledge” of the common man is always in the mode of darkness or ignorance because every living entity in conditional life is born into the mode of ignorance. One who does not develop knowledge through the authorities or scriptural injunctions has knowledge that is limited to the body. He is not concerned about acting in terms of the directions of scripture.

For him God is money, and knowledge means the satisfaction of bodily demands. Such knowledge has no connection with the Absolute Truth. It is more or less like the knowledge of the ordinary animals: the knowledge of eating, sleeping, defending and mating. Such knowledge is described here as the product of the mode of darkness.

In other words, knowledge concerning the spirit soul beyond this body is called knowledge in the mode of goodness, knowledge producing many theories and doctrines by dint of mundane logic and mental speculation is the product of the mode of passion, and knowledge concerned only with keeping the body comfortable is said to be in the mode of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹


10 Jan 2021