శ్రీమద్భగవద్గీత - 599: 18వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 599: Chap. 18, Ver. 16
🌹. శ్రీమద్భగవద్గీత - 599 / Bhagavad-Gita - 599 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 16 🌴
16. తత్త్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు య: |
పశ్యత్యకృతబుద్ధిత్యాన్న స పశ్యతి దుర్మతి: ||
🌷. తాత్పర్యం :
కనుక ఈ ఐదు అంశములను గుర్తించక తననే కర్తగా భావించువాడు నిక్కముగా బుద్ధిహీనుడు. అట్టి మూఢుడు విషయములను యథార్థదృష్టితో గాంచలేడు.
🌷. భాష్యము :
పరమాత్ముడు హృదయమునందు మిత్రుని రూపమున నిలిచియుండి తనచే కార్యములు ఒనరింపజేయుచున్నాడని మూఢుడైనవాడు తెలిసికొనజాలడు. కార్యస్థానమైన దేహము, కర్త, ఇంద్రియములు, ప్రయత్నము అనునవి కార్యము యొక్క భౌతికకారణములు కాగా, పరమాత్ముడు చరమకారణమై యున్నాడు.
కనుక ప్రతియొక్కరు ఈ నాలుగు భౌతికకారణములనే గాక పరమకారణము సైతము గాంచవలసియున్నది. పరమాత్ముని గాంచనివాడే తనను తాను కర్తగా భావించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 599 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 16 🌴
16. tatraivaṁ sati kartāram ātmānaṁ kevalaṁ tu yaḥ
paśyaty akṛta-buddhitvān na sa paśyati durmatiḥ
🌷 Translation :
Therefore one who thinks himself the only doer, not considering the five factors, is certainly not very intelligent and cannot see things as they are.
🌹 Purport :
A foolish person cannot understand that the Supersoul is sitting as a friend within and conducting his actions. Although the material causes are the place, the worker, the endeavor and the senses, the final cause is the Supreme, the Personality of Godhead.
Therefore, one should see not only the four material causes but the supreme efficient cause as well. One who does not see the Supreme thinks himself to be the doer.
🌹 🌹 🌹 🌹 🌹
04 Jan 2021