✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 21 🌴
21. పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్ ||
🌷. తాత్పర్యం :
ఏ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులున్నట్లు మనుజుడు గాంచునో అట్టి జ్ఞానము రజోగుణ సంబంధమైనదని నీవెరుగుము.
🌷. భాష్యము :
దేహమే జీవుడనియు, దేహము నశించగనే చైతన్యము సైతము నశించిపోవుననియు తలచు జ్ఞానము రజోగుణ సంబంధమైనట్టిది. అట్టి జ్ఞానము ప్రకారము వివిధ చైతన్యముల వృద్ది కారణముననే పలువిధములైన దేహములు గోచరించుచున్నవి.
అంతియే గాని చైతన్యమును కలిగించు ఆత్మ వేరొక్కటి లేదు. అనగా అట్టి రజోగుణజ్ఞానము ననుసరించి దేహమే ఆత్మగాని,దేహమునకు పరముగా వేరొక్క ఆత్మ లేదు. అట్టి జ్ఞానము ప్రకారము చైతన్యము తాత్కాలికమైనది.
జీవాత్మలు వేరుగాలేక జ్ఞానపూర్ణమైన ఒక్క ఆత్మనే సర్వత్రా వ్యాపించియున్నదనియు మరియు ఈ దేహము తాత్కాలిక అజ్ఞానము యొక్క ప్రదర్శనమనియు తలచుట లేదా దేహమునకు పరముగా వేరొక్క ఆత్మ గాని, దివ్యాత్మగాని లేదని భావించుట మొదలగునవన్నియు రజోగుణఫలములుగా భావింపబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 604 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 21 🌴
21. pṛthaktvena tu yaj jñānaṁ nānā-bhāvān pṛthag-vidhān
vetti sarveṣu bhūteṣu taj jñānaṁ viddhi rājasam
🌷 Translation :
That knowledge by which one sees that in every different body there is a different type of living entity you should understand to be in the mode of passion.
🌹 Purport :
The concept that the material body is the living entity and that with the destruction of the body the consciousness is also destroyed is called knowledge in the mode of passion.
According to that knowledge, bodies differ from one another because of the development of different types of consciousness, otherwise there is no separate soul which manifests consciousness. The body is itself the soul, and there is no separate soul beyond the body.
According to such knowledge, consciousness is temporary. Or else there are no individual souls, but there is an all-pervading soul, which is full of knowledge, and this body is a manifestation of temporary ignorance. Or beyond this body there is no special individual or supreme soul. All such conceptions are considered products of the mode of passion.
🌹 🌹 🌹 🌹 🌹
09 Jan 2021