శ్రీమద్భగవద్గీత - 596: 18వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 596: Chap. 18, Ver. 13


🌹. శ్రీమద్భగవద్గీత - 596 / Bhagavad-Gita - 596 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 13 🌴

13. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే |
సాంఖ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ||


🌷. తాత్పర్యం :

ఓ మహాబాహుడవైన అర్జునా! వేదాంతము ననుసరించి కర్మలు సిద్ధించుటకు ఐదు కారణములు గలవు. వాని నిపుడు నా నుండి ఆలకింపుము.


🌷. భాష్యము :

ప్రతికర్మకు కూడా ఫలము నిశ్చయమైనప్పుడు కృష్ణభక్తిరసభావితుడు తను చేయు కర్మల ఫలితములచే సుఖదుఃఖములను అనుభవింపడనుట ఎట్లు సంభవమనెడి ప్రశ్న ఉదయించును.

కాని అది ఎట్లు సాధ్యమో తెలియజేయుటకు శ్రీకృష్ణభగవానుడు వేదాంత తత్త్వమును ఉదహరించుచున్నాడు. ప్రతికార్యమునకు ఐదు కారణములు గలవనియు మరియు కార్యముల సిద్ధికి ఈ ఐదు కారణములను గమనింపవలెననియు శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు.

సాంఖ్యమనగా జ్ఞానకాండమని భావము. అలాగుననే వేదాంతము ప్రసిద్ధులైన ఆచార్యులచే ఆమోదింపబడిన జ్ఞానము యొక్క చరమస్వరూపము. శ్రీశంకరాచార్యులు కూడా ఆ వేదాంతసూత్రములను యథాతథముగా స్వీకరించిరి. కనుక ప్రామాణమును సర్వదా గ్రహించవలెను.

చరమనిగ్రహము పరమాత్ముని యందే కలదు. ఇదే విషయము “సర్వస్య చాహం హృది సన్నివిష్ట:” అని ఇంతకు పూర్వమే భగవద్గీత యందు తెలుపబడినది. అనగా పరమాత్ముడు ప్రతియొక్కరిని వారి పూర్వకర్మలను గుర్తు చేయుచు వివిధకర్మల యందు నియుక్తుని చేయుచున్నాడు. అంతరము నుండి కలుగు అతని నిర్దేశమునందు ఒనర్చబడు కృష్ణభక్తిభావనాకర్మలు ఈ జన్మయందు కాని, మరుజన్మ యందు కాని ఎటువంటి ప్రతిచర్యను కలుగజేయవు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 596 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 13 🌴

13. pañcaitāni mahā-bāho kāraṇāni nibodha me
sāṅkhye kṛtānte proktāni siddhaye sarva-karmaṇām


🌷 Translation :

O mighty-armed Arjuna, according to the Vedānta there are five causes for the accomplishment of all action. Now learn of these from Me.


🌹 Purport :

A question may be raised that since any activity performed must have some reaction, how is it that the person in Kṛṣṇa consciousness does not suffer or enjoy the reactions of work? The Lord is citing Vedānta philosophy to show how this is possible.

He says that there are five causes for all activities, and for success in all activity one should consider these five causes. Sāṅkhya means the stock of knowledge, and Vedānta is the final stock of knowledge accepted by all leading ācāryas. Even Śaṅkara accepts Vedānta-sūtra as such. Therefore such authority should be consulted.

The ultimate control is invested in the Supersoul. As it is stated in the Bhagavad-gītā, sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ. He is engaging everyone in certain activities by reminding him of his past actions. And Kṛṣṇa conscious acts done under His direction from within yield no reaction, either in this life or in the life after death.

🌹 🌹 🌹 🌹 🌹


01 Jan 2021