శ్రీమద్భగవద్గీత - 611: 18వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 611: Chap. 18, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత - 611 / Bhagavad-Gita - 611 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 28 🌴

28. ఆయుక్త: ప్రాకృత: స్తబ్ధ: శఠో నైష్కృతికోలస: |
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ||


🌷. తాత్పర్యం :

భౌతికాసక్తుడును, మొండితనము కలవాడును, మోసము చేయువాడును, ఇతరులను అవమానించుటయందు దక్షుడును, సోమరియును, సదా చింతాక్రాంతుడును, వృథా కాలవ్యయమును చేయువాడునునై సదా శాస్త్ర నిర్దేశములకు విరుద్ధముగా కర్మనొనరించువాడు తమోగుణకర్తయని చెప్పబడును.

🌷. భాష్యము :

ఎటువంటి కర్మము చేయదగినదో, ఎటువంటి కర్మము చేయరానిదో శాస్త్రనిర్దేశములందు మనము గాంచవచ్చును. అటువంటి శాస్త్రనిర్దేశములను లెక్కజేయనివారు చేయరానటువంటి కర్మ యందే నియుక్తులగుచు సాధారణముగా భౌతికాసక్తులై యుందురు. వారు ప్రకృతి త్రిగుణముల ననుసరించియే వర్తింతురు గాని శాస్త్రనియమముల ననుసరించి కాదు. అట్టి కర్తలు మృదుద్వాభావులై యుండక సాధారణముగా మోసకారులు మరియు ఇతరులను అవమానపరచుట యందు దక్షులై యుందురు.

సోమరులై యుండు అట్టివారు చేయవలసిన పని ఉన్నప్పటికిని దానిని సక్రమముగా ఒనరింపక తరువాత చేయుదుమని ప్రక్కకు పెట్టుదురు. తత్కారణముగా వారు చింతాక్రాంతులై యుందురు. కాలవిలంబనము చేయుటలో వారు అత్యంత దక్షులై యుండి గంటలో చేయవలసిన కార్యమును సంవత్సరముల తరబడి ఒనరింతురు. అటువంటి కర్తలు తమోగుణమునందు నిలిచినట్టివారు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 611 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 28 🌴

28. ayuktaḥ prākṛtaḥ stabdhaḥ śaṭho naiṣkṛtiko ’lasaḥ
viṣādī dīrgha-sūtrī ca kartā tāmasa ucyate


🌷 Translation :

The worker who is always engaged in work against the injunctions of the scripture, who is materialistic, obstinate, cheating and expert in insulting others, and who is lazy, always morose and procrastinating is said to be a worker in the mode of ignorance.

🌹 Purport :

In the scriptural injunctions we find what sort of work should be performed and what sort of work should not be performed. Those who do not care for those injunctions engage in work not to be done, and such persons are generally materialistic.

They work according to the modes of nature, not according to the injunctions of the scripture. Such workers are not very gentle, and generally they are always cunning and expert in insulting others.

They are very lazy; even though they have some duty, they do not do it properly, and they put it aside to be done later on. Therefore they appear to be morose. They procrastinate; anything which can be done in an hour they drag on for years. Such workers are situated in the mode of ignorance.

🌹 🌹 🌹 🌹 🌹


16 Jan 2021