✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 26 🌴
26. ముక్తసఙ్గోనహంవాదీ ధృత్యుత్సాహసమన్విత: |
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికార: కర్తా సాత్త్విక ఉచ్యతే ||
🌷. తాత్పర్యం :
త్రిగుణ సంగత్వరహితముగా మిథ్యాహంకారము లేకుండా నిశ్చయము మరియు ఉత్సాహములను గూడి, జయాపజయములందు నిర్వికారుడై తన ధర్మమును నిర్వర్తించువాడు సాత్త్వికకర్త యనబడును.
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనాయుతుడు సర్వదా ప్రకృతి త్రిగుణములకు అతీతుడైయుండును. మిథ్యాహంకారము మరియు గర్వములకు అతీతుడై యుండుటచే తన కొసగబడిన కర్మ యొక్క ఫలమును అతడు ఆశించకుండును. అయినను అట్టి కర్మ పూర్తియగు నంతవరకును అతడు పూర్ణమగు ఉత్సాహమును కలిగియుండును.
కార్యసాధనలో కలుగు క్లేశములను లెక్క పెట్టక సదా ఉత్సాహపూర్ణుడై యుండును. జయాపజయములను పట్టించుకొనక అతడు సుఖదుఃఖములందు సమచిత్తమును కలిగియుండును. అటువంటి కర్త సత్త్వగుణమునందు స్థితిని కలిగియుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 609 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 26 🌴
26. mukta-saṅgo ’nahaṁ-vādī dhṛty-utsāha-samanvitaḥ
siddhy-asiddhyor nirvikāraḥ kartā sāttvika ucyate
🌷 Translation :
One who performs his duty without association with the modes of material nature, without false ego, with great determination and enthusiasm, and without wavering in success or failure is said to be a worker in the mode of goodness.
🌹 Purport :
A person in Kṛṣṇa consciousness is always transcendental to the material modes of nature. He has no expectations for the result of the work entrusted to him, because he is above false ego and pride. Still, he is always enthusiastic till the completion of such work.
He does not worry about the distress undertaken; he is always enthusiastic. He does not care for success or failure; he is equal in both distress and happiness. Such a worker is situated in the mode of goodness.
🌹 🌹 🌹 🌹 🌹
14 Jan 2021