శ్రీమద్భగవద్గీత - 597: 18వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 597: Chap. 18, Ver. 14


🌹. శ్రీమద్భగవద్గీత - 597 / Bhagavad-Gita - 597 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 14 🌴

14. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ |
వివిధాశ్చ పృథకే చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ||


🌷. తాత్పర్యం :

కార్యస్థానము (దేహము), కర్త, వివిధేంద్రియములు, వివిధములైన యత్నములు, చివరగా పరమాత్ముడు అనెడి ఈ ఐదును కార్యమునకు కారణములై యున్నవి


🌷. భాష్యము :

ఇచ్చట “అధిష్ఠానమ్” అను పదము దేహమును సూచించుచున్నది. అట్టి దేహమునందున్న ఆత్మ కర్మఫలములకై వర్తించుచున్నందున “కర్త” యని తెలియబడుచున్నది. అట్టి ఆత్మ జ్ఞాత మరియు కర్త యని శృతియందు పేర్కొనబడినది. “ఏషహి ద్రష్టా స్రష్టా” (ప్రశ్నోపనిషత్తు 4.9).

ఇదే విషయము “జ్ఞోఽత ఏవ” (2.3.18) మరియు “కర్తా శాస్త్రర్థవత్వాత్” (2.3.33) అను వేదాంతసూత్రముల ద్వారా నిర్ధారితమైనది. ఇంద్రియములు కర్మసాధనములు కాగా, ఆత్మ అట్టి ఇంద్రియముల ద్వారా వివిధరీతుల వర్తించుచుండును. ప్రతికార్యమునకు వివిధ యత్నములు అవసరము.

కాని మనుజుని ఆ కార్యములన్నియును మిత్రుని రూపమున హృదయస్థుడై యున్న పరమాత్ముని పైననే అంత్యమున ఆధారపడియున్నవి. అనగా అతడే కార్యములన్నింటికిని పరమకారణమై యున్నాడు. ఇటువంటి స్థితిలో హృదయస్థుడైన పరమాత్మ నేతృత్వమున కృష్ణభక్తిరసభావనలో వర్తించువాడు సహజముగా ఎటువంటి కర్మ చేతను బంధితుడు కాకుండును.

అనగా సంపూర్ణముగా కృష్ణభక్తిరసభావితులైనవారు తమ కార్యములకు ఏ విధముగను అంత్యమున బాధ్యులు కారు. ప్రతిదియు దివ్యసంకల్పము (పరమాత్ముడు, దేవదేవుడు) పైననే ఆధారపడియుండును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 597 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 14 🌴

14. adhiṣṭhānaṁ tathā kartā karaṇaṁ ca pṛthag-vidham
vividhāś ca pṛthak ceṣṭā daivaṁ caivātra pañcamam


🌷 Translation :

The place of action [the body], the performer, the various senses, the many different kinds of endeavor, and ultimately the Supersoul – these are the five factors of action.


🌹 Purport :

The word adhiṣṭhānam refers to the body. The soul within the body is acting to bring about the results of activity and is therefore known as kartā, “the doer.” That the soul is the knower and the doer is stated in the śruti. Eṣa hi draṣṭā sraṣṭā (Praśna Upaniṣad 4.9). It is also confirmed in the Vedānta-sūtra by the verses jño ’ta eva (2.3.18) and kartā śāstrārthavattvāt (2.3.33).

The instruments of action are the senses, and by the senses the soul acts in various ways. For each and every action there is a different endeavor. But all one’s activities depend on the will of the Supersoul, who is seated within the heart as a friend. The Supreme Lord is the supercause.

Under these circumstances, he who is acting in Kṛṣṇa consciousness under the direction of the Supersoul situated within the heart is naturally not bound by any activity. Those in complete Kṛṣṇa consciousness are not ultimately responsible for their actions. Everything is dependent on the supreme will, the Supersoul, the Supreme Personality of Godhead.

🌹 🌹 🌹 🌹 🌹


02 Jan 2021