శ్రీమద్భగవద్గీత - 600: 18వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 600: Chap. 18, Ver. 17


🌹. శ్రీమద్భగవద్గీత - 600 / Bhagavad-Gita - 600 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 17 🌴

17. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే |
హత్వాపి స ఇమాన్ లోకాన్న హన్తి న నిబధ్యతే ||


🌷. తాత్పర్యం :

మిథ్యాహంకారముచే ప్రభావితుడు కానివాడును, సంగత్వరహిత బుద్ధిని కలిగినవాడును అగు మనుజుద్ జగమునందు జనులను సంహరించినను సంహారమొనర్చనట్లే యగును. అతడెన్నడును తన కర్మలచే బద్దుడు కాడు.


🌷. భాష్యము :

యుద్ధము చేయరాదనెడి కోరిక మిథ్యాహంకారము నుండి ఉద్భవించుచున్నదని శ్రీకృష్ణభగవానుడు అర్జునునికి ఈ శ్లోకమున తెలియజేయుచున్నాడు. అర్జునుడు తనను కర్తగా భావించెనే గాని అంతర్భాహ్యములందు సూచనలొసగు భగవానుని గమనింపలేదు. కర్మనొనర్చుటకు దివ్యమైన అనుజ్ఞ ఒకటుండునని తెలియనిచో అతడు కర్మ నెందులకు చేయవలెను? కాని కర్మసాధనములను, కర్తగా తనను మరియు దివ్యానుజ్ఞకర్తగా శ్రీకృష్ణభగవానుని తెలిసికొనగలిగినవాడు ఏ కార్యము నొనర్చుట యందై నను పూర్ణుడై యుండును. అట్టివాడు ఎన్నడును మోహమునకు గురి కాడు.

నేనే చేయుచున్నాను, నాదే బాధ్యత అనెడి భావములు మిథ్యాహంకారము మరియు నాస్తికత్వము (కృష్ణభక్తిరాహిత్యము) నుండి ఉద్భవించుచున్నవి. పరమాత్ముని (లేదా భగవానుని) నిర్దేశమునందు కృష్ణభక్తిభావన యందు వర్తించువాడు సంహారకార్య మొనర్చినను సంహరింపనివాడే యగును.

ఆలాగుననే సంహారముచే కలుగు ప్రతిచర్య చేతను అతడు ప్రభావితుడు కాకుండును. ఉన్నతసైన్యాధికారి ఆజ్ఞపై సంహారమును సాగించు సైనికుడు ఎన్నడును అపరాధమునకు గురికాడు. కాని సైనికుడు తన స్వంత కారణమున ఎవరినేని చంపినచో చట్టముచే తప్పక శిక్షకు గురిచేయుబడును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 600 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 17 🌴

17. yasya nāhaṅkṛto bhāvo buddhir yasya na lipyate
hatvāpi sa imāḻ lokān na hanti na nibadhyate


🌷 Translation :

One who is not motivated by false ego, whose intelligence is not entangled, though he kills men in this world, does not kill. Nor is he bound by his actions.


🌹 Purport :

In this verse the Lord informs Arjuna that the desire not to fight arises from false ego. Arjuna thought himself to be the doer of action, but he did not consider the supreme sanction within and without.

If one does not know that a supersanction is there, why should he act? But one who knows the instruments of work, himself as the worker, and the Supreme Lord as the supreme sanctioner is perfect in doing everything. Such a person is never in illusion.

Personal activity and responsibility arise from false ego and godlessness, or a lack of Kṛṣṇa consciousness. Anyone who is acting in Kṛṣṇa consciousness under the direction of the Supersoul or the Supreme Personality of Godhead, even though killing, does not kill.

Nor is he ever affected by the reaction of such killing. When a soldier kills under the command of a superior officer, he is not subject to be judged. But if a soldier kills on his own personal account, then he is certainly judged by a court of law.

🌹 🌹 🌹 🌹 🌹


05 Jan 2021