శ్రీమద్భగవద్గీత - 602: 18వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 602: Chap. 18, Ver. 19


🌹. శ్రీమద్భగవద్గీత - 602 / Bhagavad-Gita - 602 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 19 🌴

19. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదత: |
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛ్రుణు తాన్యపి ||


🌷. తాత్పర్యం :

ప్రక్రుతిజన్య త్రిగుణముల ననుసరించి జ్ఞానము, కర్మము, కర్త యనునవి మూడురకములు. ఇక వానిని గూర్చి నా నుండి ఆలకింపుము.


🌷. భాష్యము :

చతుర్దధ్యాయమున ప్రకృతిజన్య త్రిగుణముల విస్తారముగా వివరింపబడినవి. సత్త్వగుణము ప్రకాశమానమనియు, రజోగుణము భౌతికభావ సమన్వితమనియు, తమోగుణము సోమరితనము మరియు మాంద్యములకు కారణభూతమనియు అధ్యాయమని తెలుపబడినది. ఆ త్రిగుణములన్నియు బంధకారణములే గాని ముక్తికి హేతువులు కావు.

సత్త్వగుణమునందు కూడా జీవుడు బద్ధుడే యగుచున్నాడు. అట్టి వివిధగుణములను కలిగియున్న వివిధజనులచే చేయబడు వివిధార్చనములు సప్తదశాధ్యాయమున వివరింపబడినవి. ఇక అట్టి త్రిగుణముల ననుసరించియున్న వివిధజ్ఞానములను, కర్తలను, కర్మలను తాను వివరింపగోరుచున్నట్లు శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున పలుకుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 602 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 19 🌴

19. jñānaṁ karma ca kartā ca tridhaiva guṇa-bhedataḥ
procyate guṇa-saṅkhyāne yathāvac chṛṇu tāny api


🌷 Translation :

According to the three different modes of material nature, there are three kinds of knowledge, action and performer of action. Now hear of them from Me.


🌹 Purport :

In the Fourteenth Chapter the three divisions of the modes of material nature were elaborately described. In that chapter it was said that the mode of goodness is illuminating, the mode of passion materialistic, and the mode of ignorance conducive to laziness and indolence. All the modes of material nature are binding; they are not sources of liberation. Even in the mode of goodness one is conditioned.

In the Seventeenth Chapter, the different types of worship by different types of men in different modes of material nature were described. In this verse, the Lord says that He wishes to speak about the different types of knowledge, workers and work itself according to the three material modes.

🌹 🌹 🌹 🌹 🌹


07 Jan 2021