శ్రీమద్భగవద్గీత - 601: 18వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 601: Chap. 18, Ver. 18


🌹. శ్రీమద్భగవద్గీత - 601 / Bhagavad-Gita - 601 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 18 🌴

18. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా |
కరణం కర్మ కర్తేతి త్రివిధ: కర్మసంగ్రహ: ||


🌷. తాత్పర్యం :

జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనెడి మూడుఅంశములు కర్మకు ప్రేరణములు కాగా, ఇంద్రియములు, కార్యము, కర్త యనునవి కర్మ యొక్క మూడుఅంశములై యున్నవి.


🌷. భాష్యము :

ప్రతిదినము ఒనర్చబడు కర్మలకు జ్ఞానము, జ్ఞానలక్ష్యము, జ్ఞాత అనెడి మూడుఅంశములు ప్రేరణములై యున్నవి. కర్మనొనరించుటకు అవసరమగు సాధనములు, కర్మము, కర్త యనునవి కర్మ యొక్క అంశములుగా పిలువబడును.

మనుజుడొనర్చు ప్రతికర్మయు వీటన్నింటిని కలిగియుండును. మనుజుడు కార్యమును ప్రారంభించుటకు మొదలు దానికి కొంత ప్రేరణము అవసరము. కార్యము సిద్ధించుటకు పూర్వమే ఊహింపబడు పరిష్కారము కర్మ యొక్క సూక్ష్మరూపమై యున్నది.

అటుపిమ్మట కార్యము కర్మరూపము దాల్చును. అనగా ఏదేని కర్మ నారంభించుటకు మొదట మనుజుడు ఆలోచన, అనుభవము, సంకల్పములను ఒనరింపవలసివచ్చును. అదియే ప్రేరణమనబడును. అట్టి ప్రేరణము శాస్త్రము నుండి లభించినను లేదా గురూపదేశమే లభించినను ఏకరీతిగనే ఉండును.

ఆ విధముగా ప్రేరణము మరియు కర్త ఉన్నప్పుడు వాస్తవమగు కర్మ ఇంద్రియ సహాయమున ఒనగూడును. ఇంద్రియములలో ముఖ్యమైన మనస్సు కూడా అందు పాల్గొనును. కర్మయందలి వీటిన్నింటి సముదాయమే కర్మసంగ్రహముమనబడును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 601 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 18 🌴

18. jñānaṁ jñeyaṁ parijñātā tri-vidhā karma-codanā
karaṇaṁ karma karteti tri-vidhaḥ karma-saṅgrahaḥ


🌷 Translation :

Knowledge, the object of knowledge, and the knower are the three factors that motivate action; the senses, the work and the doer are the three constituents of action.


🌹 Purport :

There are three kinds of impetus for daily work: knowledge, the object of knowledge, and the knower. The instruments of work, the work itself and the worker are called the constituents of work.

Any work done by any human being has these elements. Before one acts, there is some impetus, which is called inspiration. Any solution arrived at before work is actualized is a subtle form of work. Then work takes the form of action. First one has to undergo the psychological processes of thinking, feeling and willing, and that is called impetus.

The inspiration to work is the same if it comes from the scripture or from the instruction of the spiritual master. When the inspiration is there and the worker is there, then actual activity takes place by the help of the senses, including the mind, which is the center of all the senses. The sum total of all the constituents of an activity is called the accumulation of work.

🌹 🌹 🌹 🌹 🌹


06 Jan 2021