శ్రీమద్భగవద్గీత - 617: 18వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 617: Chap. 18, Ver. 34


🌹. శ్రీమద్భగవద్గీత - 617 / Bhagavad-Gita - 617 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 34 🌴

34. యయా తు ధర్మకామార్థాన్ ధృత్వా ధారయతే(ర్జున |
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి: సా పార్థ రాజసీ ||


🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! కాని ఏ నిశ్చయముచే మనుజుడు ధర్మము, అర్థము, కామములందలి ఫలముల యెడ ఆసక్తిని వహించునో అట్టి నిశ్చయము రజోగుణప్రధానమైనట్టిది.


🌷. భాష్యము :

ఇంద్రియప్రీతి నొక్కదానినే కోరికగా కలిగి, ధర్మకార్యములు మరియు అర్థకార్యముల ఫలములను వాంచించు మనుజుడు తన మనస్సును, ప్రాణమును, ఇంద్రియములను తద్రీతిగనే నియుక్తము చేయుచు రజోగుణప్రధానుడు అనబడును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 617 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 34 🌴

34. yayā tu dharma-kāmārthān
dhṛtyā dhārayate ’rjuna
prasaṅgena phalākāṅkṣī
dhṛtiḥ sā pārtha rājasī


🌷 Translation :

But that determination by which one holds fast to fruitive results in religion, economic development and sense gratification is of the nature of passion, O Arjuna.


🌹 Purport :

Any person who is always desirous of fruitive results in religious or economic activities, whose only desire is sense gratification, and whose mind, life and senses are thus engaged is in the mode of passion.

🌹 🌹 🌹 🌹 🌹


23 Jan 2021