శ్రీమద్భగవద్గీత - 621: 18వ అధ్., శ్లో 38 / Bhagavad-Gita - 621: Chap. 18, Ver. 38


🌹. శ్రీమద్భగవద్గీత - 621 / Bhagavad-Gita - 621 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 38 🌴

38. విషయేన్ద్రియ సంయోగాద్యత్తదగ్రే మృతోపమమ్ |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ||


🌷. తాత్పర్యం :

ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంపర్కము నొందగా లభించునటు వంటిదియు మరియు ఆదిలో అమృతమువలె, అంత్యమున విషమువలె తోచునదియు నైన సుఖము రజోగుణ ప్రధానమైనదని భావింపబడును.


🌷. భాష్యము :

యువతీయువకులు కలసినప్పుడు ఆమెను తదేకముగా చూచుటకు, తాకుటకు, ఆమెతో భోగించుటకు ఇంద్రియములు యువకుని ప్రేరేపించుచుండును.

ఆదిలో ఇట్టి కార్యములు ఇంద్రియములకు అత్యంత ప్రీతికరముగా తోచినను అంత్యమున లేదా కొంతకాలమునకు అవి విషప్రాయములే కాగలవు. వారు విడిపోవుటయో లేదా విడాకులు పొందుటయో జరిగి దుఃఖము, విచారము కలుగుచుండును. అట్టి సుఖము సదా రజోగుణ ప్రధానమై యుండును.

అనగా ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములు సంయోగముచే లభించు సుఖము చివరకు దుఃఖకారణమే కాగలదు. కావున అది సర్వదా వర్ణింపదగినదై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 621 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 38 🌴

38. viṣayendriya-saṁyogād
yat tad agre ’mṛtopamam
pariṇāme viṣam iva
tat sukhaṁ rājasaṁ smṛtam


🌷 Translation :

That happiness which is derived from contact of the senses with their objects and which appears like nectar at first but poison at the end is said to be of the nature of passion.


🌹 Purport :

A young man and a young woman meet, and the senses drive the young man to see her, to touch her and to have sexual intercourse. In the beginning this may be very pleasing to the senses, but at the end, or after some time, it becomes just like poison.

They are separated or there is divorce, there is lamentation, there is sorrow, etc. Such happiness is always in the mode of passion. Happiness derived from a combination of the senses and the sense objects is always a cause of distress and should be avoided by all means.

🌹 🌹 🌹 🌹 🌹


27 Jan 2021