శ్రీమద్భగవద్గీత - 606: 18వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 606: Chap. 18, Ver. 23
🌹. శ్రీమద్భగవద్గీత - 606 / Bhagavad-Gita - 606 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 23 🌴
23. నియతం సఙ్గరహితమరాగద్వేషత: కృతమ్ |
అఫలప్రేప్సునా కరమ యత్తత్సాత్త్వికముచ్యతే ||
🌷. తాత్పర్యం :
నియమబద్ధమైనదియు, సంగరహితముగను రాగద్వేషరహితముగను ఒనరింప బడునదియు, ఫలాపేక్ష లేనటువంటిదియు నైన కర్మము సత్త్వగుణము నందున్నట్టిదిగా చెప్పబడును.
🌷. భాష్యము :
వర్ణాశ్రమధర్మముల దృష్ట్యా శాస్త్రమునందు నిర్దేశింపబడిన నియమబద్ధకర్మలను ఆసక్తిగాని, స్వామిత్వముగాని లేకుండా రాగద్వేష రహితముగా, భక్తిభావనలో శ్రీకృష్ణభగవానుని ప్రీత్యర్థమై స్వభోగవాంఛారహితముగా ఒనరించినపుడు అట్టి కర్మలు సత్త్వగుణ ప్రధానమనబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 606 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 23 🌴
23. niyataṁ saṅga-rahitam arāga-dveṣataḥ kṛtam
aphala-prepsunā karma yat tat sāttvikam ucyate
🌷 Translation :
That action which is regulated and which is performed without attachment, without love or hatred, and without desire for fruitive results is said to be in the mode of goodness.
🌹 Purport :
Regulated occupational duties, as prescribed in the scriptures in terms of the different orders and divisions of society, performed without attachment or proprietary rights and therefore without any love or hatred, and performed in Kṛṣṇa consciousness for the satisfaction of the Supreme, without self-satisfaction or self-gratification, are called actions in the mode of goodness.
🌹 🌹 🌹 🌹 🌹
11 Jan 2021