శ్రీమద్భగవద్గీత - 616: 18వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 616: Chap. 18, Ver. 33


🌹. శ్రీమద్భగవద్గీత - 616 / Bhagavad-Gita - 616 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 33 🌴

33. ధృత్వా యయా ధారయతే మన:ప్రాణేన్ద్రియక్రియా: |
యోగేనావ్యభిచారిణ్యే ధృతి: సా పార్థ సాత్త్వికీ ||


🌷. తాత్పర్యం :

ఓ పృథాకుమారా! అవిచ్చిన్నమైనదియు, యోగాభ్యాసముచే స్థిరముగా కొనసాగునదియు, తత్కారణముగా ఇంద్రియ, మనో, ప్రాణముల కార్యములను నియమించునదియు నైన నిశ్చయము సత్త్వగుణప్రధానమైనది.


🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాహనము చేసికొనుట యోగము ఒక మార్గము వంటిది. ఇంద్రియ, మనో, ప్రాణముల కార్యములను సంపూర్ణముగా కేంద్రీకరించి ధృఢనిశ్చయముతో అట్టి దేవదేవుని యందు స్థిరముగా లగ్నమైనవాడు కృష్ణభక్తిభావన యందు వర్తించినవాడగును.

అటువంటి స్థిరనిశ్చయము సత్త్వగుణప్రధానమైనది. కృష్ణభక్తిరసభావితులైనవారు ఎట్టి ఇతర కార్యములచే పెడత్రోవ పట్టరని సూచించుచున్నందున ఈ శ్లోకమునందు “ఆవ్యభిచారిణ్యా” యను పదము ప్రాధాన్యమును సంతరించుకొన్నది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 616 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 33 🌴

33. dhṛtyā yayā dhārayate
manaḥ-prāṇendriya-kriyāḥ
yogenāvyabhicāriṇyā
dhṛtiḥ sā pārtha sāttvikī


🌷 Translation :

O son of Pṛthā, that determination which is unbreakable, which is sustained with steadfastness by yoga practice, and which thus controls the activities of the mind, life and senses is determination in the mode of goodness.


🌹 Purport :

Yoga is a means to understand the Supreme Soul. One who is steadily fixed in the Supreme Soul with determination, concentrating one’s mind, life and sensory activities on the Supreme, engages in Kṛṣṇa consciousness.

That sort of determination is in the mode of goodness. The word avyabhicāriṇyā is very significant, for it indicates that persons who are engaged in Kṛṣṇa consciousness are never deviated by any other activity.

🌹 🌹 🌹 🌹 🌹


21 Jan 2021