శ్రీమద్భగవద్గీత - 620: 18వ అధ్., శ్లో 37 / Bhagavad-Gita - 620: Chap. 18, Ver. 37


🌹. శ్రీమద్భగవద్గీత - 620 / Bhagavad-Gita - 620 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 37 🌴

37. యత్తదగ్రే విషమివ పరిణామే(మృతోపమమ్ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్ ||


🌷. తాత్పర్యం :

ఆది యందు విషప్రాయముగా నుండి అంత్యమున అమృతముతో సమానమగునదియు మరియు ఆత్మానుభూతి యెడ మనుజుని జాగృతుని చేయునదియు నైన సుఖము సత్త్వగుణప్రధానమైనదని చెప్పబడును.


🌷. భాష్యము :

ఆత్మానుభూతిని పొందు యత్నములో మనుజుడు మనస్సు, ఇంద్రియములను నిగ్రహించుట మరియు మనస్సును ఆత్మయందు లగ్నము చేయుటకు పలు విధినియమములను అనుసరింపవలసివచ్చును.

ఆ విధి నియమములన్నియును విషమువలె అతి చేదుగా నుండును. కాని మనుజుడు వానిని అనుసరించుట యందు కృతకృత్యుడై దివ్యమైన ఆధ్యాత్మికస్థితికి చేరగలిగినచో నిజమైన అమృతాస్వాదనమును ప్రారమభించి జీవితమున సుఖింపగలడు.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 620 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj



🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 37 🌴

37. yat tad agre viṣam iva
pariṇāme ’mṛtopamam
tat sukhaṁ sāttvikaṁ proktam
ātma-buddhi-prasāda-jam


🌷 Translation :

That which in the beginning may be just like poison but at the end is just like nectar and which awakens one to self-realization is said to be happiness in the mode of goodness.


🌹 Purport :

In the pursuit of self-realization, one has to follow many rules and regulations to control the mind and the senses and to concentrate the mind on the self.

All these procedures are very difficult, bitter like poison, but if one is successful in following the regulations and comes to the transcendental position, he begins to drink real nectar, and he enjoys life.

🌹 🌹 🌹 🌹 🌹


26 Jan 2021