శ్రీమద్భగవద్గీత - 215: 05వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 215: Chap. 05, Ver. 11


🌹. శ్రీమద్భగవద్గీత - 215 / Bhagavad-Gita - 215 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 11 🌴

11. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి |
యోగిన: కర్మ కుర్వన్తి సజ్ఞం త్యక్త్వాత్మశుద్ధయే


🌷. తాత్పర్యం :

యోగులైన వారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి యను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మ నొనరింతురు.

🌷. భాష్యము :

యోగులైనవారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి యను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియములతో చేయబడు ఏ కర్మయైనను భౌతికకల్మషము నుండి పవిత్రమగును. అనగా కృష్ణభక్తిపరాయణుడు ఒనరించు కర్మలు ఎటువంటి భౌతిక కర్మ ఫలమును కలుగజేయబోవు. కనుకనే సదాచారములని పిలువబడు పవిత్రకర్మలను కృష్ణభక్తిభావన యందు నిలిచి సులభముగా నిర్వహింపవచ్చును. భక్తిరసామృతసింధువు (1.2.187) నందు ఈ విషయమును రూపగోస్వామిని ఇట్లు వివరించియుండిరి.


ఈహా యస్య హరేర్దాస్యే కర్మణా మనసా గిరా |
నిఖిలాస్వపి అవస్థాసూ జీవన్ముక్త: స ఉచ్యతే

“దేహము, మనస్సు, బుద్ధి, వాక్కులచే కృష్ణభక్తిరసభావన యందు వర్తించెడివాడు(కృష్ణ సేవానురక్తుడు) పలు నామమాత్ర లౌకికకర్మల యందు నియుక్తుడైనప్పటికిని భౌతికజగమున ముక్తపురుషుడే యగును.” దేహాత్మభావనము లేనందున అతడు మిథ్యాహంకారము లేకుండును. తాను దేహమును కాదనియు మరియు ఈ దేహము తనది కాదనియు అతడు సంపూర్ణముగా నెరుగును.

తాను కృష్ణునికి చెందినవాడు కనుక తన దేహము సైతము కృష్ణునిదే యని అతడు భావించును. దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము మొదలగు సమస్తమును కృష్ణుని సేవ యందే వినియోగించుటచే అతడు శీఘ్రమే కృష్ణునితో సన్నిహితత్వమును పొందును. కృష్ణునితో అతడు ఏకత్వమును కలిగియుండి, దేహాత్మభావనము వంటివి కలిగించు మిథ్యాహంకారమునకు దూరుడై యుండును. ఇదియే కృష్ణభక్తిరసభావనమందలి పూర్ణత్వస్థితియై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 215 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 11 🌴

11. kāyena manasā buddhyā kevalair indriyair api
yoginaḥ karma kurvanti saṅgaṁ tyaktvātma-śuddhaye


🌷 Translation :

The yogīs, abandoning attachment, act with body, mind, intelligence and even with the senses, only for the purpose of purification.

🌹 Purport :

When one acts in Kṛṣṇa consciousness for the satisfaction of the senses of Kṛṣṇa, any action, whether of the body, mind, intelligence or even the senses, is purified of material contamination. There are no material reactions resulting from the activities of a Kṛṣṇa conscious person.

Therefore purified activities, which are generally called sad-ācāra, can be easily performed by acting in Kṛṣṇa consciousness. Śrī Rūpa Gosvāmī in his Bhakti-rasāmṛta-sindhu (1.2.187) describes this as follows:


īhā yasya harer dāsye karmaṇā manasā girā
nikhilāsv apy avasthāsu jīvan-muktaḥ sa ucyate

“A person acting in Kṛṣṇa consciousness (or, in other words, in the service of Kṛṣṇa) with his body, mind, intelligence and words is a liberated person even within the material world, although he may be engaged in many so-called material activities.”

He has no false ego, for he does not believe that he is this material body, or that he possesses the body. He knows that he is not this body and that this body does not belong to him. He himself belongs to Kṛṣṇa, and the body too belongs to Kṛṣṇa. When he applies everything produced of the body, mind, intelligence, words, life, wealth, etc. – whatever he may have within his possession – to Kṛṣṇa’s service, he is at once dovetailed with Kṛṣṇa. He is one with Kṛṣṇa and is devoid of the false ego that leads one to believe that he is the body, etc. This is the perfect stage of Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


30 Nov 2019