శ్రీమద్భగవద్గీత - 211: 05వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 211: Chap. 05, Ver. 07


🌹. శ్రీమద్భగవద్గీత - 211 / Bhagavad-Gita - 211 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 07 🌴

07. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియ: |
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ||



🌷. తాత్పర్యం :

భక్తియోగముతో కర్మనొనరించువాడును, విశుద్ధాత్ముడును, ఇంద్రియ, మనస్సులను జయించినవాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడై యుండును. సర్వుల యెడ అతడు ప్రియమును కలిగియుండును. అట్టివాడు సదాకర్మల నాచారించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు.


🌷. భాష్యము :

కృష్ణభక్తి భావన ద్వారా ముక్తి మార్గమున పయనించువాడు సర్వజీవులకు పరమప్రియుడై యుండును మరియు సర్వజీవులు అతనికి ప్రియులై యుందురు. అతని కృష్ణభక్తి భావనమే అందులకు కారణము. పత్రములు, కొమ్మలు వంటివి వృక్షము నుండి వేరు కానట్లుగా, ఏ జీవియు కృష్ణుని నుండి వేరు కాదని అట్టి భక్తుడు భావించును. వృక్షపు మొదలుకు నీరుపోయుట ద్వారా ఆకులు మరియు కొమ్మలన్నింటికిని నీరు సరఫార యగుననియు లేదా ఉదరమునకు ఆహారము నందించుట ద్వారా దేహమంతయు అప్రయత్నముగా శక్తిని పొందుననియు అతడు ఎరిగియుండును. కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించువాడు సర్వులకు దాసుని వలె వర్తించును కావున సర్వులకు ప్రియుడై యుండును.

“అట్టి యెడ అర్జునుడు ఏ విధముగా యుద్దరంగమున ఇతరులకు అపకారము చేసెను? అతడు కృష్ణభక్తిపూర్ణుడు కాడా?” అని ఎవ్వరైనను ప్రశ్నించు అవకాశము కలదు. కాని వాస్తవమునకు ఆత్మ చంపబడని కారణముగా యుద్ధరంగమునందు నిలిచినవారందరును వ్యక్తిగతముగా ఆత్మరూపములో నిలువనున్నందున (ద్వితీయాధ్యాయమున ఇది వరకే తెలుపబడినట్లు) అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే అయియున్నది. అనగా ఆధ్యాత్మికదృష్టిలో కురుక్షేత్రమునందు ఎవ్వరును మరణింపలేదు. స్వయముగా రణరంగమున నిలిచియున్న శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞ మేరకు వారు దుస్తులవంటి దేహములు మాత్రమే మార్చబడినవి.

అనగా అర్జునుడు కురుక్షేత్రరణరంగమున యుద్ధము చేసినను కేవలము శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సంపూర్ణభక్తిభావనలో నిర్వర్తింపజేసి యున్నందున నిజముగా యుద్ధము చేయనివాడే అయినాడు. అట్టివాడు ఎన్నడును కర్మఫలములచే బద్ధుడు కాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 211 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 5 - Karma Yoga - 07 🌴

07. yoga-yukto viśuddhātmā vijitātmā jitendriyaḥ
sarva-bhūtātma-bhūtātmā kurvann api na lipyate



🌷 Translation :

One who works in devotion, who is a pure soul, and who controls his mind and senses is dear to everyone, and everyone is dear to him. Though always working, such a man is never entangled.

🌹 Purport :

One who is on the path of liberation by Kṛṣṇa consciousness is very dear to every living being, and every living being is dear to him. This is due to his Kṛṣṇa consciousness. Such a person cannot think of any living being as separate from Kṛṣṇa, just as the leaves and branches of a tree are not separate from the tree. He knows very well that by pouring water on the root of the tree, the water will be distributed to all the leaves and branches, or by supplying food to the stomach, the energy is automatically distributed throughout the body.

One may ask, “Why then was Arjuna offensive (in battle) to others? Wasn’t he in Kṛṣṇa consciousness?” Arjuna was only superficially offensive because (as has already been explained in the Second Chapter) all the assembled persons on the battlefield would continue to live individually, as the soul cannot be slain. So, spiritually, no one was killed on the Battlefield of Kurukṣetra. Only their dresses were changed by the order of Kṛṣṇa, who was personally present.

Therefore Arjuna, while fighting on the Battlefield of Kurukṣetra, was not really fighting at all; he was simply carrying out the orders of Kṛṣṇa in full Kṛṣṇa consciousness. Such a person is never entangled in the reactions of work.

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2019