శ్రీమద్భగవద్గీత - 210: 05వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 210: Chap. 05, Ver. 06
🌹. శ్రీమద్భగవద్గీత - 210 / Bhagavad-Gita - 210 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 06 🌴
06. సన్న్యాసస్తు మాహాబాహో దుఃఖమాప్తుమయోగత: |
యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాధిగచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
భక్తియుతసేవ యందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందలేరు. కాని భక్తియోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు.
🌷. భాష్యము :
సన్న్యాసుల యందు(సన్న్యాసాశ్రమము నందున్నవారు) రెండు తరగతులవారు కలరు. మయావాద సన్న్యాసులు సాంఖ్యతత్త్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై యుండగా, వైష్ణవసన్న్యాసులు వేదాంతసూత్రములకు చక్కని భాష్యమైన శ్రీమద్భాగవతతత్త్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై యుందురు. మయావాదులు సైతము వేదాంతసూత్రములను అధ్యయనము చేసినను దాని కొరకు వారు శంకరాచార్యులు వ్రాసిన శారీరికభాష్యమనెడి తమ స్వంత వ్యాఖ్యానమును ఉపయోగింతురు.
భాగవతధర్మము నందు భక్తులు “పాంచరాత్రిక” విధానము ద్వారా భగవానుని భక్తియుక్తసేవ యందు నెలకొనియుందురు. కనుకనే భాగవతధర్మము ననుసరించు వైష్ణవసన్న్యాసులు భగవానుని దివ్యసేవ యందు పలురకములైన కర్మలను కలిగియుందురు. భౌతికకర్మలతో ఎట్టి సంబంధము లేకున్నను వారు భాగవత్సేవ కొరకై పలువిధములైన కర్మలలో నియుక్తులగుదురు. సాంఖ్యమునందు, వేదాంతాధ్యయనము నందు, మనోకల్పనల యందు మునిగియుండెడి మయావాద సన్న్యాసులు అట్టి దివ్యసేవా మధురిమను అనుభవింపలేరు.
అతిదీర్ఘమైన తమ అధ్యయనముల వలన వారు కొన్నిమార్లు పరబ్రహ్మమును గూర్చిన మానసికకల్పనల యెడ విసుగుచెంది శ్రీమద్భాగవతము నాశ్రయింతురు. కాని సరియైన అవగాహన లేకనే భాగవతమును స్వీకరించుచున్నందున వారి అధ్యయనము శ్రమ కారణమే కాగలదు. వాస్తవమునకు అట్టి శుష్క మానసికకల్పనలు మరియు కృత్రిమమైన నిరాకారభావపు వ్యాఖ్యానములు మయావాద సంన్యాసులకు నిరర్ధక కార్యములు. భక్తియోగమునందు చరించుచున్న వైష్ణవసన్న్యాసులు తమ దివ్య కర్మాచరణమునందు ఆనందము ననుభవించుచు అంత్యమున భగవద్ధామమును చేరుదుమనెడి అభయమును కలిగియుందురు.
కాని మాయావాద సన్న్యాసులు కొన్నిమార్లు ఆత్మానుభవమార్గము నుండి పతనము నొంది భౌతికకలాపములేయైన ధర్మకార్యములు మరియు పరహితముల వంటి లౌకికకర్మలలో తిరిగి ప్రవేశింతురు. కనుక సారాంశమేమనగా ఏది బ్రహ్మము మరియు ఏది బ్రహ్మము కాదనెడి మనోకల్పనల యందే నియుక్తులై యుండు మాయావాద సన్న్యాసుల కన్నను కృష్ణ భక్తిరస భావిత కర్మల యందు నియుక్తులైనవారు సరియైన స్థితిలో నెలకొనినట్టివారు. అయినను మయావాద సన్న్యాసులు సైతము బహుజన్మల పిదప కృష్ణభక్తిభావనకు పొందగలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 210 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 5 - Karma Yoga - 06 🌴
06. sannyāsas tu mahā-bāho duḥkham āptum ayogataḥ
yoga-yukto munir brahma na cireṇādhigacchati
🌷 Translation :
Merely renouncing all activities yet not engaging in the devotional service of the Lord cannot make one happy. But a thoughtful person engaged in devotional service can achieve the Supreme without delay.
🌹 Purport :
There are two classes of sannyāsīs, or persons in the renounced order of life. The Māyāvādī sannyāsīs are engaged in the study of Sāṅkhya philosophy, whereas the Vaiṣṇava sannyāsīs are engaged in the study of Bhāgavatam philosophy, which affords the proper commentary on the Vedānta-sūtras. The Māyāvādī sannyāsīs also study the Vedānta-sūtras, but use their own commentary, called Śārīraka-bhāṣya, written by Śaṅkarācārya.
The students of the Bhāgavata school are engaged in the devotional service of the Lord, according to pāñcarātrikī regulations, and therefore the Vaiṣṇava sannyāsīs have multiple engagements in the transcendental service of the Lord. The Vaiṣṇava sannyāsīs have nothing to do with material activities, and yet they perform various activities in their devotional service to the Lord. But the Māyāvādī sannyāsīs, engaged in the studies of Sāṅkhya and Vedānta and speculation, cannot relish the transcendental service of the Lord. Because their studies become very tedious, they sometimes become tired of Brahman speculation, and thus they take shelter of the Bhāgavatam without proper understanding.
🌹 🌹 🌹 🌹 🌹
26 Nov 2019