శ్రీమద్భగవద్గీత - 192: 04వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 192: Chap. 04, Ver. 30


🌹. శ్రీమద్భగవద్గీత - 192 / Bhagavad-Gita - 192 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 30 🌴


30. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషా: |
యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్ ||


🌷. తాత్పర్యం :

యజ్ఞ ప్రయోజనము నెరిగిన ఈ కర్తలందరును పాపఫలముల నుండి శుద్ధిపది, యజ్ఞఫలమనెడి అమృతమును ఆస్వాదించినందున నిత్యమైన భగవద్ధామము వైపునకు పురోగమింతురు.


🌷. భాష్యము :

ఇంతవరకు తెలిపిన వివిధ యజ్ఞముల (ద్రవ్యమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, యోగయజ్ఞము) వివరణను బట్టి ఇంద్రియనిగ్రహమే వాటన్నింటి మూలలక్ష్యమని అవగతమగుచున్నది. ఇంద్రియభోగానుభవమే భవబంధమునకు మూలకారణమై యున్నందున భోగానుభవముకు పరమైన స్థితి యందు నిలువనిదే ఎవ్వరును నిత్యమును మరియు జ్ఞానానందపూర్ణమును అగు నిత్యస్థితికి ఉద్దరింపబడు అవకాశము లేదు. అట్టి స్థితి నిత్యాకాశమునందు (పరబ్రహ్మాకాశము నందు) కలదు.

ఇంతవరకు తెలుపబడిన యజ్ఞములన్నియును భౌతికజీవనపు పాపఫలముల నుండి శుద్ధిపడుటకు మనుజునకు తోడ్పడును. ఇట్టి పురోగతి ద్వారా అతడు జీవితమునందు ఆనందమయుడు మరియు వైభవోపేతుడగుటయే గాక అంత్యమున నిరాకారబ్రహ్మమునందు లీనమగుట ద్వారా కాని లేదా దేవదేవుడైన శ్రీకృష్ణుని సాహచర్యమును పొందుట ద్వారా కాని నిత్యమైన భగవద్ధామమున ప్రవేశింపగలడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 192 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 30 🌴

30. sarve ’py ete yajña-vido yajña-kṣapita-kalmaṣāḥ
yajña-śiṣṭāmṛta-bhujo yānti brahma sanātanam


🌷 Translation :

All these performers who know the meaning of sacrifice become cleansed of sinful reactions, and, having tasted the nectar of the results of sacrifices, they advance toward the supreme eternal atmosphere.


🌹 Purport :

From the foregoing explanation of different types of sacrifice (namely sacrifice of one’s possessions, study of the Vedas or philosophical doctrines, and performance of the yoga system), it is found that the common aim of all is to control the senses. Sense gratification is the root cause of material existence; therefore, unless and until one is situated on a platform apart from sense gratification, there is no chance of being elevated to the eternal platform of full knowledge, full bliss and full life.

This platform is in the eternal atmosphere, or Brahman atmosphere. All the above-mentioned sacrifices help one to become cleansed of the sinful reactions of material existence. By this advancement in life, not only does one become happy and opulent in this life, but also, at the end, he enters into the eternal kingdom of God, either merging into the impersonal Brahman or associating with the Supreme Personality of Godhead, Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


8 Nov 2019