శ్రీమద్భగవద్గీత - 190: 04వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 190: Chap. 04, Ver. 28


🌹. శ్రీమద్భగవద్గీత - 190 / Bhagavad-Gita - 190 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 28 🌴


28. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయజ్ఞానయయజ్ఞాశ్చ యతయ: సంశితవ్రతా: ||

🌷. తాత్పర్యం :

కఠిన వ్రతములను చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించుట ద్వారా మరియు మరికొందరు తీవ్రతపస్సులను చేయుట ద్వారా, అష్టాంగయోగ పద్ధతిని పాటించుట ద్వారా లేదా దివ్యజ్ఞానపురోగతికై వేదాధ్యయనము నొనరించుట ద్వారా జ్ఞానవంతులగుదురు.

🌷. భాష్యము :

ఇచ్చట తెలుపబడిన యజ్ఞములను వివిధభాగములుగా విభజింపవచ్చును. పలువిధములైన దానముల రూపములలో తమ సంపత్తులను త్యాగము చేయువారు కొందరు కలరు. ధార్మిక కర్మలన్నియును “ద్రవ్యమయ యజ్ఞములు” అని పిలువబడును.

మరికొందరు ఉన్నత జీవనప్రాప్తి కొరకు లేదా ఉన్నత లోకములకు ఉద్దరింప బడుట కొరకు చంద్రాయణము మరియు చాతుర్మాస్యము వంటి పలువిధములైన కటిననియమములను, తపస్సులను స్వచ్ఛందముగా స్వీకరింతురు. ఈ విధానములందు నియమపూర్ణ జీవితమును గడుపుటకు తీవ్రవ్రతములను పాటింపవలసియుండును. ఉదాహరణకు చాతుర్మాస్యదీక్ష యందు మనుజుడు నాలుగునెలలు (జూలై నుండి అక్టోబరు) గడ్డమును తొలగించుకొనడు. కొన్నిరకముల ఆహారమును స్వీకరింపక ఏకభుక్తముండును. గృహమును విడిచి వెళ్ళకుండును. జీవిత సుఖమును త్యాగమొనర్చునటు వంటి ఆ యజ్ఞములు “తపోమయ యజ్ఞములు” అని పిలువబడును.

ఇంకను మరికొందరు బ్రహ్మమునందు లీనమవగోరి పతంజలి యోగము నందు గాని, హఠయోగము లేదా అష్టాంగ యోగము నందు కాని (సిద్ధులను కోరి) నియుక్తులగుదురు. ఇంకొందరు వివిధములైన తీర్థస్థానముల కేగుచుందురు. ఈ అభ్యాసములు భౌతికజగము నందు ఏదియో ఒక సిద్ధిని కోరి ఒనరింపబడును యోగ యజ్ఞములు. మరికొందరు ఉపనిషత్తులు, వేదాంత సూత్రముల వంటి వేదశాస్త్రములను లేదా సాంఖ్య జ్ఞానమును అధ్యయనము చేయుట యందు నియుక్తులగుదురు. అట్టివి స్వాధ్యాయయజ్ఞములు.

ఈ విధముగా యోగులందరను వివిధములైన యజ్ఞములందు నియుక్తులై ఉన్నతజీవనస్థితిని పొందగోరి యుందురు. కాని శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షసేవయై యున్నందున కృష్ణభక్తిరసభావన యనునది వీటన్నింటికి భిన్నమైనది. అది పైన తెలుపబడిన ఏ విధమైన యజ్ఞముల చేతను గాక కేవలము శ్రీకృష్ణభగవానుడు మరియు అతని ప్రామాణిక భక్తుల కరుణా చేతనే ప్రాప్తము కాగలదు. కనుకనే కృష్ణభక్తిరసభావనము దివ్యమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 190 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 4 - Jnana Yoga - 28 🌴

28. dravya-yajñās tapo-yajñā yoga-yajñās tathāpare
svādhyāya-jñāna-yajñāś ca yatayaḥ saṁśita-vratāḥ


🌷 Translation :

Having accepted strict vows, some become enlightened by sacrificing their possessions, and others by performing severe austerities, by practicing the yoga of eightfold mysticism, or by studying the Vedas to advance in transcendental knowledge.


🌹 Purport :

These sacrifices may be fitted into various divisions. There are persons who are sacrificing their possessions in the form of various kinds of charities. All charitable activities are called dravyamaya-yajña. There are others who, for higher elevation in life or for promotion to higher planets within the universe, voluntarily accept many kinds of austerities such as candrāyaṇa and cāturmāsya. These processes entail severe vows for conducting life under certain rigid rules. For example, under the cāturmāsya vow the candidate does not shave for four months during the year (July to October), he does not eat certain foods, does not eat twice in a day or does not leave home. Such sacrifice of the comforts of life is called tapomaya-yajña.

There are still others who engage themselves in different kinds of mystic yogas like the Patañjali system (for merging into the existence of the Absolute), or haṭha-yoga or aṣṭāṅga-yoga (for particular perfections). And some travel to all the sanctified places of pilgrimage. All these practices are called yoga-yajña, sacrifice for a certain type of perfection in the material world. There are others who engage themselves in the studies of different Vedic literatures, specifically the Upaniṣads and Vedānta-sūtras, or the Sāṅkhya philosophy. All of these are called svādhyāya-yajña, however, is different from these because it is the direct service of the Supreme Lord. Kṛṣṇa consciousness cannot be attained by any one of the above-mentioned types of sacrifice but can be attained only by the mercy of the Lord. Therefore, Kṛṣṇa consciousness is transcendental.

🌹 🌹 🌹 🌹 🌹


6 Nov 2019